ETV Bharat / health

సమ్మర్​ వచ్చేసింది- మామిడిపండ్లను ఎలా తింటున్నారు? ఇలా తింటే ఎన్ని లాభాలో! - Soak Mangoes Before Eating

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 9:52 AM IST

Soak Mangoes Before Eating : సమ్మర్ కదా అని యమ్మీ యమ్మీగా ఉండే మామిడి పండ్లను తెగ తింటున్నారా? మంచిదే కానీ మామిడి పండ్లను తినే ముందు నీళ్లలో ఉంచి తింటున్నారా? వేయకుండానే తింటున్నారా? తినేముందు మామిడిపండ్లను నీళ్లలో ఎందుకు నానబెట్టాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Soak Mangoes Before Eating
Soak Mangoes Before Eating

Soak Mangoes Before Eating : మామిడిపండ్ల కోసం సమ్మర్ ఎప్పుడొస్తుందా అంటూ ఏడాదంతా ఎదురుచూసే వాళ్లు చాలా మంది ఉంటారు. భారతీయులకు మామిడిపండ్ల మీద ఉండే ప్రేమ అలాంటిది. అయితే వీటి విషయంలో చాలా మందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. వాటిలో ఒకటి మామిడిపండ్లను తినడానికి ముందు కాసేపు నీళ్లలో వేయాలి. తెచ్చుకుని నేరుగా తినడం మంచిది కాదని కాసేపు నీళ్లలో నానిన తర్వాతే తినాలని పెద్దలు కూడా ఎప్పుడూ చెబుతుంటారు. దీనికి కారణమేంటి? నీటిలో వేసి తినడం వల్ల కలిగే లాభాలేంటి? వేయకుండా తినడం వల్ల కలిగే నష్టాలేంటి అనే విషయాలు తెలుసుకుందాం.

ఫైటిక్ యాసిడ్
మామిడిపండ్లు లేదా కాయలను తినే ముందు నీళ్లలో పెట్టడం ఆరోగ్యానికి మంచిదట. ఎందుకంటే మామిడి పండు బయటి పొరలో ఫైటిక్ యాసిడ్ అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలోని జింక్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు గ్రహించే సహజ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. మామిడి పండు తినడం వల్ల కలిగే పోషకాలకు అడ్డుకట్ట వేస్తుంది. అంతేకాదు ఫైటిక్ యాసిడ్ కారణంగా మలబద్దకం, తలనొప్పి లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

మందు అవశేషాలు
మామిడి పండ్లను పండించే ముందు పురుగుల మందులు వాడచ్చు. లేదా అవి చెట్టు మీద ఉండగానే దుమ్ము, ధూళి, మురికి లాంటివి వాటిపై పడచ్చు. ఇలా రకరకాలుగా కలుషితమైన మామిడి పండును కాసేపు నీళ్లలో నానబెట్టడం వల్ల శుభ్రమవుతుంది. చక్కగా కడుక్కుని తినడం వల్ల మరిన్ని మంచి ప్రయోజనాలు అందుతాయి.

మెత్తబడతాయి
మామిడి పండ్లను తినే ముందు నీళ్లలో వేసి కాసేపు ఉంచడం వల్ల పండు చర్మం కాస్త మృదువుగా మెత్తగా మారే అవకాశాలున్నాయి. ఇలా చేయడం వల్ల మామిడిని తొక్క నుంచి వేరు చేయడం సులభం అవుతుంది. వంటకాల కోసం పచ్చళ్ల కోసం మామిడి పండ్లను ఉపయోగించడానికి ముందు కూడా నీళ్లలో కాసేపు ఉంచి తీయడం మంచిది.

మరింత రుచి
నీటిలో నానడం వల్ల మామిడిపండ్లు అదనపు రుచిని పొందుతాయి. నీటిలో కొద్ది సేపు ఉండటం వల్ల పండు మరింత తీపి దన్నాన్ని చేకూర్చుకుంటుంది. ఫలితంగా మీరు తృప్తిగా మామిడి పండును తినచ్చు.

ఉపయోగాలు

  • మామిడి పండ్లలో విటమిన్-ఏ, విటమిన్-సీ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఇంటాయి. ఇవి రోగనిరోధక పనితీరు, కంటి ఆరోగ్యం, చర్మారోగ్యంలో కీలకపాత్ర పోషిస్తాయి.
  • అలాగే దీంట్లో ఎక్కువ మొత్తంలో లభించే ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, బరువు నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది.
  • మామిడిపండ్లలో బీటా కెరోటిన్ ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షించడంలో సహాయపడతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
  • పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-కె కలిగి ఉండే మామిడి పండ్లు గుండె ఆరోగ్యం, ఎముకల బలం మెరుగుపరచడమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి శ్రేయస్సు కలిగిస్తాయి.
  • మామిడిపండ్లలో అధికంగా లభించే విటమిన్-సీ కంటెంట్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంటువ్యాధులు, అనారోగ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
  • అలాగే దీంట్లోని డైటరీ ఫైబర్ ప్రేగుల కదలికలను ప్రోత్సహించి మలబద్దకం, జీర్ణ రుగ్మతలను నివారించి జీర్ణక్రియకు సహాయపడుతుంది.

బీ కేర్​ఫుల్​- ఈ ఆహార పదార్థాలు మీ పిల్లలకు అస్సలు పెట్టకండి! - harmful food for kids

ఈ 7 అలవాట్లు చేసుకుంటే చాలు మీ లైఫ్​ ఛేంజ్​! ఆఫీస్​ నుంచి వచ్చాక ఈ పనులు చేయండి! - HABITS TO CHANGE YOUR LIFE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.