ETV Bharat / education-and-career

సౌత్​ ఈస్ట్ సెంట్రల్​ రైల్వేలో 733 అప్రెంటీస్​ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - Railway Jobs 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 10:23 AM IST

SECR RECRUITMENT 2024
Railway Jobs 2024

Railway Jobs 2024 : రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. సౌత్​ ఈస్ట్ సెంట్రల్​ రైల్వే 733​ అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

Railway Jobs 2024 : సౌత్ ఈస్ట్​ సెంట్రల్​ రైల్వే ఒప్పంద ప్రాతిపదికన 733 అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • కార్పెంటర్​ - 38
  • కోపా (COPA) - 100
  • డ్రాఫ్ట్​మెన్​ (సివిల్​) - 10
  • ఎలక్ట్రీషియన్​ - 137
  • ఎలక్ట్రో మెకానిక్​ - 5
  • ఫిట్టర్​ - 187
  • మెషినిస్ట్ - 4
  • పెయింటర్​ - 42
  • ప్లంబర్​ - 25
  • మెకానిక్​ (RAC) - 15
  • ఎస్​ఎండబ్ల్యూ - 4
  • స్టెనో (ఇంగ్లీష్​) - 27
  • స్టెనో (హిందీ) - 19
  • డీజిల్ మెకానిక్​ - 12
  • టర్నర్​ - 4
  • వెల్డర్​ - 18
  • వైర్​మెన్ - 80
  • కెమికల్ లేబరేటరీ అసిస్టెంట్​ - 4
  • డిజిటల్ ఫొటోగ్రాఫర్​ - 2
  • మొత్తం పోస్టులు - 733

విద్యార్హతలు
SECR Apprentice Eligibility : అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగణంగా 10, 10+2తో పాటు, సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి.

వయోపరిమితి
SECR Apprentice Age Limit : అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.

దరఖాస్తు రుసుము
SECR Apprentice Fee : నోటిఫికేషన్​లో దరఖాస్తు రుసుము గురించి ప్రస్తావించలేదు. కనుక అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం
SECR Apprentice Selection Process : టెన్త్​, ఇంటర్, ఐటీఐ​ల్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత వారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాదిపాటు అప్రెంటీస్​షిప్​ ట్రైనింగ్ ఇస్తారు.

దరఖాస్తు విధానం
SECR Apprentice Application Process :

  • అభ్యర్థులు ముందుగా సౌత్ ఈస్ట్​ సెంట్రల్​ రైల్వే అధికారిక వెబ్​సైట్​ https://www.apprenticeshipindia.gov.in ఓపెన్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
SECR Apprentice Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 మార్చి 12
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఏప్రిల్​ 12

నిరుద్యోగులకు అలర్ట్​ ​ - ఘోస్ట్ జాబ్స్ విషయంలో జర జాగ్రత్త! - Ghost jobs explained

ఇస్రో బంపర్​ ఆఫర్​ - ఇంటర్న్​షిప్​ & ప్రాజెక్ట్ ట్రైనీ స్కీమ్స్​ ప్రకటన - అప్లై చేసుకోండిలా! - ISRO Internship 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.