ETV Bharat / state

నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై ఈసీ చర్యలు - మరికొందరిపైనా కొరడా - CEO ACTION AGAINST NANDYALA SP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 12, 2024, 3:40 PM IST

Updated : May 12, 2024, 6:25 PM IST

Central Election Commission Action Against to Nandyala SP Raghuveera Reddy : మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కొంతమంది పోలీసు అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు ఈసీ ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్ ఫైల్‌ చేయాలని, శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే తిరుప‌తికి చెందిన ఐదుగురు సీఐలపై ఈసీ బదిలీ వేటు వేసింది.

Central Election Commission Action Against to Nandyala SP Raghuveera Reddy
Central Election Commission Action Against to Nandyala SP Raghuveera Reddy (ETV Bharat)

Central Election Commission Action Against to Nandyala SP Raghuveera Reddy : మరికొన్ని గంటల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కొంతమంది పోలీసు అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్‌ ఫైల్‌ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్‌డీపీవో రవీంద్రనాథ్‌రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు అధికారులపై తీసుకున్న చర్యల వివరాలను ఆదివారం రాత్రి 7 గంటల్లోపు తెలియజేయాలని ఈసీ ఉత్తర్వు్ల్లో పేర్కొంది. సినీనటుడు అల్లు అర్జున్‌ నంద్యాల పర్యటనకు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఈసీ తెలిపింది. ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు గుమికూడారని, 144 సెక్షన్‌ అమలులో ఉన్నా జనాలను నియంత్రించటంతో పోలీసులు విఫలమయ్యారని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లు అర్జున్‌పై ఇప్పటికే కేసు నమోదైందని తెలిపింది.

డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఈసీ వేటు - బదిలీ చేయాలని సీఎస్​కు ఆదేశాలు - EC TRANSFERRED DGP

అసలేం జరిగిందంటే? : నంద్యాలలో సినీ నటుడు అల్లు అర్జున్‌ పర్యటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆయన పర్యటనకు రిటర్నింగ్‌ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు. నంద్యాల ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఇంటికి శనివారం ఉదయం అల్పాహారానికి అల్లు అర్జున్‌ వచ్చారు. వైసీపీ శ్రేణులు వ్యూహాత్మకంగా పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి ఆయనను తీసుకువచ్చాయి. ఆయన పర్యటనకు అధికారిక అనుమతులూ లేకపోయినా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండగా ఇంచుమించు అదే సమయంలో హీరో అర్జున్‌ పర్యటన ఉండటంతో జిల్లా కేంద్రంలో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం స్పందించింది.

తిరుప‌తికి చెందిన ఐదుగురు సీఐలు బదిలీ : అదేవిధంగా తిరుప‌తికి చెందిన ఐదుగురు సీఐలపై ఈసీ బదిలీ వేటు వేసింది. వైఎస్సార్సీపీకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న తెలుగుదేశం నేతల ఫిర్యాదుతో ఈసీ చర్యలు తీసుకుంది. ఐదుగురిని అనంతపురం బదిలీ చేసింది. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, అంజూయాద‌వ్, అమ‌ర‌నాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, వినోద్‌కుమార్‌ను అనంతపురంలో విధులు నిర్వహించాలని ఆదేశించింది.

వైఎస్సార్సీపీతో కలిసి అరాచకాలు - జగన్ వీరభక్త 'బంటు'లపై వేటు - EC TRANSFERS INTELLIGENCE DG AND CP

వైఎస్సార్సీపీకి కొమ్ముకాస్తున్న అధికారులపై వేటు!- కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన నివేదిక

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో దొంగ ఓట్లు - పోలీసులపై సస్పెన్షన్​ వేటు

Last Updated :May 12, 2024, 6:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.