ETV Bharat / lifestyle

జుత్తు సమస్యలకు "మునగాకు ప్యాక్"! - ఆరోగ్యమే కాదు అందానికీ మంచిదట!

మునగాకుతో జుట్టు కాంతివంతం - ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్న నిపుణులు

Moringa_Powder_Hair_Benefits
Moringa_Powder_Hair_Benefits (ETV Bharat)
author img

By ETV Bharat Lifestyle Team

Published : June 4, 2025 at 2:23 PM IST

4 Min Read
Choose ETV Bharat

Moringa Powder Hair Benefits : జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కుదుళ్లు దృఢంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం పోషకాహారం తీసుకోవడం, సహజసిద్ధమైన హెయిర్ ప్యాక్స్ వేసుకోవడం చాలామందికి అలవాటే! అయితే ఈ జాబితాలో మునగాకు పొడిని చేర్చుకోవాలని సూచిస్తున్నారు. మునగాకును కూరల్లో భాగం చేసుకోవడంతో పాటు హెయిర్ ప్యాక్స్ తయారుచేసుకొని ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని పేర్కొన్నారు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!

గంజి నీళ్లు పారబోస్తున్నారా? ఇలా పెడితే జుట్టు సమస్యలు పోతాయట! మీరు ట్రై చేయండిలా!

మునగాకు పొడిలో ప్రొటీన్, ఫైబర్, విటమిన్ బి6, సి, ఐరన్​, జింక్, క్యాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి కుదుళ్లలో ఉన్న సమస్యల్ని దూరం చేసి జుట్టు ఆరోగ్యంగా ఉండేలా దోహదం చేస్తుందని సూచిస్తున్నారు. అందుకే వీటిని చర్మ, జుట్టు సౌందర్యోత్పత్తుల తయారీలో విరివిగా వాడుతుంటారని పేర్కొన్నారు.

జుట్టు పట్టుకుచ్చులా మెత్తగా
జుట్టు పట్టుకుచ్చులా మెత్తగా (Getty image)

జిడ్డుదనం దూరం : జుట్టు కుదుళ్లు జిడ్డుగా మారడం వల్ల చుండ్రు, దురద వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇవి జుట్టు రాలడానికి కారణమవుతాయని వివరించారు. మునగాకు పొడి ఇలాంటి సమస్యలకు విరుగుడుగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇందులో ఉండే జింక్, కుదుళ్లలోని నూనె గ్రంథులు విడుదల చేసే సీబమ్​ను క్రమబద్ధీకరిస్తుందని తెలిపారు. తద్వారా కుదుళ్లు తేమగా ఉండి జుట్టు పెరుగుదలతో పాటు ప్రకాశవంతంగానూ కనిపించేలా చేస్తాయని వివరించారు.

మునగాకు పొడి
మునగాకు పొడి (Getty image)

దురద రాకుండా! : కొంతమందికి కుదుళ్లలో దురద, పొక్కుల్లా ఏర్పడడం, ఎగ్జీమా, సొరియాసిస్ వంటి సమస్యలు వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు మునగాకు పొడితో తయారుచేసిన హెయిర్ ప్యాక్స్​ను ఉపయోగించడం, ఈ పొడిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని తెలిపారు.

మునగాకు పొడిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కుదుళ్లలోని ఆయా సమస్యల్ని దూరం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని, దీంతో కుదుళ్ల ఆరోగ్యంగా ఉండటంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుందని పేర్కొన్నారు. 25-300 μg/ml మోతాదులలో మునగాకును ఇన్ విట్రోలో వాడటం వలన జెంటామిసిన్-ప్రేరిత జుట్టు కణాల నష్టం నుంచి రక్షణ కల్పిస్తుందని National Library of Medicine పేర్కొంది.

జుట్టు కుదుళ్లు
జుట్టు కుదుళ్లు (Getty image)

జుట్టు నెరవకుండా! : ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటోన్న సమస్య తెల్ల జుట్టు. ఇందుకు ప్రధాన కారణం శరీరంలో ఉండే ఫ్రీరాడికల్సే! ఇవి చర్మ ఆరోగ్యంపైనే కాదు, కుదుళ్లపైనా కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించారు. అందుకే వీటితో పోరాడే గుణాలున్నా మునగాకు పొడిని ఆహారంలో, పాటించే బ్యూటీ రొటీన్​లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ పొడిలో అత్యధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫ్రీ రాడికల్స్​తో పోరాడి ఒత్తిడిని తగ్గించడంతో పాటు తెల్ల జుట్టు సమస్యను నియంత్రిస్తుందని తెలిపారు.

పట్టుకుచ్చులా ప్రకాశవంతంగా! : జుట్టు ఒత్తుగా పెరగడమే కాదు, పట్టుకుచ్చులా మెత్తగా, ప్రకాశవంతంగా ఉన్నప్పుడే దాని అందం ఇనుమడిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మునగాకులోని బెహెనిక్ ఆమ్లం ఈ పనుల్ని సమర్థంగా నిర్వర్తిస్తుందంటున్నారు. ఎందుకంటే ఈ ఆమ్లం జుట్టుకు సహజసిద్ధమైన కండిషనర్​లా పనిచేస్తుందని తెలిపారు. తద్వారా ఆశించిన ఫలితాల్ని పొందవచ్చనని సూచిస్తున్నారు.

కుదుళ్లు దృఢంగా : కుదుళ్లు ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నప్పుడే జుట్టు ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. మునగాకు పొడిలోని ఓలియిక్ ఆమ్లం, యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు ఇందుకు సహాయపడతాయని వివరించారు. కుదుళ్లలో వాపు, ఇతర సమస్యల్ని దూరం చేసి కుదుళ్ల ఆరోగ్యాన్ని ప్రేరేపిస్తాయని పేర్కొన్నారు.

మునగాకు
మునగాకు (Getty image)

ఈ మాస్క్ ట్రై చేయండి! : మునగాకు పొడితో హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల కుదుళ్లు, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. టేబుల్ స్పూన్ చొప్పున మునగాకు పొడి, ఉసిరి పొడి ఒక బౌల్​లోకి తీసుకొని బాగా కలుపుకోవాలని చెబుతున్నారు. ఈ మిశ్రమానికి కొద్దికొద్దిగా పెరుగు జత చేస్తూ పేస్ట్​లాగా కలుపుకొని, దీనిని కుదుళ్లు, జుట్టుకు పట్టించి అరగంట సేపు ఆరనివాలని తెలిపారు. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని సూచించారు.

కండిషనర్​లా : మునగాకు పొడితో సహజసిద్ధమైన కండిషనర్​ని కూడా తయారుచేసుకోవచ్చనని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం రెండు కప్పుల నీటిలో టేబుల్​స్పూన్ మునగాకు పొడి వేసి బాగా మరిగించి, ఆ పై చల్లారిన నీటిని వడకట్టుకోవాలని పేర్కొన్నారు. ఈ నీటిని కుదుళ్లు, జుట్టు మొత్తం తడిసేలా తలపై నుంచి పోసుకోవాలని, కాసేపయ్యాక గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుందని వివరించారు. ఈ చిట్కా జుట్టును ప్రకాశవంతంగా మారుస్తుందని తెలిపారు

NOTE : మునగాకు పొడి సంబంధించి ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్ : మహిళలు ఆ టైమ్​లో జుట్టుకు రంగు వేస్తున్నారా? - ఏమవుతుందో తెలుసా?

జుట్టుకు 'వేసవి' ముప్పు!- ఈ నేచురల్​ ప్యాక్స్​ ట్రై చేస్తే హెల్దీ కురులు సొంతమట!