ETV Bharat / state

వైసీపీ నాయకుల నుంచి ప్రాణహాని ఉంది - హైదరాబాద్​లో ఏపీ ఉపాధ్యాయురాలు ఆందోళన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 5:56 PM IST

teacher_protest
teacher_protest

AP Govt Teacher Protest at Hyderabad CGO Towers: హైదరాబాద్‌ సీజీవో టవర్స్ వద్ద ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆందోళన చేపట్టారు. సీఎం జగన్‌ తనకు న్యాయం చేయాలంటూ బాపట్ల జిల్లాకు చెందిన సుధారాణి ప్లకార్డులు పట్టుకొని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

న్యాయం కోసం రోడ్డెక్కిన ఉపాధ్యాయురాలు - సీఎం జగన్ స్పందించాలంటూ మండుటెండలో నిరసన

AP Govt Teacher Protest at Hyderabad CGO Towers: హైదరాబాద్‌ సీజీవో టవర్స్ వద్ద ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ తనకు న్యాయం చేయాలని బొడ్డువానిపాలెం గ్రామానికి చెందిన సెకండ్ గ్రేడ్ టీచర్ సుధారాణి హైదరాబాద్ కవాడిగూడలో ఉన్న సీజీవో టవర్​లోని జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్​ను కలిసి తన గోడును విన్నవించుకున్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ సీజీవో టవర్ ముందు మండుటెండలో నిరసన తెలిపారు. తనకు బొడ్డువానిపాలెంలో 13 సెంట్ల భూమి ఉందని ఆమె వివరించారు.

ఖాళీ స్థలం కనిపిస్తే చాలు పాగా వేస్తున్న వైసీపీ నాయకులు- ఏకంగా కార్యకర్త భూమినే కబ్జా

గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా సోదరుడు కర్ణుమ, నేరెళ్ల వెంకటేశ్వర్లు, మరో ఏడు మంది కలిసి తన ఇంటికి అడ్డంగా ఐదేళ్ల క్రితం గోడ నిర్మించారని ఆమె తెలిపారు. ఆ విషయాన్ని సీఎం జగన్​ వివరించగా కూల్చి వేశారని తెలిపారు. కొంతకాలం తర్వాత మళ్లీ గోడ నిర్మించి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని సుధారాణి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల నుంచి తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని వాపోయారు. తాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​లో ఉద్యోగం చేసే పరిస్థితులు లేవని ఈ నేపథ్యంలో ఎస్సీ కమిషన్​ను కలిశానని ఆమె వివరించారు.

వైసీపీ ఎంపీ అనుచరుడి వేధింపులు- పోలీసులు పట్టించుకోవడంలేదంటూ, వ్యక్తి ఆత్మహత్యాయత్నం

తమ పిల్లలపై న్యూసెన్స్ కేసు పెడుతున్నారని, ఏపీలో కోర్టులను మ్యానుప్లేట్ చేస్తున్నారని ఆమె తెలిపారు. న్యాయం కోసం ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి నెలకొందని నన్ను రోడ్డుకు ఇడ్చిన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేయాలని సుధారాణి విన్నవించారు. నా స్థితికి కారకులైన వ్యక్తులను అరెస్ట్ చేసి తనకు, తన పిల్లలకు భద్రత కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనకు, తన పిల్లలకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినా దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని సుధారాణి తెలిపారు.

డ్రెడ్జింగ్‌ యంత్రాలతో జల వనరులను తోడేస్తున్న దోపిడీదారులు - వైసీపీ పెద్దల అండతోనే దోపిడీ

నాకు 13 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలంలో ఇల్లు కట్టుకుని నివసిస్తుంటే ఎస్సీ మహిళ అన్న కారణంతో అగ్రకులానికి చెందిన వారు అక్కడ రియల్​ఎస్టేట్​ పేరుతో గోడ కట్టారు. న్యాయం చేయాలని 2 సంవత్సరాలుగా అధికారుల చూట్టూ తిరిగాను. వారు నాకు న్యాయం చేస్తానని చెప్పి 2 ఏళ్లుగా నన్ను తిప్పించి ఇప్పుడు మేము ఏమీ చెయ్యలేము అంటున్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్​ను కలిసి వివరిస్తే గోడ కూల్చి వేయించారు. ఆ తరువాత వాళ్లు మళ్లీ గోడను కట్టారు. ఈ విషయాన్ని ఎమ్మార్వోకి, జిల్లా అధికారులకు చెప్పాను కానీ అధికారులు ఎవరూ కూడా మేము ఏమీ చెయ్యలేము అంటున్నారు.- సుధారాణి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.