ETV Bharat / sports

'అప్పుడేమో వెన్నుపోటు పొడిచి​ ఇప్పుడు ప్రశంసిస్తున్నావా'​ - IPL 2024 RCB Dinesh Karthik

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 3:48 PM IST

'అప్పుడేమో వెన్నుపోటు పొడిచి​ ఇప్పుడు ప్రశంసిస్తున్నావా'​ - ఆ క్రికెటర్​పై దినేశ్ కార్తిక్​ కామెంట్స్!
'అప్పుడేమో వెన్నుపోటు పొడిచి​ ఇప్పుడు ప్రశంసిస్తున్నావా'​ - ఆ క్రికెటర్​పై దినేశ్ కార్తిక్​ కామెంట్స్!

IPL 2024 RCB Dinesh Karthik : ఆ జట్టు మాజీ కెప్టెన్​పై టీమ్​ ఇండియా సీనియర్ వికెట్‌ కీపర్ దినేశ్ కార్తీక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడు తనను వెన్నుపోటు పొడిచాడని, కానీ ఇప్పుడు ప్రశంసిస్తున్నాడని కార్తీక్ పేర్కొన్నాడు.

IPL 2024 RCB Dinesh Karthik : ఐపీఎల్‌లో దినేశ్ కార్తీక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే అతడు తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టాడు. 10 బంతుల్లో అజేయంగా 28 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు.

దీంతో ఆర్సీబీని గెలిపించేందుకు కీలకంగా వ్యవహరించిన డీకేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే నాజర్ హుస్సేన్ కూడా కొనియాడాడు. గొప్పగా ఆడాడని ప్రశంసించాడు. అలాగే టీ20 వరల్డ్ కప్​ టీమ్ ఇండియా జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. అప్పుడు దీనికి దినేశ్ కార్తీక్ సరదాగా రియాక్ట్ అయ్యాడు. నాజర్‌ను ఆటపట్టించాడు.

''నాజర్ హుస్సేన్ నువ్వు చెప్పే ఒక్క మాట కూడా నేను అస్సలు నమ్మను. నువ్వు నన్ను ఓ వ్యక్తిగా, ఓ ప్లేయర్​గా, వికెట్ కీపర్‌గా నాలో ఏ విషయాన్ని ఇష్టపడవు. గత వరల్డ్ కప్​ సమయంలోనూ జట్టులో నేను ఉండకూదని చెప్పావు. అలా చెప్పిన ఏకైక వ్యక్తివి కూడా నువ్వే. నాతో ఇంటర్వ్యూ కూడా చేశావు. ఆ తర్వాత వెన్నుపోటు పొడిచావు. రిషభ్ పంత్ అంటూ హెడ్‌లైన్స్ వేశావు. నాతో మంచిగా ఉన్నట్లు బిహేవ్ చేయకు. ఆ తర్వాత ఏం చేస్తావో నాకు బాగా తెలుసు'' అంటూ కార్తీక్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. కాగా, క్రికెటర్‌గానే కాకుండా వ్యాఖ్యాతగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్న దినేశ్ కార్తీక్‌కు నాజర్ హుస్సేన్ మంచి స్నేహితుడు. వీరిద్దరు కలిసి ఎంతో సరదాగా ఉంటారు.

కాగా, ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫినిషర్‌గా అదరగొట్టాడు దినేశ్ కార్తీక్. ఈ ప్రదర్శనతో అందరూ అతడిని ప్రశంసలతో ముంచెత్తారు. ఇక అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్​నకు సెలెక్ట్ అయ్యాడు. ఇకపోతే మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్​లో​ వికెట్ కీపర్ బ్యాటర్‌ స్థానం కోసం దినేశ్ కార్తీక్ కూడా పోటీ పడబోతున్నట్లు ఇంగ్లీష్ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. కాబట్టి ఈ ఐపీఎల్‌ సీజన్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కార్తీక్ సంచలన ప్రదర్శన చేయగలిగితే టీ20 వరల్డ్ కప్​నకు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వాదనలు వినిపిస్తున్నాయి.

ఇకపై జడ్డూను అలానే పిలవాలట - చెన్నై ఫ్రాంచైజీ అఫీషియల్ అనౌన్స్​మెంట్​! - Ravindra Jadeja New Name

'నన్ను, నా ఫ్యామిలీని చాలాసార్లు తిట్టారు'- RCB ఫ్యాన్స్​పై డీకే షాకింగ్ కామెంట్స్ - Dinesh Karthik On Rcb Fans

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.