ETV Bharat / entertainment

మంచు వారింటికి కొత్త వారసురాలు - పండంటి పాపకు జన్మనిచ్చిన మంచు మనోజ్ భార్య - Manchu Manoj Daughter

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 13, 2024, 12:47 PM IST

Updated : Apr 13, 2024, 1:39 PM IST

Manchu Manoj Mounika Blessed Baby Girl : హీరో మంచు మనోజ్ భార్య మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ మంచు లక్ష్మీ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్​గా ప్రకటించింది.

మంచు వారింటికి కొత్త వారసురాలు - పండంటి పాపకు జన్మనిచ్చిన మంచు మనోజ్ భార్య
మంచు వారింటికి కొత్త వారసురాలు - పండంటి పాపకు జన్మనిచ్చిన మంచు మనోజ్ భార్య

Manchu Manoj Mounika Blessed Baby Girl : మంచు ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. మంచు మనోజ్ భార్య మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రేమ వివాహంతో ఒకటైన మంచు మనోజ్ - భూమా మౌనికలకు లిటిల్ ఏంజెల్ పుట్టిందని మంచు లక్ష్మీ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్​గా ప్రకటించింది. ఆ మహాశివుడి ఆశీస్సులతో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న దేవత తమ ఇంట్లోకి అడుగుపెట్టిందని లక్ష్మీ పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే ఇప్పుడు మంచు ఫ్యామిలీలో విష్ణుకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా మంచు లక్ష్మీ ప్రసన్నకు సరోగసీ ద్వారా ఒక కూతురు ఉంది.

"మనోజ్ మౌనికలు ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన పాప పుట్టింది. ఇప్పుడు వాళ్లు నలుగురయ్యారు. దేవుళ్ల ఆశీర్వాదంతో మా ఇంట దేవత అడుగుపెట్టింది. తన అన్న ధైరవ్ సంతోషంలో మునిగిపోయాడు. ఈ చిన్నారిని ఎమ్ఎమ్ పులి అని పిలుచుకుంటాం. ఆ శివానుగ్రహం మా కుటుంబంపై ఉండాలని ఆశిస్తున్నాం. మీ ప్రేమానురాగాలతో ఆశీర్వదించమని కోరుతున్నాం" అని ట్వీట్​లో పేర్కొన్నారు.

గతేడాది మార్చిలో ఫిల్మ్ నగర్​లోని మోహన్ బాబు నివాసంలోనే మనోజ్ - మౌనికల పెళ్లి జరిగింది. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. 2015లో ప్రణతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మనోజ్ 2019లో మనస్పర్దల కారణంగా విడాకులు తీసుకున్నాడు. అలాగే భూమా మౌనిక కూడా తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని విడిపోయింది. మనోజ్‌తో పెళ్లికి ముందే మౌనికకు ధైరవ్ రెడ్డి అనే కొడుకు ఉన్నాడు. సినిమాల విషయానికొస్తే 2004లో దొంగదొంగది సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ బిందాస్, కరెంట్ తీగ, వేదం లాంటి గుర్తుండిపోయే సినిమాలు తీశారు. 2017లో రిలీజ్ అయిన ఒక్కడు మిగిలాడు సినిమాతో వెండితెరకు బ్రేక్ ఇచ్చాడు. దాదాపు ఏడేళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఇటీవల బుల్లితెరపై ఉస్తాద్ అనే షోలో హోస్ట్​గా వ్యవహరిస్తున్నారు.కొద్ది రోజుల క్రితం వాట్ ది ఫిష్ అనే పేరుతో మూవీని అనౌన్స్ చేసిన మనోజ్ కొన్ని పర్సనల్ రీజన్స్​తో ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం తేజా సజ్జా, దుల్కర్ సల్మాన్‌లతో మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవే కాకుండా మరో రెండు సినిమాల కథలకు కూడా ఓకే చెప్పారట. టాప్​ ట్రెండింగ్​లో మమితా బైజు - కుర్రాళ్ల మనసు దోచేస్తూ! - Premalu OTT

OTTలో దూసుకుపోతున్న తెలుగు హారర్ కామెడీ - రిలీజైన తొలిరోజే ట్రెండింగ్‌లోకి! - Amazon Prime OTT Telugu Movies

Last Updated :Apr 13, 2024, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.