ETV Bharat / state

చిన్న పరిశ్రమలపై జగన్నాటకం- ఎన్నికల వేల మళ్లీ సర్వేపేరుతో బకాయిలకు మంగళం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 1:12 PM IST

CM_Jagan_on_MSME_Sector
CM_Jagan_on_MSME_Sector

CM Jagan on MSME Sector: పథకాల పేర్లు మార్చడం లబ్ధిదారుల్ని ఏమార్చడం జగన్‌ సర్కార్‌కు వెన్నతో పెట్టిన విద్య.! పారిశ్రామిక వేత్తలను అలాగే మభ్యపెట్టాలని చూస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఉద్యోగ కల్పనలో కీలకమైన ఎంఎస్‌ఎంఈ(MSME)లపై 2020లో చేపట్టిన సర్వే రిపోర్టును బయటపెట్టని ప్రభుత్వం, మళ్లీ కొత్త సర్వే అని జగన్నాటకానికి తెరతీసింది.

CM Jagan on MSME Sector: వైసీపీ ప్రభుత్వం 2020లో చిన్న పరిశ్రమల డేటా బ్యాంక్‌ కోసమని సమగ్ర పరిశ్రమల సర్వే చేపట్టింది.! ఆ సర్వే ఏమైందో నేటికీ తెలియదు. కానీ మరో సర్వేను ప్రకటించింది. దానికి పెట్టిన పేరే రైజింగ్‌ అండ్‌ యాక్సిలరేటింగ్‌ ఎంఎస్‌ఎంఈ(Ministry of Micro, Small & Medium Enterprises) పెర్ఫార్మెన్స్‌-ర్యాంప్‌. 20 రోజుల్లో 20 లక్షల పైగా ఎంఎస్‌ఎంఈల సర్వే పూర్తి చేసి డేటా బ్యాంకు తయారు చేస్తామని, వాటి ద్వారా ఆయా పరిశ్రమలకు ఉన్న ఇబ్బందుల్ని గుర్తించి పరిష్కారం చూపుతామని చెప్తోంది. గత సర్వే ఏమైందో తెలియకుండా ఇప్పుడు పేరు మార్చి సాధించేదేంటో ప్రభుత్వ అధికారులెవరూ నోరు తెరిచి చెప్పరు.

సీఎం జగన్​పై పారిశ్రామికవేత్తల మండిపాటు- బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌

రాష్ట్రంలో ఉన్న చిన్న పరిశ్రమల సంఖ్య ఎంతంటే ప్రభుత్వం దగ్గర కచ్చితమైన లెక్క లేదు. ఐనా ఎంఎస్‌ఎంఈల ద్వారా భారీగా ఉపాధి కలిగిందని గణాంకాలు చూపడం జగన్‌ మార్క్‌ మాయాజాలం. ఐదేళ్లలో ఆర్థికసమస్యలతో చిన్న పరిశ్రమలు మూతపడుతుంటే చూస్తూ కూర్చున్న వైసీపీ సర్కార్‌ సరిగ్గా ఎన్నికలకు ముందు పారిశ్రామికవేత్తల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తోంది. 2020లోనే సర్వే పూర్తి చేసి ఉంటే రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈల ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వానికి ఈపాటికే ఓ అవగాహన ఉండేది. కానీ ఆచరణ లేకపోవడం వల్ల ఆరంభశూరత్వంగానే మిగిలింది.

పాత సర్వేలో 40 ప్రశ్నల ద్వారా పరిశ్రమల సమగ్ర సమాచారం సేకరించాలని భావించింది. ప్రస్తుతం నిర్వహించే ర్యాంప్‌ సర్వేలో కేవలం 7 అంశాల గురించే అడుగుతోంది. దీని ద్వారా తయారీ, సేవా, వాణిజ్యం, రిటైల్‌ రంగాల్లోని ఎంఎస్‌ఎంఈలను డిజిటల్‌ ప్లాట్‌ఫాంలోకి తెచ్చి అవి ఎదుర్కొనే ప్రధాన సమస్యలు పరిష్కరిస్తామని చెబుతోంది. రుణం పొందటంలో ఉన్న ఇబ్బందులు, మార్కెటింగ్‌ చేసుకోడానికి ఉన్న ఇబ్బందుల్ని గుర్తించి వాటి పరిష్కారానికి మార్గం చూపిస్తుందట.!

Small Scale Industries in AP: చిన్న తరహా పరిశ్రమలపై వైసీపీ సర్కార్ చిన్నచూపు.. అటకెక్కించిన పారిశ్రామిక సర్వే..

ఐదేళ్లు నింపాదిగా కూర్చుని ఎన్నికల ముందు ఆ మాట చెప్పడం ఎవర్ని మోసం చేయడాకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎంఎస్‌ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన జగన్‌ సర్కార్‌(YSRCP Govt) పరిశ్రమలు పోతే పోనీ అనే ధోరణిని ప్రదర్శించింది. గత రెండేళ్లుగా ప్రోత్సాహక బకాయిల చెల్లింపును వాయిదా వేసింది. ఫిబ్రవరిలో చెల్లిస్తామని ప్రకటించి మరోసారి మాట తప్పింది. చిన్న పరిశ్రమలు, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు కలిపి సుమారు 2వేల 500 కోట్ల రూపాయల ప్రోత్సాహకాల కింద ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.

కొద్ది రోజుల్లో ఎన్నికల ప్రకటన వెలువడితే ఆ ప్రోత్సాహకాలు అందించడమూ కష్టమే. గనులు, ఇసుక వంటి వాటిని బడా సంస్థలకు దోచిపెట్టడానికే ప్రాధాన్యత ఇచ్చిన వైసీపీ సర్కార్‌ నలుగురికీ ఉపాధి కల్పించే పారిశ్రామికరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 5 ఏళ్లలో చిన్న పరిశ్రమలకు రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద 2020లో 903.91 కోట్లు, ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లకు 58 కోట్ల 51 లక్షలు, 2021లో 440 కోట్లు మాత్రమే ఇచ్చి సరిపెట్టింది.

సర్వేల పేరుతో చిన్న పరిశ్రమలకు ఉరితాడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.