ETV Bharat / sports

ఆర్సీబీ ప్లే ఆఫ్స్​ ఆశలు- బెంగళురుకు ఛాన్స్ ఉందా? - RCB Playoff Chances IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 2:57 PM IST

Updated : Apr 16, 2024, 4:42 PM IST

rcb playoff chances 2024
rcb playoff chances 2024

RCB Playoff Chances IPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటముల పరంపర కొనసాగుతోంది. తాజా సన్​రైజర్స్​ మ్యాచ్​తో ఆర్సీబీ ఈ సీజన్​లో ఆరో ఓటమిని మూటగట్టుకుంది.

RCB Playoff Chances IPL 2024: 2024 ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం సన్​రైజర్స్​ మ్యాచ్​తో వరుసగా ఐదు పరాజయాలు మూటగట్టుకుంది. ఇప్పటివరకూ ఆడిన 7 మ్యాచ్​ల్లో ఒకదాంట్లోనే నెగ్గి, ఆరు మ్యాచ్​ల్లో ఆర్సీబీ ఓడింది. కేవలం 2 పాయింట్లతో పట్టికలో ఆర్సీబీ అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. దీంతో​ ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాల సంక్లిష్టం అయ్యాయి. అప్పుడే ఆర్సీబీ ప్లే ఆఫ్ ఛాన్స్​ల గురించి అభిమానులు లెక్కలు వేస్తున్నారు. మరి ఆర్సీబీకి ఫ్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా? ఇంతకీ బెంగళూరు ఎలా ప్లే ఆఫ్స్​కు అర్హత సాధిస్తుంది? ఇప్పుడు చూద్దాం.

ఈ టోర్నీలో ప్రతి జట్టు లీగ్ దశలో 14మ్యాచ్​ల చొప్పున ఆడతాయి. అందులో టాప్- 4 జట్లు ప్లే ఆఫ్స్​కు అర్హత సాధిస్తాయి. అంటే ప్లే ఆఫ్స్​కు వెళ్లాలంటే ప్రతి జట్టు కనీసం 8 మ్యాచ్​లైనా నెగ్గాల్సి ఉంటుంది. ఇక ఈ టోర్నీలో ఆర్సీబీకి ఇంకా 7 మ్యాచ్​లు మిగిలి ఉన్నాయి. ఈ లెక్కన బెంగళూరు నెక్ట్స్ ఆడే అన్ని మ్యాచ్​ల్లో నెగ్గాలి. అది ఎంత వరకు సాధ్యం అనేది అందరి మదిలే మెదిలే ప్రశ్న.

ఆర్సీబీ తదుపరి కోల్​కతా, సన్​రైజర్స్, గుజరాత్, గుజరాత్, పంజాబ్, దిల్లీ, చెన్నై జట్లతో తలపడాల్సి ఉంది. అయితే టోర్నీలో 7 మ్యాచ్​ల్లో విజయం సాధించినా 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరవచ్చు. కానీ, అప్పుడు రన్​రేట్, ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. అది ఆర్సీబీ చేతుల్లో లేని విషయం. అందుకే అద్భుతం జరిగితే తప్పా ఆర్సీబీ ఈ సీజన్​లో ప్లే ఆఫ్స్ చేరే ఛాన్స్​లు చాలా తక్కువ!

ఇక హైదరాబాద్​తో మ్యాచ్​లో ఆర్సీబీ బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది. ఈ మ్యాచ్​లో ఏకంగా నలుగురు ఆర్సీబీ బౌలర్లు 50+ పరుగులు సమర్పించుకున్నారు. ఒక టీ20 ఇన్నింగ్స్​లో ఒకే జట్టుకు చెందిన నలుగురు బౌలర్లు 50+ పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి. దీంతో సన్​రైజర్స్​ ఐపీఎల్​లో హైయ్యెస్ట్ (287-3) స్కోర్ నమోదు చేసింది. అనంతరం ఛేదనలో ఆర్సీబీకూడా గట్టిగానే పోరాడింది. 20 ఓవర్లలో 262 పరుగులు చేసింది.

జెట్ స్పీడ్​లో 'సన్​రైజర్స్'- ఇది 2.O వెర్షన్- కానీ అదొక్కటే లోటు! - Sunrisers Hyderabad IPL 2024

'నాకు బ్రేక్ కావాలి'- కెప్టెన్​కు మ్యాక్సీ రిక్వెస్ట్!- షాక్​లో RCB ఫ్యాన్స్​ - Maxwell IPL 2024

Last Updated :Apr 16, 2024, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.