ETV Bharat / business

హై-వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? అయితే ఐటీ నోటీసులు రావడం గ్యారెంటీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 12:49 PM IST

Income Tax High Value Transactions Limit : మీరు పరిమితికి మించి హై-వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? అయితే ఐటీ నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. మీ ఆదాయం కంటే అధిక మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసినా; మ్యూచువల్ ఫండ్స్​, ఈక్విటీస్, బాండ్స్ లాంటి కొన్నా; అతిగా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లిస్తున్నా; భారీగా ఆస్తులు కొనుగోలు చేసినా ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది.

income tax high value transactions rules
income tax high value transactions limit

Income Tax High Value Transactions Limit : ఆదాయ పన్ను శాఖ మన దేశ ఆర్థిక వ్యవస్థ సమగ్రతను కాపాడడానికి, అక్రమ లావాదేవీలను అడ్డుకోవడానికి కృషి చేస్తూ ఉంటుంది. అక్రమ పద్ధతుల్లో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తిస్తే, ఐటీ నోటీసులు జారీ చేసి తగు చర్యలు తీసుకుంటుంది.

క్యాష్​లెస్​ ట్రాన్సాక్షన్స్​ చేస్తే ఆదాయ పన్ను శాఖ నుంచి ఎలాంటి సమస్యలు రావని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. మీరు ఒక పరిమితికి మించి యూపీఐ ట్రాన్సాక్షన్స్, కార్డ్ పేమెంట్స్​, క్యాష్ డిపాజిట్స్​, విత్​డ్రాలు చేస్తే ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఉంది.

సులువుగా కనిపెట్టేస్తారు!
ఆదాయ పన్ను శాఖ అధునాతన డేటా అనలిటిక్స్ టూల్స్​ను వాడుతూ ఉంటుంది. అధికారులు ఈ టూల్స్​ ద్వారా ఒక వ్యక్తికి వస్తున్న ఆదాయం, అతను చేస్తున్న ఖర్చులు గురించి సులువుగా తెలుసుకోగలుగుతారు. అవసరమైతే సదరు వ్యక్తుల బ్యాంక్​ స్టేట్​మెంట్లు, ఆస్తులు, పెట్టుబడుల వివరాలు సేకరిస్తారు. చివరికి మీరు ఎక్కడెక్కడికి ప్రయాణిస్తున్నారో కూడా సులువుగా తెలుసుకుంటారు. ఈ సమాచారాన్ని అంతా నిశితంగా పరిశీలించి, మీరు ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారా? లేదా? అనేది నిర్ధరణ చేసుకుంటారు. ఇంకా అవసరమైతే మీరు పని చేస్తున్న సంస్థ నుంచి, ట్రావెల్ ఏజెన్సీలు, స్టాక్​ ఎక్స్ఛేంజీల నుంచి కూడా మీ ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని సేకరిస్తారు.

స్క్రూటినీ
ఐటీ శాఖ పన్ను ఎగవేతకు సంబంధించిన కేసుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా స్క్రూటినీ అసెస్​మెంట్​ను ప్రారంభిస్తుంది. తరువాత నోటీసులు జారీ చేస్తుంది. అంతేకాదు సాక్ష్యాలు సేకరించడానికి, పన్నులను రికవరీ చేయడానికి, నేరుగా విచారణ చేయడానికి కూడా ఐటీ డిపార్ట్​మెంట్​కు అధికారం ఉంటుంది. మీరు కనుక ఆర్థిక లావాదేవీలను పరిమితికి మించి నగదు రూపంలో చేసినా, ఆన్​లైన్​లో చేసినా ఐటీ శాఖ నోటీసులు పంపి, తగు చర్యలు తీసుకుంటుంది. సరే, ఇప్పుడు మనం ఎంత పరిమితి మేరకు మాత్రమే ఆర్థిక లావాదేవీలు చేయాలో తెలుసుకుందాం.

1. సేవింగ్స్ అకౌంట్​ డిపాజిట్స్​ :
ఒక ఆర్థిక సంవత్సరంలో మీ పొదుపు ఖాతాలో రూ.10 లక్షలకు మించి డిపాజిట్​ చేస్తే, ఐటీ శాఖ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఒక ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమై మార్చి 31తో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో మీరు చేసిన డిపాజిట్ మొత్తం రూ.10 లక్షలు దాటితే, ఆ విషయాన్ని బ్యాంకులు కచ్చితంగా ఐటీ శాఖకు తెలియజేస్తాయి. ఎందుకంటే నిబంధనల ప్రకారం, బ్యాంకులు పరిమితికి మించి చేసిన ఆర్థిక లావాదేవీల వివరాలను 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్​ డైరెక్ట్ ట్యాక్సెస్'​ (CBDT)కు నివేదించాల్సి ఉంటుంది.

