ETV Bharat / entertainment

ఊహించని సర్​ప్రైజ్​ - 'కల్కి'లో ఆ జోడీ రీఎంట్రీ! - KALKI 2898 AD

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 22, 2024, 6:13 PM IST

Kalki 2898 AD Guest Roles : 'కల్కి' సినిమా సెకెండ్ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అభిమానులకు రోజుకో సర్​ప్రైజ్ ఎదురవుతోంది. ఇప్పటికే ఆ వీడియోను డీకోడ్​ చేస్తూ నెట్టింట సందడి చేస్తున్న ఫ్యాన్స్​ మరో రూమర్​పై ఇంట్రెస్​ చూపిస్తున్నారు. అది నిజమైతే బాగున్ను అని అనుకుంటున్నారు. అదేంటంటే?

Kalki 2898 AD
Kalki 2898 AD (ETV Bharat)

Kalki 2898 AD Guest Roles : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన 'కల్కి 2898AD' మూవీకి సంబంధించిన రిలీజ్​ ట్రైలర్ తాజాగా విడుదలైంది. మొదటి దానికంటే ఎన్నో సర్​ప్రైజులతో ఉన్న ఆ గ్లింప్స్ ప్రస్తుతం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇదివరకు ఉన్నవారు కాకుండా పలువురు కొత్త నటీనటులు ఇందులో కెమియో లేకుంటే మెయిన్​ రోల్స్​లో కనిపించి ఆడియెన్స్​ను ఆశ్చర్యపరిచారు. అయితే తాజాగా మరో సెన్సేషనల్ జోడీ కూడా ఈ చిత్రంలో భాగమైనట్లు నెట్టింట ఓ రూమర్ తెగ్ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ వారెవరంటే?

'సీతారామం' సినిమాతో సెన్సేషనల్ జోడీగా పేరొందారు దుల్కర్​ సల్మాన్​, మృణాల్ ఠాకూర్​ జోడీ. ఆ సినిమాలో వారి నటనకు ఎంతో మంది ఎమోషనల్​గా కనెక్ట్ అయ్యారు. డీసెంట్​ లుక్స్​తో పాటు క్లీన్​ కెమిస్ట్రీ వల్ల ఎంతో మందికి ఈ జోడీ తెగ నచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరే మళ్లీ జంటగా కనిపించనున్నారట. 'కల్కి' సినిమాలో ప్రభాస్ తల్లిదండ్రులుగా నటించనున్నారట. ఇప్పుడు ఇదే విషయంపై సినీ వర్గాల్లో తెగ చర్చలు జరుగుతున్నాయి.

విష్ణుయశస్, సుమతిలుగా ప్రాధాన్యం కలిగిన రెండు పాత్రల్లో ఈ ఇద్దరూ స్క్రీన్​పై మెరవనున్నారట. అయితే వీరిద్దరూ సినిమాలో కనిపించేది కాసేపే అయినప్పటికీ ఆ పాత్రలను మేకర్స్​ చాలాకాలం పాటు గుర్తుండిపోయేలా తీర్చిదిద్దారట. చూస్తుంటే మళ్లీ దుల్కర్, మృణాల్ తమ నటనతో మరోసారి అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండగా, ఈ చిత్రంలో ఇంకా పలువురు స్టార్ యాక్టర్స్ కూడా గెస్ట్ రోల్స్​లో కనిపించి సర్​ప్రైజ్ చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది. వీరిలో టాలీవుడ్ హీరోలు నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ, మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్​స‌ల్మాన్ కూడా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఇంకా టాలీవుడ్ దర్శకధీరుడు రాజ‌మౌళి కూడా క‌నిపించ‌నున్నారట. కీల‌క సంద‌ర్భంలో జక్కన్న పాత్ర క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ కూడా కనిపించనున్నారని సమాచారం.

ఇక కల్కి సినిమా విషయానికి వస్తే, జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొనె, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు మాళవిక నాయర్​, పశుపతి, శోభన లాంటి స్టార్స్ కీలక పాత్ర పోషించారు. వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు.

అడ్వాన్స్​ బుక్కింగ్స్​లో 'కల్కి' క్రేజ్​ - RRR, 'సలార్​'ను దాటేస్తుంది! - Kalki 2898 AD

'కల్కి' రిలీజ్ ట్రైలర్​కు సెన్సేషనల్ రెస్పాన్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.