Hair Oil Usage Methods : తలకు నూనె రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని, వెంట్రుకలు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయని పెద్దలు చెబుతుంటారు. కానీ ఎప్పుడు రాసుకుంటే మంచిది ఎన్ని రోజులకు సారి, ఎలా రాసుకుంటే జుట్టు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అనే విషయాలు మీకు తెలుసా!
జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయన్నది వాస్తవమే. కానీ దానికి ఓ సమయం, పద్ధతి ఉంటేనే మంచి ఫలితాలు పొందవచ్చట. ఎప్పుడు పడితే అప్పడు ఎలా పడితే అప్పడు నూనె రాసుకోవడం వల్ల ప్రయోజనాల కన్నా సమస్యలే ఎక్కువ కలుగుతాయట. తలకు నూనె ఎప్పుడు రాసుకోవాలి? ఎలా రాసుకోవాలి? అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం రండి.
తలకు నూనె ఎన్ని రోజులకోసారి రాసుకోవాలంటే ?
నూనెలు జిడ్డుగా, జిగతగా ఉంటాయి. అందుకే ఎక్కువ సమయం తలకు, వెంట్రుకలకు ఉంచుకోవడం మంచిది కాదట. తల, జుట్టు జిడ్డుగా ఉండటం వల్ల మలినాలను ఆకర్షిస్తుందట. ఇవి ఇతర రంధ్రాల్లోకి చొచ్చుకుపోయి, వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందట. కాబట్టి మీ జుట్టుకు తరచుగా నూనె రాసుకోవడం మంచిది కాదని వారానికి ఒకటి లేదా రెండు సార్లు రాసుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, తలకు నూనె రాసుకోవడం అనేది తలస్నానం చేసే సంఖ్యపై కూడా ఆధారపడి ఉంటుందట. మీరు తరచుగా తలస్నానం చేస్తున్నట్లయితే వారానికి నాలుగు సార్లు నూనె రాసుకోవచ్చట.
జుట్టుకు ఎంత నూనె రాయాలంటే?
జుట్టుకు ఎంత నూనె రాయాలి అనేది వెంట్రుకల రకం, ఆకృతి, పొడవు, మందంపై ఆధారపడి ఉంటుంది. మందపాటి, మతక, పొడవాటి, గిరిజాల జుట్టుకు ఎక్కువ నూనె రాసుకోవాలి. అలాగే సన్నగా, పొట్టిగా, స్ట్రైయిట్ గా ఉండే వెంట్రుకలకు కాస్త తక్కువ నూనె రాయాలి.
నూనె రాసుకునే సరైన పద్ధతి ఏంటంటే?
నూనె వెంట్రుకలకు రాయడం వేరు. అలాగే తలకు పట్టించడం వేరు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వెంట్రుకలకు నూనె రాయడం కన్నా తలకు పట్టించడం చాలా అవసరం. వెంట్రుకలకు రాయడం వల్ల కేవలం హెయిర్ ల్యూబ్రికెంట్ గా తయారవుతుంది. అదే తలకు నూనె పట్టిచడం వల్ల మొత్తం వెంట్రుకల ఆరోగ్యం మెరుగవుతుంది. నూనెతో తలకు ఎంత బాగా మసాజ్ చేస్తే, ఫలితాలు అంత ఎక్కువగా ఉంటాయట.
ఇలా తలకు సరైన సమయంలో నూనె రాయడం, నూనెతో తలకు మర్దనా చేయడం వల్ల ఆరోగ్యకరమైన కురులకు కావాల్సిన తేమ అందుతుంది. వెంట్రుకలు పొడుగ్గా, ఒత్తుగా తయారవుతాయి. వేడి, ఆక్సీకరణ ఒత్తిడి, మలినాల నుంచి వెంట్రుకలకు రక్షణ దొరుకుతుంది. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గి ఆరోగ్యకనమైన మెరిసే కురులు మీ సొంతమవుతాయి. వీటితో పాటు రక్తపోటు, హృదయ స్పందన రేటు, హార్మోన్ల ఒత్తిడి వంటివి నియంత్రణలో ఉంటాయట.