ETV Bharat / spiritual

మీ అపార్ట్‌మెంట్లో వాస్తు దోషం - ఇలా తొలగించండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 3:51 PM IST

Vastu Tips For Apartments : ఇండిపెండెంట్ ఇళ్లతోపాటు అపార్ట్ మెంట్ కల్చర్ వేగంగా విస్తరిస్తోంది. అయితే.. ఇంట్లో మనం ఏ పని చేసినా కూడా వాస్తు ప్రకారం చేస్తే అంతా మంచి జరుగుతుందని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. కొత్తగా అపార్ట్‌మెంట్‌ కొనుకున్న వారు వాస్తు దోషాలను తొలగించుకోవడానికి ఎటువంటి టిప్స్‌ పాటించాలో మీకు తెలుసా ?? అవేంటో చూద్దాం పదండి.

Vastu Tips For Apartments
Vastu Tips For Apartments

Vastu Tips For Apartments : మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సొంత ఇంట్లో ఉండాలంటే ఎక్కడైనా కొంత స్థలాన్ని తీసుకుని, ఇళ్లు నిర్మించుకునే వారు. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. అపార్ట్‌మెంట్‌ కల్చర్ విస్తరిస్తోంది. నగరాల్లో భూముల ధరలు విపరీతంగా పెరగడంతోపాటు నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగిపోవడమే ఇందుకు కారణం.

హైదరాబాద్‌ వంటి మహా నగరాల్లో అయితే.. సొంత స్థలం కొనుగోలు చేసి, ఇంటిని నిర్మించాలంటే లక్షలాది రూపాయలు ఉండాల్సిందే. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల చాలా మంది అపార్ట్​ మెంట్​లో ఫ్లాట్‌ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. ఇండిపెండెంట్ హౌస్ అయితే.. సొంత నిర్ణయంతో వాస్తు మార్పులు చేసుకోవచ్చు. మరి, అపార్ట్​ మెంట్​లో ఉండే వాస్తు దోషాలను ఏ విధంగా తొలగించుకోవాలి? మీకు తెలుసా ?? ఈ కథనంలో ఆ వివరాలు చూద్దాం.

వాస్తు ప్రకారం అపార్ట్‌మెంట్‌లో ఉండే వారు ఇవి పాటించాలి..

  • మీ ఇంట్లో ఉండే ప్రధాన ద్వారం నుంచి చూస్తే మీ డైనింగ్‌ టేబుల్‌ కనిపించకూడదు.
  • అలాగే ఇంట్లో వాస్తు దోషం పోవడానికి గోడలకు మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించేలా ఫొటోలను అంటించండి. అవి పేయింటింగ్‌లు, దేవుడి చిత్రాలు వంటివి ఏవైనా కావచ్చు.
  • మెయిన్‌ డోర్‌ పైన స్వస్తిక్‌ గుర్తులను ఏర్పాటు చేయండి.
  • మీ ఫ్లాట్‌లో తూర్పు దిక్కున వంట గది ఉండేలా చూసుకోండి. అలాగే గ్యాస్ స్టౌవ్‌, ఓవెన్ వంటివి వంటగదిలో ఆగ్నేయం దిశలో ఏర్పాటు చేయండి.
  • ఫ్రిడ్జ్‌ను పశ్చిమ దిశలో ఉంచకూడదు.
  • వాస్తు ప్రకారం వంటగది తలుపుపై గణపతి చిత్రాన్ని పెట్టుకోండి.
  • బెడ్‌రూమ్‌ ప్రశాంతమైన పాజిటివ్‌ ఎనర్జీతో నిండిపోవడానికి.. చిన్న మొక్కల కుండీలను ఏర్పాటు చేసుకోవాలి.
  • అలాగే.. మనీ ప్లాంట్ల వంటి వాటిని పెంచడం ద్వారా వాస్తు దోషం తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
  • భార్యా భర్తల మధ్య గొడవలు, కలహాలు రాకుండా ఉండటానికి.. బెడ్‌రూమ్‌లో లాఫింగ్‌ బుద్ధ విగ్రహాన్ని పశ్చిమ దిశలో పెట్టాలని అంటున్నారు.
  • ఫ్లాట్‌లో తులసి చెట్టును దక్షిణం వైపు ఏర్పాటు చేయకూడదు.
  • మెయిన్‌ డోర్‌ పక్కన చిన్నగా ఉండే పూల కుండీలను ఏర్పాటు చేయండి.
  • అలాగే.. ప్రధాన ద్వారం గడప ఎదురుగా వెల్‌కమ్‌ అని రాసి ఉండే మ్యాట్‌లను పెట్టండి.
  • ఇంట్లోని గోడలకు లైట్‌ కలర్‌లో ఉండే పింక్, గ్రీన్, బ్లూ వంటి రంగులను పేయింట్‌ చేయించాలి.
  • ఇంకా పిల్లలు ఉండే గదులకు లైట్‌ ఎల్లో, నారింజ రంగులను వేయించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
  • ఇవన్నీ పాటించడం ద్వారా.. అపార్ట్​ మెంట్లలో ఉండే వాస్తు దోషాన్ని తొలగించుకోవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

వాస్తు దోషం - ఇంటి మెయిన్‌ డోర్‌ విషయంలో ఈ తప్పులు చేయొద్దు!

ఇంట్లో బీరువా ఎక్కడ పెట్టాలో తెలుసా? ఆ దిక్కున పెడితే మీకు అన్ని శుభాలే!

డిప్రెషన్​తో ఇబ్బంది పడుతున్నారా? - ఈ వాస్తు టిప్స్​తో సమస్య పరార్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.