ETV Bharat / politics

నారా లోకేశ్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ నేతలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 9:54 PM IST

Prakasam District YSRCP Leaders Join in TDP : అధికార పార్టీ నుంచి టీడీపీలోకి రోజురోజుకు భారీ చేరికలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా నేతలు ఉండవల్లిలో నారా లోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాబోయేది టీడీపీ - బీజేపీ - జనసేన కూటమిల ప్రభుత్వమేనని పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని లోకేశ్ వారిలో ధైర్యం నింపారు.

Prakasam_District_YSRCP_Leaders_Join_in_TDP
Prakasam_District_YSRCP_Leaders_Join_in_TDP

నారా లోకేశ్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ నేతలు

Prakasam District YSRCP Leaders Join in TDP : అధికార పార్టీ నుంచి టీడీపీలోకి రోజురోజుకు భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్సార్సీపీ నేతలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. అధికార పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరి వెంట యర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు ఉన్నారు.

రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై నమ్మకం ఉంచి పార్టీలో చేరే వారందరికీ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని నారా లోకేశ్ స్పష్టం చేశారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎరిక్షన్ బాబును మంచి మెజారిటీతో గెలిపించి తమ వద్దకు తీసుకు రావాలని, నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. రాబోయేది టీడీపీ - బీజేపీ - జనసేన కూటమిల ప్రభుత్వమేనని పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని లోకేశ్ వారిలో ధైర్యం నింపారు.

టీడీపీ అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డి పోటీ- ఎంపీ మాగుంటతో తెలుగుదేశం పార్టీ నేతల భేటీ

వైఎస్సార్సీపీ అరాచక, అసమర్ధ పాలన నచ్చక, టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని పార్టీలో చేరుతున్నట్లు లోకేశ్​కు యర్రగొండపాలెం నేతలు తెలిపారు. పార్టీలో పుల్లల చెరువు మండల పార్టీ కన్వీనర్ బోగులు వెంకటసుబ్బారెడ్డి, సర్పంచులు చిన్నపురెడ్డి రమణారెడ్డి, ఆవుల వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ మాగులూరి సామేలు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బోళ్ల పోలిరెడ్డి తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు.

దామచర్ల జనార్ధన్ ఆధ్వర్యంలో టీడీపీ చేరిన 120 కుటుంబాలు : ఒంగోలులోని 21 డివిజన్​కు చెందిన శ్రీకాంత్ వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి స్వచ్ఛందంగా దామచర్ల జనార్ధన్ ఆధ్వర్యంలో చేరారు. ఆ డివిజన్​లోని శ్రీకాంత్ సారధ్యంలో 120 కుటుంబాలు కూడా చేరాయి. వీరికి దామచర్ల జనార్ధన్ కండువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం దామచర్ల జనార్ధన్ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో రోజురోజుకు అధికార పార్టీ నుంచి పార్టీలో భారీగా చేరుతున్నారని ఆయన చెప్పారు. ప్రజలు బాలినేని శ్రీనివాస రెడ్డిని గెలిపిస్తే నగరంలో ఎలాంటి చిన్న అభివృద్ధి పని చేయకుండా క్యాసినో, పేకాట ఆడుకోవడంపై దృష్టి పెట్టారని దామచర్ల ఆరోపించారు.

టెక్కలి నియోజకవర్గంలో టీడీపీలోకి వలసల జోరు- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన అచ్చెన్నాయుడు

ఎన్నికల వస్తున్న తరుణంలో బాలినేని ప్రతి చోట శిలాఫలకాలు ఏర్పాటు చేసి పనులు చేసినట్లుగా ప్రచారాలు చేసుకుంటున్నారని దామచర్ల జనార్ధన్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం హయాంలోనే నగరంలో అనేక డివిజన్​లో అభివృద్ధి పనులు చేశామని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా బాలినేని పేకాట, క్యాసినో ఆడేందుకు అనేక దేశాలకు వెళ్లకుండా ప్రజలపై దృష్టి పెట్టి అభివృద్ధి పనులు చేయాలని ఆయన సూచించారు.

టీడీపీలోకి వసంత కృష్ణప్రసాద్​, భారీగా అనుచరులతో కలిసి హైదరాబాద్​లో చేరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.