వైసీపీలో చర్చాంశనీయంగా బాలినేని- సీఎం జగన్ తీరుపై అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 11, 2024, 10:20 AM IST

thumbnail

EX Minister Balineni Srinivasa Reddy Disappointing with CM Jagan: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్ల ముఖ్యమంత్రి జగన్‌ అనుసరిస్తున్న వైఖరి చర్చనీయాంశమైంది. బాలినేనిని పొమ్మనకుండా పొగబెడుతున్నారా అని వైఎస్సార్సీపీ నేతలే అనుమానిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్​లను మార్చిన జగన్ ఒంగోలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలపై ఇంకా తేల్చలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇప్పటి వరకు సీటు విషయమై స్పష్టత ఇవ్వలేదు. ఈసారి ఒంగోలు నుంచి పోటీ చేస్తానని బాలినేని ఇప్పటికే ప్రకటించగా ఆ స్థానానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. బాలినేని మాత్రం ఏమైనా సరే ఒంగోలు నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి అభ్యర్థిత్వం సహా ఒంగోలు అసెంబ్లీకి ఇతర నేతలను ఇంఛార్జ్​గా నియమించేందుకు సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. 

తన సీటుతో పాటు ప్రకాశం జిల్లాలో పలు స్థానాల అభ్యర్థులపై చర్చించేందుకు బాలినేనికి సీఎం జగన్ అపాయింట్మెంట్​ ఇవ్వడంలేదని సమాచారం. మంగళవారం బాలినేనికి సమయం ఇచ్చిన జగన్‌ చివరి నిముషంలో రద్దుచేశారు. మూడు రోజులు విజయవాడలో వేచి చూసినా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో అవమానంగా భావించిన బాలినేని హైదరాబాద్ వెళ్లిపోయారు. జగన్​తో పాటు కొందరు ముఖ్య నేతల తీరుపై తన అనుచరుల వద్ద ఆయన ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. జగన్‌కు విధేయుడిగా ఉంటూ మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన బాలినేనికే ఈ పరిస్థితి ఉంటే తమ పరిస్థితి ఏమిటోనని కొందరు వైఎస్సార్సీపీ నేతలు చర్చించుకుంటున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.