ETV Bharat / state

విశాఖ శారదా పీఠంలో వైభవోపేతంగా శ్రీ రాజశ్యామల యాగం - సీఎం జగన్‌ ప్రత్యేక పూజలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 8:34 PM IST

Updated : Feb 22, 2024, 6:13 AM IST

CM Jagan Participate in Puja at Visakha Sri Sarada Peetham: విశాఖ శారదా పీఠంలో శ్రీ రాజశ్యామల యాగం వైభవోపేతంగా జరిగింది. సీఎం జగన్‌తో శారదా పీఠాధిపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయం జ్యోతి మండపంలో రాజ శ్యామల అమ్మవారి యాగంలో పాల్గొన్న సీఎం జగన్​తో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి, ఉత్తరాధికారి స్వాత్మనందేంద్ర సరస్వతి స్వామి పూర్ణాహుతి జరిపించారు.

cm_jagan
cm_jagan

విశాఖ శారదా పీఠంలో వైభవోపేతంగా శ్రీ రాజశ్యామల యాగం - సీఎం జగన్‌ ప్రత్యేక పూజలు

CM Jagan Participate in Puja at Visakha Sri Sarada Peetham: విశాఖ శారదా పీఠంలో శ్రీ రాజశ్యామల యాగం వైభవోపేతంగా జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయం జ్యోతి మండపంలో రాజ శ్యామల అమ్మవారి యాగంలో పాల్గొన్న సీఎం జగన్​తో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి, ఉత్తరాధికారి స్వాత్మనందేంద్ర సరస్వతి స్వామి పూర్ణాహుతి జరిపించారు. తాడేపల్లి నుండి విశాఖపట్టణం చేరుకున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయం నుంచి నేరుగా శారదా పీఠం చేరుకున్నారు. మన్యుసుక్త హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని సంకల్పం చెప్పుకొన్నారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సీఎం జగన్​ విశాఖ పర్యటన - బస్టాప్ వద్ద ఉండొద్దని పోలీసుల హుకుం

యాగశాలలో రాజ్యశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. రాజ శ్యామల అమ్మవారి దీక్ష పీఠం వద్ద పూజలో పాల్గొన్న సీఎం జగన్ సాంప్రదాయ దుస్తుల్లో అక్కడి దేవతామూర్తులను దర్శించుకొని, యాగంలో పాల్గొన్నారు. పీఠం ప్రాంగణంలోని దేవతా మూర్తుల ఆలయాలను సందర్శించారు. పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి సారథ్యంలో వేదపండితులు, ప్రధాన అర్చకులు సమక్షంలో పూజా క్రతువులు నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు జరిగిన యాగం,ఈ పూజలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్​తో పాటు రాజ్య సభ సభ్యులు, వైసీపీ ఉత్తరాంధ్రా రీజనల్​కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.

రోడ్లపై వాహనాలు పార్కింగ్​ -​ భారీగా ట్రాఫిక్ జామ్​ - సీఎం పర్యటనతో ప్రజలకు తిప్పలు

జగన్ పేరుతో ప్రజాధనానం వృథా: గత ఏడాది జనవరిలో సీఎం జగన్‌ శారదా పీఠం వార్షికోత్సవాలకు వస్తారని అధికారులు రోడ్డు మధ్యలో డివైడర్‌పై ఉన్న పచ్చని చెట్లను నరికేశారు. వాటి స్థానంలో కార్పెట్ వేసి అలంకరణ మొక్కలు నాటారు. రెండు రోజుల్లోనే వాటిని పశువులు వాటిని పాడు చేశాయి. ఆ తరువాత జగన్‌ పర్యటన కూడా రద్దయింది. అలానే ఇప్పుడు కాడా జగన్ తప్పని సరిగా వస్తారని అంచనా వేసిన అధికారులు గత నవంబరులోనే డివైడర్‌పై పూలమొక్కలు నాటించారు. అయితే సంరక్షణ లోపంతో అవి ఎండిపవడంతో మళ్లీ మొక్కలను నాటించారు. ఇలా మూడు సార్లు మొక్కలు నాటడం వల్ల సుమారు రూ.12 లక్షల మేర ప్రజాధనాన్ని జగన్ వస్తారని వృథా చేశారు.

నీ రాక - మాకో శాపం స్వామీ! 'ఆడుదాం ఆంధ్రా' ముగింపుతో జనం ఉక్కిరిబిక్కిరి

మండుటెండలో మహిళలు: విశాఖలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా డ్వాక్రా మహిళలను అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. మహిళా స్వయం సహాయ బృందాల సభ్యులను ఎక్కడికక్కడ నిలబడాలని అధికారులు హుకుం జారీ చేశారు. ఎన్​ఏడీ జంక్షన్ నుంచి గోపాలపట్నం వరకు రహదారికి ఇరువైపులా మహిళలను నిలబెట్టారు. రోడ్లపై ఎండలో నిలుచున్న మహిళల పేర్లను రిజిస్టర్​లో నమోదు చేసుకొని ఫొటోలు తీసుకున్నారు. ఎండ వేడిమి తాళలేక మహిళలు ఇబ్బందులకు గురయ్యారు.

Last Updated : Feb 22, 2024, 6:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.