ETV Bharat / sports

బజ్జీ 'స్లాప్​గేట్' టు అశ్విన్ 'మన్కడ్' మూమెంట్ - ఐపీఎల్​లో మోస్ట్ కాంట్రవర్సీ మూవెంట్స్ ఇవే! - IPL Controversies

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 7:12 PM IST

IPL Controversies
IPL Controversies

IPL Controversies : ఐపీఎల్‌ అంటే రసవత్తర మ్యాచ్‌లే కాదు తీవ్రమైన వాగ్వాదాలు ఉంటాయి. అయితే తొలి సీజన్​ నుంచి ఇప్పటి వరకు వరకు ఐపీఎల్‌ హిస్టరీలో అత్యంత వివాదాస్పదంగా నిలిచిన ఘటనలు ఏవంటే ?

IPL Controversies : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్ నుంచి అనేక వివాదాలకు వేదికైంది. డ్రగ్స్​, ఆటగాళ్ల సస్పెన్షన్‌, గొడవలు, వాగ్వాదాలు ఇలా చాలానే చోటు చేసుకున్నాయి. కొందరు అరెస్టు అయిన సందర్బాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఐపీఎల్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన వివాదాలు ఏంటో చూద్దాం.

2008: ది స్లాప్​గేట్ సాగా
మొదటి సీజన్‌లో పంజాబ్‌ తరఫున శ్రీశాంత్, ముంబయి తరఫున హర్భజన్ సింగ్ ఆడారు. ఐపీఎల్ మ్యాచ్ తర్వాత శ్రీశాంత్‌ను హర్బజన్‌ చెంప దెబ్బ కొట్టడం పెద్ద దుమారం రేపింది. శ్రీశాంత్‌ మాటలు అభ్యంతరకంగా ఉండటం వల్ల హర్బజన్‌ చేయి చేసుకున్నట్లు తెలిసింది.

2009 : పాకిస్థాన్ ఆటగాళ్లపై నిషేధం
ముంబయి ఉగ్రదాడుల తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ వంటి పాక్ క్రికెటర్లు ఐపీఎల్ నుంచి నిషేధానికి గురయ్యారు.

2010: లలిత్ మోదీ సస్పెన్షన్
ఆర్థిక అవకతవకలపై లలిత్ మోదీ ఐపీఎల్​ నుంచి సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నారు. చివరికి అతనిని క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి తొలగించారు. ఇక అదే ఏడాది రాజస్థాన్‌ టీమ్‌లో ఉన్న జడేజా, ఇతర ఐపీఎల్​ జట్లతో ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా రూల్స్​ను ఉల్లంఘించాడు. దీంతో ఒక సంవత్సరం నిషేధాన్ని ఎదుర్కొన్నాడు.

2011 : ఛీర్​ లీడర్‌ వ్యాఖ్యలు
ఐపీఎల్​ నాలుగో సీజన్‌లో, ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీకి సంబంధించిన సౌతాఫ్రికా ఛీర్‌లీడర్ గాబ్రియెల్లా పాస్‌క్వాలోట్టో, మ్యాచ్ తర్వాత జరిగే పార్టీలలో క్రికెటర్ల ప్రవర్తన గురించి ఓ బ్లాగ్ చేయడం సంచలనం సృష్టించింది. చివరికి ఆమె ఛీర్‌లీడర్‌గా అవకాశం కోల్పోయింది. అదే ఏడాది కొచ్చి టస్కర్స్ కేరళ ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమవడం వల్ల ఆ ఫ్రాంచైజీ కాంట్రాక్ట్ రద్దు అయింది.

