ETV Bharat / sports

'కెప్టెన్సీ అంటే కాఫీ తాగినంతా ఈజీ కాదు'- హార్దిక్​పై నెటిజన్లు ఫైర్ - Hardik Pandya Captain IPL

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 1:39 PM IST

Hardik Pandya Captain IPL
Hardik Pandya Captain IPL

Hardik Pandya Captain IPL: 2024 ఐపీఎల్​లో తొలి మ్యాచ్‌లో పరాజయంతో హార్దిక్‌పైన మొదలైన విమర్శలు, రెండో మ్యాచ్‌ తర్వాత కూడా కొనసాగుతున్నాయి. అటు కెప్టెన్​గా, ఇటు బ్యాటర్​గా విఫలమవుతున్నాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువ అయ్యాయి.

Hardik Pandya Captain IPL: హైదరాబాద్‌ ఉప్పల్‌ వేదికగా సన్​రైజర్స్​తో జరిగిన హై స్కోరింగ్‌ మ్యాచ్‌లో ముంబయి ఓడిపోవడం వల్ల కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యపై మళ్లీ విమర్శలు చెలరేగుతున్నాయి. హార్దిక్‌ సారథ్యంపై మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువవుతున్నాయి. హార్దిక్ పాండ్య కెప్టెన్సీపై నెటిజన్లు మండిపడుతున్నారు. ముంబయి బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో 36 పరుగులు ఇవ్వగా, స క్వీనా మఫాకా 4 ఓవర్లలో 66 పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లు వేసిన హార్దిక్ పాండ్య 46 పరుగులు ఇచ్చాడు. అయితే కెప్టెన్​గా ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్‌ బుమ్రాను హార్దిక్‌ పాండ్య ఉపయోగించిన తీరుపై నెటిజన్లు, ముంబయి ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

బుమ్రాకు ఒక్క ఓవరేనా?: పవర్​ ప్లేలో స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ భీకరంగా ఆడుతున్న బుమ్రాకు బంతి ఇవ్వలేదని పాండ్యను నెటిజన్లు తప్పుపడుతున్నారు. హార్దిక్ పాండ్య పేలవమైన కెప్టెన్సీ కారణంగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు చేసిందని మండిపడుతున్నారు. ఈ మ్యాచ్​ తొలి 11 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 160+ పరుగులు చేసింది. ఆ సమయంలో బుమ్రాను కెప్టెన్ సరిగ్గా వినియోగించుకోలేదని ఫైర్ అవుతున్నారు. తొలి 11 ఓవర్లలో బుమ్రాకు కేవలం ఒక ఓవర్ బౌలింద్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఉప్పల్​లో పరుగుల వర్షం కురిపించిన బ్యాటర్లు బుమ్రా బౌలింగ్​లో భారీ షాట్​లు ఆడలేక ఇబ్బంది పడ్డారని గుర్తు చేస్తున్నారు.

బ్యాటింగ్‌లోనూ విఫలమే: కొండత లక్ష్యం కళ్ల ముందుండగా ఓపెనర్లు రోహిత్, ఇషాన్ కిషన్ ముంబయికి మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ఆరంభాన్ని మిడిలార్డర్​లో తిలక్ వర్మ, నమన్ దీర్ చక్కగా ఉపయోగించుకొని విజయంపై ఆశలు రేపారు. హార్దిక్‌ బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో ముంబయి 10 ఓవర్లలో 150 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో ఉంది. ఆ సమయంలో హార్దిక్‌ ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించినా దాన్ని కొనసాగించడంలో విఫలమయ్యాడు. పాండ్య- తిలక్‌ వర్మ జోడీ 34 బంతుల్లో 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా అందులో పాండ్యవి 19 పరుగులే.

ఇక చివరి 5 ఓవర్లలో 93 పరుగులు కావాల్సిన దశలో హార్దిక్ 15 బంతుల్లో 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆ తర్వాత ఏ మాత్రం భారీ షాట్​లు ఆడలేదు. తర్వాత 5 బంతుల్లో పాండ్య చేసింది 4 పరుగులే. మొత్తంగా ఈ మ్యాచ్​లో పాండ్య 20 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై ట్రోల్స్ మరింత ఎక్కువ అయ్యాయి. గత మ్యాచ్​లోనూ 4 బంతుల్లో 9 పరుగులు కావాల్సిన దశలోనూ పాండ్య చెత్త షాట్​తో పెవిలియన్ చేరాడు. దీంతో పాండ్యపై ముంబయి ఫ్యాన్స్ కాస్త ఫైర్ అవుతున్నారు.

అస్సలు ఊహించలేదు - అలా చేసి ఉంటే బాగుండేది : హార్దిక్ పాండ్య - IPL 2024 MI VS Sunrisers

ఉప్పల్‌ ఊగిపోయింది - ముంబయిపై సన్​రైజర్స్​ అద్భుత విజయం - MI VS SRH IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.