ETV Bharat / entertainment

వంద కోట్ల క్లబ్​లో తెలుగు యంగ్ హీరోలు- నిఖిల్, సిద్ధు, తేజ లిస్ట్​లో ఇంకా ఎవరంటే - 100 Crore Tollywood Heros

100 Crore Tollywood Heros: టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రూ.100 కోట్ల వసూళ్లు చేసిన యంగ్ హీరోలు ఎవరంటే?

100 Crore Tollywood Heros
100 Crore Tollywood Heros
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 9:16 PM IST

100 Crore Tollywood Heros: టాలీవుడ్​ అగ్రస్థాయి హీరోలు రూ.100 కోట్ల కలెక్షన్ సాధించడం ఈ రోజుల్లో సాధారణ విషయంగా మారిపోయింది. ఇప్పటికే అనేక మంది హీరోలు ఈ ఘనత కూడా సాధించారు. అయితే వాళ్ల తర్వాత మీడియం రేంజ్ హీరోలు కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. రీసెంట్​గా సిద్ధు జొన్నలగడ్డ కూడా రూ.100 కోట్ల క్లబ్​లో చేరిపోయాడు. సిద్ధు లీడ్​ రోల్​లో నటించిన టిల్లు స్క్వేర్ సినిమా తాజాగా రూ.100 కోట్లు క్రాస్ చేసింది. దీంతో మరో యంగ్ హీరో ఈ లిస్ట్​సలో చేరాడు. అయితే ఇప్పటివరకూ రూ.100+ వసూళ్ల మార్క్ అందుకున్న యంగ్ హీరోలు ఎవరో చూద్దాం.

  • తేజ సజ్జ: యంగ్ హీరో తేజ సజ్జ- ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన హను-మాన్ 2024 సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్​హిట్ అయ్యింది. చిన్న సినిమాగా రూపొందిన సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో హను-మాన్ వరల్డ్​వైడ్​గా రూ.330+ కోట్లు వసూల్ చేసింది. ఈ క్రమంలో హీరో తేజ తన మూడో సినిమాతోనే ఈ ఘనత అందుకున్నాడు
  • నిఖిల్ సిద్ధార్థ్: యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్- అనుపమ పరమేశ్వరణ్ కాంబోలో 2022లో వచ్చిన కార్తికేయ-2 భారీ విజయం దక్కించుకుంది. అప్పటివరకు నిఖిల్ 10కిపైగా సినిమాలు చేసినా ఈ రేంజ్ కలెక్షన్లు ఎప్పుడూ అందుకోలేదు. కార్తికేయకు సీక్వెల్​గా వచ్చిన ఈ సినిమా నార్త్ ఆడియెన్స్​ను సైతం ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీ కూడా రూ.100 కోట్లకుపై వసూళ్లు చేసింది.
  • వైష్ణ‌వ్ తేజ్: మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ తన తొలి సినిమా 'ఉప్పెన'తోనే ఈ ఘనత సాధించాడు. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమాకుగాను 2022 జాతీయ అవార్డు కూడా లభించింది.
  • విజ‌య్ దేవ‌ర‌కొండ: రౌడీబాయ్ విజయ్ దేవరకొండ తన ఆరో సినిమా 'గీతా గోవిందం'తో రూ.100 కోట్ల క్లబ్​లో చేరాడు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మంధన్నా హీరోయిన్​గా నటించింది.
  • నాని: నేచురల్ స్టార్ నాని 'దసరా' సినిమాతో వంద కోట్ల క్లబ్​లో చేరాడు. నాని దసరాకు ముందు అనేక సినిమాలు చేసినప్పటికీ ఈ ఘనత అందుకోలేకపోయాడు. దీంతో 2023లో రిలీజైన ఈ సినిమా నాని కెరీర్​లో ప్రత్యేకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
  • ర‌వితేజ: టాలీవుడ్​లో సీనియర్ అండ్ స్టార్ హీరో అయిన రవితేజకు రూ.100 కోట్ల సినిమాకు చాలా సమయం పట్టింది. ఆయన 2022లో ధమాకా సినిమాతో ఈ ఘనత అందుకున్నాడు.

రూ.100 కోట్ల క్లబ్​లోకి సిద్ధు- బాక్సాఫీస్ వద్ద టిల్లు స్క్వేర్ డబుల్ జోరు - Tillu Square Collections

విజయ్​ 'ఫ్యామిలీ స్టార్'​ ఫస్ట్ డే కలెక్షన్స్​ - ఓపెనింగ్స్​ ఎన్ని కోట్లంటే? - Family star Day 1 collections

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.