ETV Bharat / sports

హాఫ్​ సెంచరీతో రుతురాజ్ - ఐదేళ్ల తర్వాత చెన్నై కెప్టెన్ అరుదైన ఘనత - Ruturaj Gaikwad CSK

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 7:50 AM IST

Etv Bharat
Etv Bharat

Ruturaj Gaikwad CSK : చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తాజాగా కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో ఓ అరుదైన ఘనతను సాధించాడు. అదేంటంటే ?

Ruturaj Gaikwad CSK : చెన్నై సూపర్​ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తాజాగా ఓ అరుదైన రికార్డును సాధించారు. చిదంబరం స్టేడియం వేదికగా సోమవారం కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఈ యంగ్ క్రికెటర్ తద్వారా గత ఐదు ఏళ్లలో హాఫ్ సెంచరీ చేసిన తొలి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. అంతే కాకుండా ఈ సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం.

గత సీజన్ వరకు చెన్నై సారథిగా ఉన్న ధోనీ కెప్టెన్​గా తన చివరి హాఫ్​ సెంచరీని 2019లో నమోదు చేశాడు. ఆ సీజన్‌లో అతడు మూడు హాఫ్ సెంచరీలు బాదాడు. ఆ తర్వాత నుంచి గత ఐదేళ్లుగా ఈ స్టార్ క్రికెటర్ కెప్టెన్​గా ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. దీంతో ఇప్పుడు ఈ రికార్డు రుతురాజ్​ను వరించింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే - రెండు వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. తాజాగా జరిగిన మ్యాచ్​లో కోల్​కతా జట్టుపై 7 వికెట్ల తేడాతో నెగ్గింది. కేకేఆర్ జట్టు నిర్దేశించిన 138 పరుగుల టార్గెట్​ను చెన్నై జట్టు 3 వికెట్లు కోల్పోయి 17.4 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (67*) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, చివరిలో వచ్చిన శివమ్ దూబే (28) రాణించాడు. మరోవైపు కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2, సునీల్ నరైన్ 1 వికెట్ దక్కించుకున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
చెన్నై జట్టు సబ్సిట్యూట్స్ : శివమ్ దూబే, మొయిన్ అలీ, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, నిశాంత్ సింధు.

'నన్ను, నా ఫ్యామిలీని చాలాసార్లు తిట్టారు'- RCB ఫ్యాన్స్​పై డీకే షాకింగ్ కామెంట్స్ - Dinesh Karthik On Rcb Fans

దానికి కట్టుబడి ఉన్నా - అందుకే ఈ విజయం : మ్యాచ్ హీరో యశ్ ఠాకూర్ - IPL 2024 Gujarat Titans VS LSG

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.