ETV Bharat / state

అధికారి కోపానికి ఓ యాచకుడి ప్రాణం బలి- ఎక్కడంటే?

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 8:08 PM IST

Beggar killed by Officer in Armoor
Beggar killed by Officer in Armoor

Beggar killed by Officer in Armoor: ఓ అధికారి కోపం వల్ల యాచకుడి ప్రాణం పోయిన ఘటన నిజామాబాద్​ ఆర్మూర్​లో చోటుచేసుకుంది. కారు అద్దాలు తుడిచిన యాచకుడు డబ్బులు అడగడంతో అధికారి కోపంతో అతన్ని కాలితో తన్నాడు. దీంతో వెనకాల వస్తున్న టిప్పర్ వెనుక టైర్ల కింద పడి ఆ వ్యక్తి మరణించాడు.

Beggar killed By Officer in Armoor : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ అధికారి కోపం వల్ల ఒక యాచకుడి ప్రాణం పోయింది. యాచకుడిని కారులో ఉన్న అధికారి కాలితో తన్నడంతో పక్కనుంచి వెళ్తున్న టిప్పర్ కింద పడి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలు పరిశీలించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

Beggar Dies Of Road Accident : మృతుడు సూరజ్​ సిగ్నళ్ల వద్ద వాహనాలు తూడుస్తూ యాచిస్తుంటాడు. ఈ నెల 22న సాయంత్రం ఆర్మూర్​లోని మామిడిపల్లి చౌరస్తా వద్ద డిప్యూటీ తహసీల్దార్​గా పని చేస్తున్న వ్యక్తి కారు వచ్చి ఆగింది. కారు అద్దాలు తుడిచిన యాచకుడు అధికారిని డబ్బులు అడిగాడు. అతను డబ్బులు లేవు అని చెప్పడంతో కారుకు అడ్డంగా నిలబడ్డాడు. అదే సమయంలో సిగ్నల్​ పడటంతో డబ్బులు అడుగుతూ సూరజ్ అధికారి​ కారును వెంబడించాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన సదరు అధికారి కారు నుంచి దిగి కాలితో తన్నాడు. దీంతో సూరజ్​ నేరుగా పక్క నుంచి వెళ్తున్న టిప్పర్ వెనక టైర్ల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

సమ్మక్క - సారలమ్మలను దర్శించుకుని వస్తుండగా ప్రమాదం - బావ, బామ్మర్ది మృతి

అధికారి కోపానికి ఓ యాచకుడి ప్రాణం బలి- ఎక్కడంటే?

"మమ్మల్ని అన్యాయం చేయకూడదు. ఇలా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. మేము యాచకులం అని మమ్మల్ని ఇంతలా అన్యాయం చేయకూడదు. మాకు ఒకడే తమ్ముడు మేము చాలా పేదవాళ్లం." - బాధితుని బంధువు

చెట్టును ఢీకొట్టిన కారు- ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

"నిన్న రాత్రి ఇమ్మాన్యుల్​ అనే వ్యక్తి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సూరజ్​​ అనే వ్యక్తి నిన్న మామిడిపల్లి సిగ్నల్​ దగ్గర కారు అద్దాలు తూడుస్తున్నాడు. ఉదయం వేరే పని చేసి సాయంత్రం ఓ కారు అద్దాలు తుడ్చాడు. అతను డబ్బులు ఇవ్వకపోతే ఆ కారుకు అడ్డంగా వచ్చి నిలబడ్డాడు. వెంటనే లోపల ఉన్న వ్యక్తి బయటకు వచ్చి తన్నేసరికి వెనకాల పోతున్న టిప్పర్ వెనకాల టైర్ల కింద పడి చనిపోవడం జరిగింది. దీనిపై విచారణ జరుపుతున్నాం. ఇంకా నిందితున్ని అదుపులోకి తీసుకోలేదు. విచారణ జరిపిన అనంతరం మిగత విషయాలు వెల్లడిస్తాం." - రవి కుమార్​, ఆర్మూర్ సీఐ

ఈ ఘటనపై ఆగ్రహం చేసిన కుటుంబ సభ్యులు నేరుగా ఆర్మూర్​ పోలీస్​ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. అధికారిపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీలో నమోదైన ఘటన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

బొలెరో డ్రైవర్​కు హార్ట్​ ఎటాక్! భక్తులపైకి దూసుకెళ్లిన వాహనం- ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.