ETV Bharat / health

"గోళ్లు విరిగిపోతున్నాయా? జుత్తు రాలుతోందా!" - ఇదొక్కటి భర్తీ చేస్తే సమస్య పరిష్కారం సులభమే! - IRON RICH FOODS

రక్తంలో ఐరన్ లోపంలో అనారోగ్య సమస్యలు - రోజు వారీ ఆహారంలోనే పరిష్కార మార్గాలు

Iron_Rich_Foods
Iron_Rich_Foods (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : May 14, 2025 at 2:35 PM IST

3 Min Read

These Iron Rich Foods to Help Improve Hemoglobin Levels : శరీరంలో రక్తం కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో ఏ చిన్న సమస్యలు వచ్చినా కూడా అది పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. శరీరంలో తగినంత రక్తం లేకపోతే ఎనీమియా బారిన పడతారు. ఇందుకు ప్రధాన కారణం విటమిన్ లోపం, ఐరన్ లేకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఐరన్ లోపం వల్ల చెమటలు పట్టడం, అలసిపోవడం, కళ్లు తిరగడం ఇలాంటి లక్షణాలు అన్ని కూడా ఐరన్ లోపం వల్ల వచ్చే సమస్యలు. శరీరంలో ఎర్ర రక్తకణాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుందని, దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం!

ఫ్రూట్స్ : శరీరంలో ఐరన్ కంటెంట్ పెంచడానికి, రక్తహీనత లోపాన్ని నివారించడానికి అత్యంత సులభమైన, రుచికరమైన మార్గాల్లో ఫ్రూట్స్ ఒకటి. మల్బరీలు, ఆలివ్​ల్లో అధికంగా ఐరన్ కంటెంట్​ను కలిగి ఉంటాయని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా దానిమ్మ, సపోటా, సీతాఫలం, పుచ్చకాయ వంటి ఫ్రూట్స్ ఐరన్ అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

పాలకూర
పాలకూర (Getty image)

ఆకుకూరలు : వీటిల్లో శరీరానికి అవసరమయ్యే అనేక గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. క్రమం తప్పకుండా ఆకుకూరలు తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుందని చెబుతున్నారు. బచలకూర, కొలార్డ్ గ్రీన్స్, పాలకూర లాంటి ఆకుకూరలను క్రమం తప్పకుండా తినాలని పేర్కొన్నారు. ముఖ్యంగా పాలకూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత, అలసట లాంటి సమస్యలను నివారించవచ్చనని clevelandclinic పేర్కొంది.

చిక్కుళ్ళు : ప్రోటీన్ కోసం ఆరోగ్యకరమైన శాఖాహార ఎంపికలో చిక్కుళ్లు ఒకటి. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాయధాన్యాలు, బఠానీలు, సోయాబీన్స్ లాంటివి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయి పెరుగుతుందని సూచిస్తున్నారు.

బీట్​రూట్
బీట్​రూట్ (Getty image)

బీట్​రూట్ : చూడ్డానికే ఎర్రగా కనిపించే బీట్​రూట్​లో ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయంటున్నారు నిపుణులు. కానీ తినడానికి చాలా మందికి అంతగా ఇష్టం ఉండదు. బీట్​రూట్ క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు వివరిస్తున్నారు. అంతేకాకుండా వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుందని తెలిపారు. రోజూ ఒక గ్లాసు బీట్​రూట్ జ్యూస్ తాగడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలో గణనీయమైన పెరుగుదల ఉందని international journal of Nursing Education And Research జర్నల్ అధ్యయనంలో పేర్కొంది.

రెడ్​మీట్
రెడ్​మీట్ (Getty image)

రెడ్​మీట్ : రక్తహీనతను నివారించడంలో రెడ్​మీట్ సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇందులో హీమ్ ఐరన్ (heam iron) అధికంగా ఉండటం వల్ల దీన్ని శరీరం సులభంగా గ్రహిస్తుందని తెలిపారు. ఇందులో ఉన్న ప్రోటీన్ అనేది ఎర్ర రక్త కణాల నిర్మాణానికి, రక్తహీనత నివారణకు దోహదపడుతుందని వివరించారు.

గుమ్మడికాయ గింజలు
గుమ్మడికాయ గింజలు (Getty image)

గుమ్మడి గింజలు : చూడటానికి చిన్నగా, కాస్త గట్టిగా ఉండే గుమ్మడి గింజల వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ విత్తనాలలో మెగ్నీషియం, కాపర్, ప్రొటీన్, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ఐరన్ శాతం అధికంగా ఉంటుందని తెలిపారు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో ఐరన్ కంటెంట్ మెరుగుపడుతుందని National Library of Medicine పరిశోధనలో తేలింది.

రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడం, కండరాల బలాన్ని మెరుగుపరచడం, మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఐరన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలసట, శ్వాస ఆడకపోవడం, తలనొప్పి, గోళ్లు పెళుసుగా మారడం, జుట్టు రాలడం వంటి లక్షణాలు అనేవి ఐరన్ లోపం వల్ల వ్యక్తమవుతాయి. ఐరన్ కంటెండ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను రోజు తీసుకోవడం వల్ల రక్తహీనత లాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది

రోజూ 'యాలకులు' తింటున్నారా? - మీ శరీరంలో జరిగే మార్పులేంటో తెలుసా?

అరికాళ్లలో మంటగా ఉందా? - అయితే మీ బాడీలో ఆ సమస్య ఉండొచ్చట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.