ETV Bharat / politics

ఆర్టీసీ బస్సులో బాలకృష్ణ సతీమణి ఎన్నికల ప్రచారం - మహిళలు, విద్యార్థినులతో మాటామంతి - Balakrishna Wife Election Campaign

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 1:19 PM IST

Balakrishna Wife Vasundhara in Election Campaign: రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో బాలకృష్ణకు మద్దతుగా ఆయన సతీమణి హిందూపురం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.

Balakrishna_Wife_Vasundhara_in_Election_Campaign
Balakrishna_Wife_Vasundhara_in_Election_Campaign (ETV Bharat)

Balakrishna Wife Vasundhara in Election Campaign: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం అభ్యర్థి బాలకృష్ణకు మద్దతుగా ఆయన సతీమణి వసుంధర ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళా ప్రయాణికులతో ముచ్చటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వారికి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో మూడు దఫాలు ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేద ప్రజలకు ఆర్టీసీ సేవలను దూరం చేసిందని నందమూరి వసుంధర మండిపడ్డారు. కూలీలు, విద్యార్థులు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులే వారికి అనుకూలంగా ఉంటాయని గ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు మహిళలంతా ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నారన్నారు.

ఎన్నికల ప్రచారంలోకి ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర- సత్యసాయి జిల్లాలో పర్యటన - Vasundhara at election campaign

అనంతరం స్థానిక కూరగాయల మార్కెట్లో ఆమె ప్రచారం నిర్వహించి కాయగూరలు, పూలు, పండ్లు కొనుగోలు చేశారు. కొద్దిరోజులు ఇక్కడే ఉంటున్నామని కాయగూరలు అన్నీ ఇక్కడే కొనుగోలు చేసినట్లు చెప్పారు. ప్రతి ఏటా ఇక్కడ పండే చింతపండు, బెల్లం తీసుకెళ్తామని, ఇక్కడ ఉన్నటువంటి నాణ్యత, రుచి మరి ఎక్కడా లేదన్నారు. పట్టణ ప్రజలకు అన్నివిధాలా అనుకూలంగా ఉండే విధంగా జిల్లాలో ఎక్కడా లేనట్లు బాలకృష్ణ మార్కెట్​ను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఇది ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉందన్న ఆమె సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరిస్తూ వసుంధర ఓట్లు అభ్యర్థించారు.

హిందుపురంలో బాలకృష్ణ సతీమణి ఎన్నికల ప్రచారం - భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థన - Vasundhara Campaign in Hindupur

"వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో మూడు దఫాలు ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేద ప్రజలకు ఆర్టీసీ సేవలను దూరం చేసింది. కూలీలు, విద్యార్థులు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులే వారికి అనుకూలంగా ఉంటాయి. ఇది గ్రహించిన చంద్రబాబు మహిళలంతా ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ పథకాలను తీసుకొచ్చారు. మరోవైపు పట్టణ ప్రజలకు అన్నివిధాలా అనుకూలంగా ఉండే విధంగా జిల్లాలో ఎక్కడా లేనట్లు బాలకృష్ణ మార్కెట్​ను అందుబాటులోకి తీసుకునివచ్చారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలంటే ఎన్డీయే కూటమి అభ్యర్థుల గెలుపునకు ప్రజలంతా కృషి చేయాలని కోరుతున్నాం." - నందమూరి వసుంధర, బాలకృష్ణ సతీమణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.