ETV Bharat / international

కీలక రాష్ట్రాల్లో డొనాల్డ్​ ట్రంప్‌కే జై- బైడెన్​పై ప్రజలు అసంతృప్తి! - Us Opinion Polls Trump

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 4, 2024, 11:16 AM IST

Us Opinion Polls Trump
Us Opinion Polls Trump

US Opinion Polls Trump Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఇటీవల నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లో బైడెన్‌ కంటే ట్రంప్‌ ముందంజలో ఉన్నట్లు తేలింది. కీలక రాష్ట్రాల్లో బైడెన్ పనితీరు పట్ల ఓటర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది.

US Opinion Polls Trump Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఓ సర్వే ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఏడు రాష్ట్రాల్లో వాల్​స్ట్రీట్​ జర్నల్​ ఒపీనియన్ పోల్​ను నిర్వహించింది. కీలక రాష్ట్రాల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ కంటే రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకే మద్దతు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఆరు రాష్ట్రాల్లో ట్రంప్​నకు ఆధిక్యం లభించిన్నట్లు తెలిసింది.

ఆరు రాష్ట్రాల్లో ట్రంప్​ అధిక్యం
ఈ సర్వేలో జో బైడెన్‌ పనితీరుపై కొన్ని అంశాల్లో అసంతృప్తిగా ఉన్నట్లు ఓటర్లు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పన వంటి సమస్యల పరిష్కారంలో ఆయన సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేసినట్లు ఒపీనియన్‌ పోల్​లో తేలింది. ఆరు రాష్ట్రాల్లో ట్రంప్‌నకు ఆరు నుంచి ఎనిమిది పర్సంటేజీ పాయింట్ల ఆధిక్యం లభించినట్లు తెలిపింది. పెన్సిల్వేనియా, మిషిగన్‌, అరిజోనా, జార్జియా, నెవడా, ఉత్తర కరోలినా, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో ఓపీనియన్ పోల్​ను నిర్వహించారు. ఎన్నికల ఫలితాలను ఈ రాష్ట్రాలే అత్యధికంగా ప్రభావితం చేస్తాయనే అంచనాలు కూడా ఉన్నాయి. ఒక్క విస్కాన్సిన్‌లో మాత్రమే ట్రంప్‌ కంటే బైడెన్‌ మూడు పాయింట్లతో ముందంజలో ఉన్నారు.

సర్వే జరిపిన అన్ని రాష్ట్రాల్లో బైడెన్‌ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినవారి కంటే అసంతృప్తిగా ఉన్నవారే అధికంగా ఉండడం గమనార్హం. అదే ట్రంప్‌ విషయంలో మాత్రం ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పనితీరు బాగుందని ఆరు రాష్ట్రాల్లోని ఓటర్లు అభిప్రాయ వ్యక్తం చేశారు. ఒక్క అరిజోనాలో మాత్రమే ఆయనకు నెగెటివ్‌ మార్కులు వచ్చాయి. మరోవైపు ప్రధాన పోల్స్‌ను నిరంతరం పర్యవేక్షించే 'రియల్‌ క్లియర్‌ పాలిటిక్స్‌' మాత్రం బైడెన్‌, ట్రంప్‌ మధ్య హోరాహోరీ పోటీ ఉండనుందని తెలిపింది. ప్రధాన పోల్స్‌ సగటు ఆధారంగా బైడెన్‌ కంటే ట్రంప్‌ 0.8శాతం పాయింట్లతో ముందంజలో ఉన్నట్లు వెల్లడించింది.

ఇప్పటికే లక్షల డాలర్లు సమర్పణ!
వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌తో తలపడేందుకు సిద్ధమైన ట్రంప్‌ను క్యాపిటల్‌ హిల్స్‌పై దాడి వంటి ఎన్నో న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టి ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత క్యాపిటల్‌ హిల్‌ ఘటనలో ఆయన పాత్రపై ఇప్పటికే కోర్టులో విచారణ కొనసాగుతోంది. అంతేకాకుండా రచయిత జీన్‌ కరోల్‌పై లైంగిక ఆరోపణల కేసులో ఆయన ఇప్పటికే కోర్టుకు 97 మిలియన్‌ డాలర్లు విలువ చేసే మొత్తాన్ని బాండు, నగదు రూపంలో సమర్పించారు. పులిట్జర్‌ పురస్కారం పొందిన పాత్రికేయులపై కేసు నమోదు చేసిన వ్యవహారంలో వారికి న్యాయపరమైన ఖర్చుల కింద కోర్టు ఆదేశాల మేరకు సుమారు 3.93 లక్షల డాలర్లు చెల్లించారు. బ్యాంకును మోసం చేశారన్న కేసులో 175 బిలియన్‌ డాలర్లు బాండును కోర్టులో సమర్పించారు. మరోవైపు ఓ కంపెనీపై తప్పుడు కేసు విషయంలో బ్రిటిష్‌ కోర్టు ఆదేశాల మేరకు 3.82 లక్షల డాలర్లు లీగల్‌ ఫీజుల కింద కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తైవాన్‌లో భారీ భూకంపం- 9మంది మృతి- క్వారీల్లో చిక్కుకున్న కార్మికులు - earthquake in taiwan

ఇరాన్‌ ఎంబసీపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి- ఏడుగురు అధికారులు మృతి! - Israel Attack On Damascus

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.