ETV Bharat / international

భారత బలగాల్లోకి అమెరికా డ్రోన్లు- రూ.33 వేల కోట్ల ఒప్పందానికి అగ్రరాజ్యం పచ్చజెండా

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 9:26 AM IST

Updated : Feb 2, 2024, 9:58 AM IST

India US Drone Deal
India US Drone Deal

India US Drone Deal : భారత్‌కు 31 సాయుధ డ్రోన్లు విక్రయించేందుకు అమెరికా ఆమోద ముద్ర వేసింది. రూ.33 వేల కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ఒప్పందం భారత్​- యూఎస్​ మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేస్తుందని అమెరికా ఏజెన్సీ తెలిపింది.

India US Drone Deal : భారత్‌కు 31 'ఎంక్యూ-9బీ' రకం సాయుధ డ్రోన్ల విక్రయానికి అమెరికా పచ్చజెండా ఊపింది. దాదాపు రూ.33 వేల కోట్ల ప్రతిపాదిత ఒప్పందానికి ఆమోద ముద్ర వేసింది. కాగా, గతేడాది జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రరాజ్యం అమెరికా పర్యటన సందర్భంగా ఈ డ్రోన్లకు ఒప్పందాన్ని ప్రకటించారు. 'రూ.33 వేల కోట్ల అంచనా వ్యయంతో ఎంక్యూ-9బీ డ్రోన్లు, సంబంధిత పరికరాలను భారత్‌కు విక్రయించేందుకు ఆమోదం తెలుపుతూ విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది' అని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ ప్రతిపాదిత విక్రయం అమెరికా- భారత్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేస్తుందని అమెరికా ఏజెన్సీ పేర్కొంది. ఇండో-పసిఫిక్‌, దక్షిణాసియాలో ప్రధాన రక్షణ భాగస్వామి భద్రతను మెరుగుపరచడానికి ఈ ఒప్పందం సాయం చేస్తుందని వివరించింది. కాగా, చట్టసభకు ఈ విషయాన్ని తెలియజేసేందుకు అవసరమైన పత్రాలను అందజేసినట్లు తెలిపింది.

యూఎస్​-ఇండియా మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం భారత్‌కు రానున్న 31 డ్రోన్లను సీగార్డియన్ రకం డ్రోన్లుగా అధికారులు పేర్కొన్నారు. వీటిల్లో 15 డ్రోన్లను నౌకాదళానికి అప్పగించనున్నారు. ఆర్మీ, వాయుసేనకు ఎనిమిది చొప్పున కేటాయించనున్నారు.

అమెరికా ప్రశంస!
సాయుధ బలగాల నిఘా సామర్థ్యాలను మెరుగుపరచడానికి భారత్ ఈ డ్రోన్​లను కొనుగోలు చేస్తోంది. ముఖ్యంగా చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యను పరిష్కరించడంలో ఈ డ్రోన్​లు సహాయపడనున్నాయి. మరోవైపు భారత్​ తన మిలిటరీని ఆధునీకరించడంలో భాగంగా చేస్తున్న కృషిని అమెరికా ప్రశంసించింది. ఈ డ్రోన్​లను భారత్​ తమ భద్రతా దళాల్లోకి చేర్చుకోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు తొలగుతాయని చెప్పింది.

డ్రోన్​ ప్రత్యేకతలు!
సీగార్డియన్​ డ్రోన్‌లను ప్రధానంగా మూడు సేవల కోసం కొనుగోలు చేస్తోంది భారత్​. ఇవి సముద్రంలో నిఘా వ్యవస్థలా పనిచేయడమే కాకుండా అత్యవసర సమయాల్లో ఉపయోగపడతాయి. హై ఆల్టిట్యూడ్​ లాంగ్​ ఎండ్యూరెన్స్​ కలిగిన ఈ డ్రోన్‌లు 35 గంటలకుపైగా గాలిలో ఉండగలవు. నాలుగు హెల్‌ఫైర్ క్షిపణులును, దాదాపు 450 కిలోల బాంబులను మోసుకెళ్లగలవు.

హెచ్​-1బీ వీసాల జారీకి కొత్త రూల్స్​!- మారిన నిబంధనలు ఇవే!

ఇక అమెరికా వీసా మరింత భారం- హెచ్​1బీ సహా ఐదు కేటగిరీల ఫీజులు పెంపు

Last Updated :Feb 2, 2024, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.