ETV Bharat / sports

పాండ్య సూపర్ కమ్​బ్యాక్- వరల్డ్​కప్ తర్వాత తొలి మ్యాచ్​లోనే అదుర్స్

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 9:51 PM IST

Hardik Pandya Comeback
Hardik Pandya Comeback

Hardik Pandya Comeback: టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య సోమవారం బరిలోకి దిగాడు. దాదాపు 5 నెలల తర్వాత మ్యాచ్ ఆడిన పాండ్య సత్తా చాటాడు.

Hardik Pandya Comeback: టీమ్ఇండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య సుమారు ఐదు నెలల గ్యాప్ తర్వాత బరిలోకి దిగాడు. డీవై పాటిల్ (DY Patil T20) టీ20 టోర్నమెంట్​ 18వ సీజన్​లో పాండ్య పాల్గొన్నాడు. ఈ టోర్నీలో అతడు రిలయన్స్ 1 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టోర్నీలో భాగంగా సోమవారం (ఫిబ్రవరి 26) బీపీసీఎల్​ (BPCL)తో జరిగిన మ్యాచ్​లో పాండ్య సూపర్​ కమ్​బ్యాక్ ఇచ్చాడు. 2023 వరల్డ్​కప్ తర్వాత తొలిసారి బరిలోకి దిగిన పాండ్య ఈ మ్యాచ్​లో పూర్తి ఫిట్​గా కనిపించాడు. ఇక​ ఈ మ్యాచ్​లో బౌలింగ్​లో సత్తా చాటిన పాండ్య తన టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మ్యాచ్​లో బౌలింగ్ చేసిన పాండ్య తొలి రెండు ఓవర్లోలో ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే మూడో ఓవర్లో మాత్రం పాండ్య సత్తా చాటాడు. ఈ ఓవర్లో కేవలం 1 పరుగే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రత్యర్థి జట్టు బీపీసీఎల్ 18.3 ఓవర్లలో 126 పరుగులకు కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో రిలయన్స్​ 15 ఓవర్లలో వికెట్లు కోల్పోయి టార్గెట్​ను అందుకుంది. ఇన్నింగ్స్​​ ఆఖర్లో బ్యాటింగ్​కు వచ్చిన పాండ్య 4 బంతుల్లో 3 పరుగులు బాది నాటౌట్​గా నిలిచాడు.

అయితే 2023 వరల్డ్​కప్​లో బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో పాండ్య గాయపడ్డాడు. ఈ మ్యాచ్​లో పాండ్య కాలికి తీవ్రమైన గాయం అవ్వడం వల్ల అప్పట్నుంచి ఆటకు దూరమయ్యాడు. ఎన్​సీఏ (National Cricket Academy)లో మెల్లి మెల్లిగా కోలుకున్న పాండ్య రీసెంట్​గా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. 2024 ఐపీఎల్​లో ఆడడమే లక్ష్యంగా పాండ్య నెట్స్​లో కసరత్తులు షురూ చేశాడు. ఈ నేపథ్యంలో సోమవారం పాండ్య బరిలోకి దిగడం వల్ల 2024 ఐపీఎల్, టీ20 వరల్డ్​కప్​నకు సిద్ధమయ్యాడని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

Hardik Pandya IPL: 2024లో హార్దిక్ ముంబయి ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. గత రెండ సీజన్​లలో గుజరాత్ టైటాన్స్​కు కెప్టెన్​గా వ్యవహరించిన పాండ్య ఈసారి తిరిగి ముంబయి తరఫున ఆడనున్నాడు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రంజీకి నో!- జిమ్​లో పాండ్యా, ఇషాన్ వర్కౌట్లు

హార్దిక్‌ పాండ్యకు ఊరట - 'రంజీల్లో ఆడాల్సిన అవసరం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.