ETV Bharat / sports

చెన్నై చేరుకున్న 'ధోనీ'- వనక్కం అంటూ గ్రాండ్​​ వెల్​కమ్

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 8:44 PM IST

Updated : Mar 5, 2024, 10:29 PM IST

Dhoni IPL 2024
Dhoni IPL 2024

Dhoni IPL 2024: 2024 ఐపీఎల్​ సీజన్​ కోసం మహేంద్రసింగ్ ధోనీ మంగళవారం చెన్నై నగరానికి చేరుకున్నాడు.

Dhoni IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్​ సీజన్- 17 కోసం మంగళవారం చెన్నై నగరానికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని సీఎస్​కే తమ అఫీషియల్ ట్విట్టర్ పేజ్​లో షేర్ చేసింది. '#THA7A దర్శనం!' అని పోస్ట్​కు క్యాప్షన్​ రాసుకొచ్చింది. ఇక ధోనీ త్వరలోనే ఐపీఎల్​ ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. కాగా, వరుసగా 17వ సీజన్​లో కూడా సీఎస్​కే జట్టును నడిపించనున్నాడు.

అటు సీఎస్​కే ప్రాక్టీస్ సెషన్​ను కూడా మేనేజ్​మెంట్​ శనివారం ప్రారంభించింది. ఈ క్రమంలో జట్టు ప్లేయర్లు దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్, సిమర్జీత్ సింగ్, రాజవర్ధన్ హంగర్గేకర్, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, అజయ్ మండల్, షేక్ రషీద్, నిశాంత్ సింధు ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. కాగా, మార్చి 22న చెన్నై- బెంగళూరు మ్యాచ్​తో ఈ సీజన్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది.

ఓపెనర్​గా ధోనీ!: రానున్న సీజన్​లో ధోనీ ఓపెనర్​గా రానున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ధోనీ రీసెంట్​గా 'న్యూ రోల్' అంటూ తాజాగా సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్​ వల్ల ఈ వార్తలకు బలం చేకూరింది. దీంతో ధోనీ ఫ్యాన్స్​లో ఈ విషయంపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే ధోనీ అటు కెప్టెన్సీతోపాటు ఆటకు కూడా గుడ్​బై చెప్పి సీఎస్​కే మెంటార్​గా వ్యవహరించనున్నాడని పలు కథనాలు వచ్చాయి. చూడాలి మరి మహీ 2024 ఐపీఎల్​లో ఏ రోల్​లో కనిపించనున్నాడో?

Devon Conway CSK: ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాకుండానే ఫ్రాంచైజీలకు గట్టిగా షాక్ తగులుతోంది. ఇప్పటికే సర్జరీ కారణంగా మహ్మద్ షమీ గుజరాత్​ జట్టుకు దూరమవ్వగా, రీసెంట్​గా చెన్నై జట్టులోనూ ఇదే జరిగింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్‌ బ్యాటర్ డేవన్ కాన్వే ఈ సీజన్‌ తొలి భాగంలో ఆడటం లేదు. అయితే ఈ విషయంపై చెన్నై ఫ్రాంచైజీ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్​మెంట్ రావాల్సి ఉంది. అయితే ఏప్రిల్ చివరినాటికైనా సిద్ధమై రెండో సగానికి అందుబాటులో ఉండే అవకాశాలున్నాయని సమచారం. ఇక గత సీజన్‌లో సీఎస్‌కే తరఫున అత్యధిక పరుగులు చేసి రికార్డుకెక్కాడు ఈ స్టార్​ క్రికెటర్. ఆడిన 16 మ్యాచుల్లో 672 పరుగులు స్కోర్ చేశాడు.

ధోని కెప్టెన్సీ వదిలేస్తున్నాడా? న్యూ రోల్‌ అంటూ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌

చెన్నై జట్టుకు ఊహించని షాక్​ - జట్టుకు దూరం కానున్న కాన్వే!

Last Updated :Mar 5, 2024, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.