ETV Bharat / education-and-career

ఐటీఐ, ఇంజినీరంగ్ అర్హతతో NLCలో 239 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా! - NLC Industrial Trainee Posts 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 10:38 AM IST

NLC Industrial Trainee Posts
NLC Recruitment 2024

NLC Recruitment 2024 : ఇంజినీరింగ్, ఐటీఐ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. నైవేలీ లిగ్నైట్​ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (NLC) 239 ఇండస్ట్రియల్​ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు మీ కోసం.

NLC Recruitment 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్​ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్​ (NLC) 239 ఇండస్ట్రియల్​ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగాల వివరాలు

  • ఇండస్ట్రియల్​ ట్రైనీ (ఎస్​ఎంఈ & టెక్నికల్) - 100 పోస్టులు
  • ఇండస్ట్రియల్ ట్రైనీ (మైన్స్​ & మైన్స్​ సపోర్ట్ సర్వీసెస్​) - 139 పోస్టులు

విద్యార్హతలు
NLC Industrial Trainee Job Eligibility : సంబంధిత విభాగంలో ఐటీఐ (ఎన్​టీసీ), మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులకు అర్హులు.

వయోపరిమితి
NLC Industrial Trainee Age Limit : అభ్యర్థుల కనిష్ఠ వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయస్సు జనరల్​, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 37 ఏళ్లు; ఓబీసీలకు 40 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 42 ఏళ్లులోపు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ
NLC Industrial Trainee Selection Process : అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి డాక్యుమెంట్​ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి, ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
NLC Industrial Trainee Salary :

  • ఇండస్ట్రియల్​ ట్రైనీ (ఎస్​ఎంఈ & టెక్నికల్)లకు మొదటి ఏడాది రూ.18,000; రెండో ఏడాది రూ.20,000; మూడో ఏడాది రూ.22,000 సాలరీ ఉంటుంది.
  • ఇండస్ట్రియల్ ట్రైనీ (మైన్స్​ & మైన్స్​ సపోర్ట్ సర్వీసెస్​)లకు మొదటి ఏడాది రూ.14,000; రెండో ఏడాది రూ.16,000; మూడో ఏడాది రూ.18,000 జీతం ఉంటుంది.

దరఖాస్తు విధానం
NLC Industrial Trainee Application Process :

  • అభ్యర్థులు ముందుగా ఎన్​ఎల్​సీ అధికారిక వెబ్​సైట్​ https://www.nlcindia.in ఓపెన్ చేయాలి.
  • కేరీర్స్ సెక్షన్​లోకి వెళ్లి Industrial Trainee అప్లికేషన్ లింక్​పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్​ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
NLC Industrial Trainee Important Dates :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 మార్చి 20
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఏప్రిల్​ 19

రైల్​ కోచ్​ ఫ్యాక్టరీలో 550 అప్రెంటీస్ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్​ - 'నవోదయ'లో 1377 నాన్​-టీచింగ్ పోస్టులు భర్తీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.