ETV Bharat / politics

అంగన్వాడీల ఆందోళనకు టీఎన్​టీయూసీ మద్దతు - రాష్ట్ర బంద్​కు పిలుపు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2024, 5:59 PM IST

TNTUC Leaders Round Table Meeting: అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతుగా రాష్ట్ర బంద్ చేపడుతున్నట్లు టీఎన్టీయూసీ నేతలు తెలిపారు. ఈ బంద్​కు అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని వారు కోరారు. సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని టీఎన్టీయూసీ నేతలు మండిపడ్డారు.

TNTUC Leaders Round Table Meeting
TNTUC Leaders Round Table Meeting

అంగన్వాడీల ఆందోళనకు టీఎన్​టీయూసీ మద్దతు - రాష్ట్ర బంద్​కు పిలుపు

TNTUC Leaders Round Table Meeting: అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతుగా ఈనెల 24వ తేదీన అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ చేపడుతున్నట్లు టీఎన్​టీయూసీ నేతలు తెలిపారు. ఈ బంద్​కు అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం- కార్మిక సమస్యలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై నేతలు చర్చించారు.

గడువులోగా విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగిస్తూ ఆదేశాలు

CPI Ramakrishna Fires on YCP Government: ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్స్ ఆందోళనలో ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు జీతాల కోసం ఆందోళలను చేస్తున్నారంటే వైసీపీ పాలన ఎలా ఉందో అర్ధం చేసుకొవచ్చని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే ఇసుకను నిలిపివేసి భవన నిర్మాణ రంగ కార్మికుల పొట్ట కొట్టారని మండిపడ్డారు. ఉపాధి లేక అనేక మంది నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. విధులకు హాజరు కాని అంగన్వాడీ కార్యకర్తలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం దారుణమన్నారు. కార్యకర్తల సమస్యలపై ట్రేడ్ యూనియన్లు చేయనున్న బంద్​కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు.

జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు పోరాడుతాం - స్పష్టం చేసిన అంగన్వాడీలు

Pattabhiram ask Salary of Anganwadis YCP not Increased: ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకు నెలకు రూ.33 కోట్లు ఖర్చు అవుతుందని, అంగన్వాడీలకు మాత్రం జీతం పెంచలేరా అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మరెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. జగన్​ను నమ్మి ఒట్లు వేసిన ప్రతి ఒక్కరూ నేడు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే కార్మికులకు న్యాయం జరిగిందని గుర్తు చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని తెలిపారు. అంగన్వాడీల అరెస్టులతో రాష్ట్రంలో ఒక యుద్ద వాతావరణం కనిపిస్తోందన్నారు. అంగన్వాడీలను ఉద్యోగం నుంచి తొలగించేందుకు ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించలేకపోతే టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

సీఎం క్యాంపు ముట్టడికి వెళ్తే కేసులు తప్పవు- అంగన్వాడీలకు ఎస్పీ హెచ్చరిక

Anganwadi Problems Not Solve The YCP Government: వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో అరాచకమే జరుగుతుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పొతిన మహేశ్ అన్నారు. జగన్ గత ఎన్నికల్లో అధికారం కోసం అనేక అబద్ధాలు చెప్పారని నేడు వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై పోలీసులను ఉపయోగించి అరెస్ట్ చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీలు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, ముఖ్యమంత్రి ఇచ్చిన హమీలనే అమలు చేయమని అడుగుతున్నారని పేర్కొన్నారు. రానున్న జనసేన, టీడీపీ ప్రభుత్వంలో కార్యకర్తల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

అంగన్వాడీలపై పోలీసుల ఉక్కుపాదం - ఎక్కడికక్కడ అరెస్టులు, ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.