2012 : స్పాట్ ఫిక్సింగ్
ఆ ఏడాది ఐపీఎల్​ సీజన్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంతో ఆరోపణలు ఎదుర్కొంది. టోర్నమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఒక వార్తా ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ తర్వాత, స్పాట్ ఫిక్సింగ్ కార్యకలాపాల్లో కొందరు ఆటగాళ్లు చిక్కుకున్నారు. మీడియం-పేసర్ టీ.పీ.సుధీంద్ర జీవితకాల నిషేధానికి గురయ్యాడు. ఫాస్ట్ మీడియం బౌలర్ శలభ్ శ్రీవాస్తవ ఐదేళ్ల నిషేధానికి గురయ్యాడు. ఆల్ రౌండర్ అమిత్ యాదవ్‌తో పాటు బ్యాట్స్‌మెన్ మోహ్నీష్ మిశ్రా, అభినవ్ బాలిపై ఒక సంవత్సరం నిషేధం విధించారు. దీంతో పాటు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భద్రతా అధికారులతో షారుక్​ ఖాన్ వాగ్వాదం కారణంగా ఆయన్ను స్టేడియంలోకి ప్రవేశించకుండా ఐదేళ్ల నిషేధం విధించారు.

2012 : డెక్కన్ ఛార్జర్స్ రద్దు
డెక్కన్ ఛార్జర్స్ ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడంలో ఆ జట్టు కాంట్రాక్ట్​ను రద్దు చేశారు. ఇక ఐపీఎల్ సీజన్‌లో మాదక ద్రవ్యాల వినియోగంపై పుణె వారియర్స్ ఆటగాళ్లు రాహుల్ శర్మ, వేన్ పార్నెల్‌లను కూడా ఇదే ఏడాది అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్ ల్యూక్ పోమర్స్‌బాచ్, ఒక అమెరికన్ మహిళ దాఖలు చేసిన వేధింపుల ఆరోపణలతో దిల్లీలో ఇదే ఏడాది అరెస్టయ్యాడు.

2013 : శ్రీలంక ఆటగాళ్లపై నిషేధం
రాజకీయ ఉద్రిక్తతల కారణంగా చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల నుంచి శ్రీలంక ఆటగాళ్లపై నిషేధం విధించారు. దీంతో పాటు ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. కోహ్లి ఔటైన తర్వాత ఇద్దరు ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది అంతే కాకుడా బీసీసీఐతో ఆర్థిక వివాదాల కారణంగా సహారా అడ్వెంచర్ స్పోర్ట్స్ ఐపీఎల్ నుంచి పూణె వారియర్స్‌ను ఉపసంహరించుకుంది.

2014 : ప్రీతి జింటా-నెస్ వాడియా రో
ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా తన మాజీ ప్రియుడు, వ్యాపార భాగస్వామి నెస్ వాడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో, మిచెల్ స్టార్క్, కీరన్ పొలార్డ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. స్టార్క్ బౌలింగ్‌లో ఉద్దేశపూర్వకంగా కవ్వించడం వల్ల, పొలార్డ్ బ్యాట్‌ విసిరాడు.

2015 : చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ సస్పెన్షన్‌
ఐపీఎల్‌ నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ను రెండేళ్లపాటు సస్పెండ్‌ చేస్తూ సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. 2013 స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో రెండు ఫ్రాంచైజీలకు చెందిన కీలక అధికారులు, ఆటగాళ్ల ప్రమేయం ఉన్నట్లు తేలింది. అదే ఏడాది మద్యం బ్రాండ్ స్పాన్సర్ చేసిన నైట్‌క్లబ్‌కు విరాట్ కోహ్లీ హాజరై ఐపీఎల్​ అవినీతి నిరోధక రూల్స్​ ఉల్లంఘించిన కోహ్లీని బీసీసీఐ మందలించింది.

2016 : నీటి కొరత కారణంగా ఐపీఎల్​ మ్యాచ్‌ల మార్పులు
మహారాష్ట్రలో నీటి కొరత సమస్యలను పరిష్కరించేందుకు ఐపీఎల్ మ్యాచ్‌లను మార్చాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. దీంతో పాటు ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా, ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న హర్భజన్ సింగ్, అంబటి రాయుడు మధ్య మైదానంలో వాగ్వాదం జరిగింది. హర్భజన్ బౌలింగ్‌లో రాయుడు క్యాచ్‌ను వదిలేయడం వల్ల ఇద్దరు ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం కూడా ఇదే ఏడాది జరిగింది.

