ETV Bharat / business

గోల్డెన్ ఛాన్స్​ - ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్​లో ఇన్వెస్ట్​ చేస్తే మీ డబ్బులు డబుల్​!

Post Office PPF Scheme Benefits In Telugu : మీ పిల్లల చదువులు, పెళ్లిళ్లు, భవిష్యత్ అవసరాల కోసం మదుపు చేయాలని అనుకుంటున్నారా? ఎలాంటి నష్టభయం లేకుండా మంచి రాబడి రావాలా? అయితే ఇది మీ కోసమే. పోస్ట్​ ఆఫీస్​ పీపీఎఫ్ స్కీమ్​లో చేరితే మీ డబ్బులు రెట్టింపు కావడం గ్యారెంటీ. మరెందుకు ఆలస్యం ఆ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Post Office PPF scheme interest rates
Post Office PPF scheme benefits
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 11:39 AM IST

Post Office PPF Scheme Benefits : మధ్య తరగతి ప్రజలు తమ భవిష్యత్ అవసరాల కోస డబ్బును పొదుపు, మదుపు చేసుకోవాలని అనుకుంటారు. ఇందుకోసం బెస్ట్ స్కీమ్స్ ఏమున్నాయా అని చూస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఇండియన్ పోస్ట్​ ఒక బెస్ట్ స్కీమ్​ను అందిస్తోంది. అదే పోస్ట్ ఆఫీస్​ పీపీఎఫ్​ పథకం. ఏ మాత్రం నష్టభయంలేని, మంచి రాబడిని ఇచ్చే సురక్షితమైన పెట్టుబడి పథకం ఇది. దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పథకంలో ఎలా చేరాలి?
ఈ స్కీమ్​లో భారతీయ పౌరులు ఎవరైనా చేరవచ్చు. నేరుగా పోస్ట్ ఆఫీసులకు వెళ్లి ఈ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. లేదా నిర్దేశిత బ్యాంకుల్లో కూడా ఈ పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఆఫీస్​ పీపీఎఫ్ పథకంలో చేరిన వారికి 7.1 శాతం వడ్డీ అందిస్తున్నారు.

కాంపౌండింగ్ ఎఫెక్ట్​
ఖాతాదారులు ఒక సంవత్సరంలో కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఈ పోస్ట్ ఆఫీస్​ పీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయవచ్చు. ఈ పథకం 15 ఏళ్ల కాలవ్యవధిని కలిగి ఉంటుంది. ఆ తరువాత కూడా ఈ స్కీమ్​ను మరో 5 ఏళ్లకు పొడిగించుకోవచ్చు. ఈ విధంగా 5 ఏళ్ల బ్లాక్​ పీరియడ్​తో ఎన్నిసార్లు అయినా ఈ స్కీమ్​ను పొడిగించుకోవడానికి వీలుంటుంది.

ఉదాహరణకు, మీరు 15 ఏళ్లలో మొత్తం రూ.22,50,000 మదుపు చేశారని అనుకుందాం. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం, మీకు దాదాపు రూ.40,68,209 అందుతుంది. మీరు ఈ డబ్బులు తీసుకోకుండా, మరో 5 ఏళ్లపాటు ఆ స్కీమ్​లోనే కొనసాగారని అనుకుందాం. అప్పుడు మీరు చేసిన పొదుపు మొత్తం రూ.30 లక్షలు అవుతుంది. మీకు వచ్చే రిటర్న్​ రూ.66,,58,288 వరకు ఉంటుంది. అంటే ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ పని చేసింది. ఈ విధంగా మీరు చిన్న మొత్తాల్లో పొదుపు చేసి, భారీ స్థాయిలో రాబడులను సంపాదించవచ్చు.

ఈ స్కీమ్​లో చేరేందుకు అర్హతలు
భారతీయ పౌరులు అందరూ ఈ స్కీమ్​లో చేరవచ్చు. దీని కాలవ్యవధి 15 సంవత్సరాలు. దీని తరువాత మీరు కావాలనుకుంటే డబ్బులు విత్​డ్రా చేసుకోవచ్చు. లేదా 5 ఏళ్ల బ్లాక్ పీరియడ్​ చొప్పున ఎన్నిసార్లు అయినా దానిని పొడిగించుకోవచ్చు. అయితే భారతదేశంలో నివసిస్తున్న వారు మాత్రమే పీపీఎఫ్ పొడిగింపునకు అర్హులు. ఇతర దేశాల పౌరసత్వం పొందిన వ్యక్తులు పీపీఎఫ్ ఖాతాలను తెరవడానికి లేదా పొడిగించుకోవడానికి వీలుపడదు.

  • మీరు కనుక పీపీఎఫ్ ఖాతాను మరో 5 ఏళ్లపాటు పొడిగించాలని అనుకుంటే, ఖాతా మెచ్యూరిటీ తేదీ కంటే ముందే, సంబంధిత పోస్ట్​ ఆఫీస్​కు​ లేదా బ్యాంకుకు దరఖాస్తు సమర్పించాలి.
  • ఒకసారి ఈ పీపీఎఫ్ ఖాతా తెరచిన తరువాత ఏడాదికి కనీసం రూ.500 అయినా డిపాజిట్ చేయాలి. లేకుంటే పోస్టు ఆఫీసులు లేదా బ్యాంకులు సదరు ఖాతాను క్లోజ్​ చేస్తాయి.
  • ఇలా క్లోజ్ అయిన పీపీఎఫ్ ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయాలంటే, సంవత్సరానికి రూ.50 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

మీ లైఫ్​ స్టైల్​కు - ఏ క్రెడిట్ కార్డు మంచిదో తెలుసా?

ఏఐతో షాపింగ్ మరింత ఈజీ- కొత్త టూల్​ను లాంఛ్​ చేసిన అమెజాన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.