ETV Bharat / spiritual

ఈరోజు ఆ రాశుల వారికి ఉద్యోగప్రాప్తి! వ్యాపారులకు ఫుల్ ప్రాఫిట్! - Horoscope Today April 29th 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 5:01 AM IST

Horoscope Today April 29th 2024
Horoscope Today April 29th 2024

Horoscope Today April 29th 2024 : ఏప్రిల్​ 29న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today April 29th 2024 : ఏప్రిల్​ 29న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా విశ్రాంతి లోపిస్తుంది. కొన్ని సంఘటనల కారణంగా మానసికంగా అశాంతిగా ఉంటారు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. లేకుంటే సమస్యలు పెరుగుతాయి. ఆర్థిక వృద్ధి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసేవారికి పనిలో ఆటంకాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో పని చేస్తే విజయం మీదే! హనుమాన్ చాలీసా పఠిస్తే ఆటంకాలు తొలగిపోతాయి.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త పనుల జోలికి పోవద్దు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. దైవబలం అండగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. శారీరకంగా, మానసికంగా ఆనందంగా ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం, కీర్తి పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉంది. వ్యాపారులకు పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబంలో విపరీతమైన ఆనందం, సంతోషం నెలకొంటాయి. ఉద్యోగులు అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్ ఛాన్స్ కూడా ఉంది. విపరీతమైన ధనదాయం ఉంటుంది. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రతికూల పరిస్థితులను నుంచి గట్టెక్కుతారు. రానున్నది శుభకాలం. భగవంతుని ఆశీర్వాదం కోసం శివారాధన చేయండి.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. సాహిత్య రంగంలో కృషి చేసే వారికి అనుకూలమైన సమయం. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్స్​తో పాటు జీతం కూడా పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగం లభిస్తుంది. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. స్థిరాస్తి వ్యాపారులకు శుభసమయం నడుస్తోంది. పట్టింది బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. మానసికంగా శారీరకంగా చాలా ఒత్తిడి అనుభవిస్తుంటారు. సన్నిహితులతో గొడవలకు అవకాశముంది. ఆస్తి వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉంటే మేలు. కొన్ని అనుకోని పరిస్థితులలో అవమానాలకు ఆస్కారముంది. సహనంతో ఉంటే మేలు. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపారులు నష్టాలను చవి చూస్తారు. శని శ్లోకాలు పఠిస్తే మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. సోదర వర్గం వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలకు వెళతారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. విదేశాల నుంచి ఒక శుభవార్త అందుతుంది. రియల్ ఎస్టేట్ వారికి కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి శుభ సమయం. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి నష్టాలు ఉండే అవకాశం ఉంది. వ్యాపారులకు వ్యాపారం మందకొడిగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో వాదనలు పెట్టుకోవద్దు. కాలం కలిసి రావడం లేదు కాబట్టి సహనంతో ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. నరాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. శివారాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. చేపట్టిన కొత్త పనులన్నీ సకాలంలో పూర్తి చేసి మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఒక తీర్థయా త్ర కూడా చెయ్యవచ్చు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. గృహంలో శాంతి సంతోషం నెలకొంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ప్రతి విషయంలో ఆచి తూచి అడుగు వేయాలి. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ధార్మిక కార్యకలాపాల కోసం అధికంగా ధనవ్యయం ఉంటుంది. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. బంధుమిత్రులతో బేదాభిప్రాయాలు వస్తాయి. కష్టానికి తగిన ఫలితం లేకపోవడం వల్ల నిరాశకు గురవుతారు. శనికి తైలాభిషేకం చేయిస్తే పరిస్థితులు చక్కబడతాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి విపరీతమైన ధనాదాయం ఉంటుంది. వ్యాపారులకు పెట్టుబడుల రూపంలో, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. రాజకీయ నాయకులకు ప్రతిష్ఠ, ప్రజా దరణ పెరుగుతాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ పై అధికారులు మీ పని పట్ల సంతృప్తితో ఉంటారు. ఏ రంగం వారికైనా సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు. పితృ సంబంధిత ధన లాభం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారులకు ప్రయాణాలు లాభిస్తాయి. మరిన్ని మెరుగైన ఫలితాల కోసం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.