2017 : పొలార్డ్- మంజ్రేకర్ కాంట్రవర్సీ
ఐపీఎల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసార టెలివిజన్ ప్రసారం సందర్భంగా, ముంబయి ఇండియన్స్‌కి ఆడుతున్న పొలార్డ్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌తో వాగ్వాదానికి దిగాడు. మంజ్రేకర్ తన పనితీరుపై చేసిన విమర్శలకు పొలార్డ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ యజమాని సంజీవ్ గోయెంకా సోదరుడు హర్ష్ గోయెంకా, ధోనీని లక్ష్యంగా చేసుకుని వరుస ట్వీట్లతో వివాదాన్ని రేకెత్తించాడు. ధోని బ్యాటింగ్ ప్రదర్శనలు, కెప్టెన్సీ నిర్ణయాలను విమర్శించాడు.

2019 : అశ్విన్ 'మన్కడ్' మూమెంట్
కింగ్స్ XI పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో KXIP కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్, RR బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్‌ను 'మాన్‌కడింగ్' చేయడం ద్వారా వివాదం రేగింది. క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమనే విమర్శలు వచ్చాయి.

2020 : థీమ్ సాంగ్ ప్లాజియారిజం
టోర్నమెంట్ అధికారిక గీతం 'ఆయేంగే హమ్ వాపాస్', 'అప్నా టైమ్ ఆయేగా' అనే పాకిస్తానీ పాటకు కాపీ అనే ఆరోపణలు వచ్చాయి. IPL నిర్వాహకులు, మ్యూజిక్‌ కంపోజర్‌ల నుంచి వివరణ కోరారు.

2021: నో-బాల్ వివాదం
CSK vs DC లీగ్ మ్యాచ్ చివరి ఓవర్‌లో, సెకండ్ ఇన్నింగ్స్‌లో DCకి చివరి ఓవర్ నుంచి 6 పరుగులు అవసరం కాగా, CSK డ్వేన్ బ్రావో వెస్టిండీస్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మెయర్ ఆఫ్-స్టంప్ వెలుపల బౌలింగ్ చేశాడు. ముందు అంపైర్ అనిల్ చౌదరి నోబాల్ ఇచ్చి, వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుని వైడ్ ఇచ్చాడు. ఇది చాలా మందికి నచ్చలేదు.

2022: హర్షల్, పరాగ్ వాదన
RCB vs RR మ్యాచ్ ముగిసిన తర్వాత హర్షల్ పటేల్, రియాన్ పరాగ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పటేల్ చివరి ఓవర్‌లో పరాగ్ దూకుడుగా బ్యాటింగ్ చేయడం వల్ల ఇది జరిగింది. దీంతో పాటు DC vs RR మ్యాచ్ సందర్భంగా రిషబ్ పంత్, ప్రవీణ్ ఆమ్రే అంపైర్లు చేసిన నో బాల్ కాల్‌ కాంట్రవర్సీగా మారింది. పంత్, ఠాకూర్‌లకు జరిమానాలు విధించారు.

సునీల్ గవాస్కర్ CSK, RR మ్యాచ్ సందర్భంగా షిమ్రాన్ హెట్మెయర్, అతని భార్యపై చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. అతని భార్య ప్రసవానికి సంబంధించి గవాస్కర్‌ మాట్లాడాడు. 'హెట్మెయర్ వైఫ్‌ డెలివరీ అయింది, ఇప్పుడు ఆర్‌ఆర్‌కి హెట్మెయర్‌ డెలివరీ చేస్తాడా' అని కామెంట్‌ చేశాడు. ఇవన్నీ ఒకే ఏడాదిలో జరిగాయి.

మూమెంట్​ ఆఫ్ ది మ్యాచ్​ - ఇది అస్సలు ఊహించలే! - kohli Gambhir

గంభీర్‌ Vs కోహ్లీ - దినేశ్‌ కార్తిక్‌ అలా అనేశాడేంటి? - Dinesh Karthik RCB

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.