ETV Bharat / politics

ఓ వైపు నామినేషన్లు మరోవైపు చేరికలు - దూసుకుపోతున్న సైకిల్ - Joining TDP from YCP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 19, 2024, 6:26 AM IST

YCP Leaders Joining TDP Across the State: రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఓ వైపు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తుండగానే మరోవైపు వైసీపీ కీలక నేతలు ఆ పార్టీని వీడి సైకిలెక్కుతున్నారు. టీడీపీ నాయకులు వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

joining_tdp_from_ycp
joining_tdp_from_ycp

YCP Leaders Joining TDP Across the State: అధికార వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసల జోరు కొనసాగుతోంది. ఓ వైపు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తుండగానే మరోవైపు వైసీపీ కీలక నేతలు ఆ పార్టీని వీడి సైకిలెక్కుతున్నారు. వైసీపీలో ఎంత కష్ట పడినా తగిన గుర్తింపు రావట్లేదని అధిష్టానం సరైన గౌరవం ఇవ్వట్లేదని నేతలు అంటున్నారు.

Joinings in presence of Chandrababu: భీమిలి, జీడి నెల్లూరు నియోజకవర్గాల వైసీపీ నేతలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీఎంఆర్డీఏ (VMRDA) ఛైర్‌పర్సన్‌ అక్కరమాని విజయ నిర్మల వెంకట్రావుతో పాటు విశాఖ జిల్లా చిరంజీవి సేవా సంఘం అధ్యక్షుడు దుక్క కృష్ణాయాదవ్ వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒమ్మి దేవుడు, పద్మనాభం, మాజీ ఎంపీపీ గోపిరాజు, మాజీ సర్పంచులు గేదెల చంద్రారావు, నమ్మి వెంకట్రావు, భీమిలి 25వ వార్డు అధ్యక్షుడు గడిదేశ సూర్యబాబు తెలుగుదేశంలో చేరారు. జీడి నెల్లూరులో సింగిల్ విండో మాజీ ప్రెసిడెంట్ బాబు నాయుడు, మాజీ సర్పంచ్ జయచంద్ర నాయుడు టీడీపీ గూటికి చేరారు. వీరికి చంద్రబాబు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఏపీలో 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ - ఎక్కడంటే... - Prime Minister Modi

Nellore District: నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. వైసీపీకి చెందిన 224 కుటుంబాలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరాయి. టీడీపీ నేత సోమిరెడ్డి ఆధ్వర్యంలో వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముత్తుకూరు మండలం పైనాపురం సర్పంచ్‌ కావలి విజయకుమార్‌ 150 కుటుంబాలతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. చిన్న సంఘం నుంచి 52 కుటుంబాలు టీడీపీ గూటికి చేరాయి. వడ్డిపాలెం, నేలటూరుకు చెందిన 22 కుటుంబాలు టీడీపీ కండువా కప్పుకున్నాయి.

అలానే నెల్లూరు రూరల్‌లో పెద్దఎత్తున వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్​ రెడ్డి నివాసంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో అనుమానితుడు అరెస్టు - Cm Jagan Stone Pelting Case

Krishna District: వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి భారీ చేరికలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో 100 మంది యువత టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గుడివాడలో ఏం అభివృద్ధి చేశాడో చెప్పే ధైర్యం కొడాలి నానికి ఉందా అని రాము సవాల్ విసిరారు. జూద క్రీడలు, గంజాయి విక్రయాలు, మట్టి మాఫియాలతో గుడివాడను నాని నాశనం చేశారని విమర్శించారు.

Prakasam District: వైసీపీలో కష్టపడే వాళ్లకు గౌరవం ఉండటం లేదని అందువల్లనే తెలుగు దేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో పలువురు వైసీపీ నాయకులు పేర్కొన్నారు కూటమి అభ్యర్థి బీఎన్ విజయ కుమార్ సమక్షంలో మండలంలో వైసీపీ నాయకుడు పున్నారావు ఆధ్వర్యంలో 100 కుటుంబాలు తెలుగుదేశంలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

నీళ్లులా సాంబారు, గెంజిలా మజ్జిగ -రోగుల పాలిట శాపంగా జగనన్న ప్రభుత్వాసుపత్రుల ఆహారం - Poor Meal for gov Hospital Patients

Anantapur District: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు మొదలయ్యాయి. కనగానపల్లి మండల మాజీ జెడ్పీటీసీ ఈశ్వరయ్య, సర్పంచ్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో 300 మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అరాచకాలకు అడ్డేలేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే ప్రతి కార్యకర్తకూ తెలుగుదేశం కుటుంబం అండగా ఉంటుందని కూటమి అభ్యర్థి పరిటాల సునీత భరోసానిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.