ETV Bharat / sports

కొవిడ్​ ఉన్నా బరిలోకి దించారు- గ్రౌండ్​లో దూరం పెట్టారు!- ఆసీస్ వింత ప్రవర్తన

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 12:26 PM IST

Updated : Jan 25, 2024, 1:56 PM IST

Cameron Green Covid
Cameron Green Covid

Cameron Green Covid: ఆస్ట్రేలియా ఆల్​రౌండర్ కామెరూన్ గ్రీన్​కు రీసెంట్​గా కొవిడ్ సోకింది. అయినప్పటికీ అతడు వెస్టిండీస్​తో టెస్టు మ్యాచ్​లో బరిలో దిగాడు. అయితే ఈ మ్యాచ్​లో ఓ సంఘటన ఆడియెన్స్​ను ఆశ్చర్యానికి గురిచేసింది.

Cameron Green Covid: క్రికెట్​లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్​గా నిలిచే ఆస్ట్రేలియా జట్టు మరోసారి వార్తల్లో నిలిచింది. గబ్బా వేదికాగా వెస్టిండీస్​తో జరుగుతున్న మ్యాచ్​లో ఓ సంఘటన ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాచ్​ ప్రారంభానికి ముందు జాతీయ గీతం పాడే సమయంలో ఆసీస్ ఆల్​రౌండర్ కామెరూన్ గ్రీన్, లైన్​లో తన సహచర ప్లేయర్లకు కాస్త డిస్టెన్స్​లో నిలబడ్డాడు. అయితే గ్రీన్​కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడం వల్ల అతడు దూరంగా నిలబడ్డాడు. దీంతో ఆసీస్​ జట్టును సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. 'కొవిడ్ ఉందని తెలిసినప్పుడు ఆడించడం ఎందుకు? ఆడిస్తే ఇలా దూరంగా నిలబెట్టడం ఎందుకు?' అని ప్రశ్నిస్తున్నారు.

అయితే గ్రీన్​తోపాటు ఆసీస్ కోచ్ ఆండ్రూ మెక్​డొనాల్డ్​కు కూడా రీసెంట్​గా కొవిడ్ పాజిటివ్​ నిర్ధరణ అయ్యింది. వీళ్లు ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుతో కాకుండా సపరేట్​గా ఉంటున్నట్లు బోర్డు తెలిపింది. 'కామెరూన్ గ్రీన్, ఆండ్రూ మెక్​డొనాల్డ్​ జట్టుకు దూరంగా ఉంటున్నారు. వారికి కొవిడ్ నెగిటివ్ నిర్ధరణ అయ్యేదాకా అలాగే సపరేట్​గా ఉంటారు. గ్రీన్ కొవిడ్ నిబంధనల మేరకే బరిలోకి దిగుతున్నాడు' అని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

West Indies tour of Australia 2024: వెస్టిండీస్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ టూర్​లో విండీస్ ఆతిథ్య జట్టులో రెండు టెస్టు, మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్​లు ఆడనుంది. ఈ క్రమంలో తొలి టెస్టులో ఆసీస్ 10 వికెట్ల తేడాతో నెగ్గింది. కాగా, ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ గురువారం (జననరి 25) ప్రారంభమైంది.

ఆస్ట్రేలియా జట్టు: ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), నథన్ లిన్, జోష్ హేజిల్​వుడ్.

వెస్టిండీస్ జట్టు: క్రాగీ బ్రాత్​వైట్ (కెప్టెన్), తాగ్​నరైన్ చందర్​పాల్, క్రిక్ కెంజీ, అలిక్ అథనాజ్, హోడ్జ్, జస్టిన్ గ్రేవ్స్, జోషువా డి సిల్వా, అల్జారీ జోసేఫ్, కెవిన్ సింక్లెర్, షమర్ జోసేఫ్, కెమర్ రోచ్

ఫీల్డింగ్‌ మేళవింపుల్లో కొత్త ప్రయోగాలు - ఇదే టెస్ట్ క్రికెట్​ నయా సక్సెస్​ మంత్ర!

వికెట్​ కీపర్​గా కేఎల్​ రాహుల్​ ఔట్​- ఆంధ్ర కుర్రోడికి ఛాన్స్​ దక్కేనా?

Last Updated :Jan 25, 2024, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.