మీరు ఒక అకౌంట్​లో​ కాకుండా, బహుళ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేసినప్పటికీ, వాటి మొత్తం విలువ రూ.10 లక్షలు దాటకూడదు. దాటితే ఆ విషయం ఆదాయ పన్ను శాఖ వారికి తెలిసిపోతుంది. వారు మీకు నోటీసులు కూడా పంపడం జరుగుతుంది.

భయపడాల్సిన పనిలేదు
మీరు రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేసుకున్నంత మాత్రాన భయపడాల్సిన పనిలేదు. మీరు న్యాయబద్ధంగా డబ్బులు సంపాదిస్తూ ఉంటే, మీకు అంత ఆదాయం ఎలా వచ్చిందో ఐటీ శాఖకు తెలియజేస్తే సరిపోతుంది.

ఒకవేళ మీరు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే లేదా పన్ను రిటర్నులలో ఏమైనా వ్యత్యాసాలు ఉంటే, ఐటీ శాఖ మీపై తదుపరి చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే జరిమానాలు కూడా విధిస్తుంది.

వ్యక్తిగత ఆదాయాన్ని, వ్యాపారం ద్వారా వచ్చిన లాభాలను ఒకే అకౌంట్​లో వేయకూడదు. మీకు ఏయే మార్గాల ద్వారా ఆదాయం వస్తోంది అనే వివరాలు సహా, మీ పెట్టుబడులు, ఖర్చులు, ఇతర ముఖ్యమైన లావాదేవీలు అన్నింటి గురించి సరైన రికార్డ్​ను మెయింటైన్ చేయాలి. సక్రమంగా పన్ను రిటర్నులు దాఖలు చేయాలి. అప్పుడే మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

2. ఫిక్స్‌డ్ డిపాజిట్లు!
చాలా మంది నష్టభయం లేని, స్థిరమైన ఆదాయం కోసం ఫిక్స్​డ్​ డిపాజిట్లు చేస్తూ ఉంటారు. ఇందుకోసం వివిధ బ్యాంకుల్లో వివిధ ఎఫ్​డీ అకౌంట్లు ఓపెన్ చేస్తుంటారు. అయితే వీటన్నింటిలో పొదుపు చేసిన డబ్బులు రూ.10 లక్షలకు మించకూడదు. క్యాష్ డిపాజిట్ల విషయంలోనూ ఇదే నిబంధనలు వర్తిస్తాయి. ఒకవేళ ఈ పరిమితిని మించితే ఐటీ శాఖ నోటీసులకు సమాధానం చెప్పాల్సి వస్తుంది.

3. స్టాక్​ మార్కెట్ ఇన్వెస్ట్​మెంట్​!
చాలా మంది షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు​, డిబెంచర్లు కొనుగోలు చేస్తుంటారు. ఈ పెట్టుబడులు రూ.10 లక్షల పరిమితి (థ్రెషోల్డ్​)ని దాటితే ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేస్తుంది. కానీ మీరు న్యాయబద్ధమైన మార్గాల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, మీకు ఏమీ కాదు.

4. క్రెడిట్​ కార్డ్ బిల్స్ చెల్లించడం
నేడు చాలా మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే నెలవారీగా ఒక లక్ష రూపాయలకు మించి క్రెడిట్ కార్డు బిల్లులు కడుతూ ఉంటే, ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది. అప్పుడు మీ ఆదాయ మార్గాల గురించి కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. మీరు సంపాదిస్తున్న దానికి, మీరు చేస్తున్న ఖర్చులకు పొంతన లేకపోయినా, ఆదాయ పన్ను శాఖ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది.

5. ఆస్తులకు సంబంధించిన నగదు చెల్లింపులు
మన భారతదేశంలో రూ.30 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు, మీకు అంత ఆదాయం ఎలా వచ్చిందో ఆదాయ పన్ను శాఖవారికి తెలియజేయాల్సి ఉంటుంది. పన్ను ఎగవేతలను నిరోధించడానికి, అక్రమ నగదు చలామణిని అరికట్టడానికి ఇది తప్పనిసరి.

మన దేశంలో పట్టణ ప్రాంతాల్లో రూ.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు, ఆదాయ పన్ను శాఖ వారికి సదరు వివరాలు తెలపాలి. తమకు అంత ధనం ఎలా వచ్చిందో వివరించాలి. అయితే ఈ మనీ థ్రెషోల్డ్ అనేది ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. కనుక మీ ప్రాంతంలో ఈ ట్రాన్సాక్షన్స్​ థ్రెషోల్డ్ ఎంత ఉందో ముందుగానే తెలుసుకోండి.

మీ రాబడి వివరాలు తెలపాలి!
ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు, రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు 26క్యూబీని సమర్పించాలి. దీని వల్ల మీకు సదరు నిధులు ఎలా వచ్చాయో ఆదాయ పన్ను శాఖ వారికి తెలుస్తుంది.

ఆస్తి కొనుగోలు విలువ నిర్దేశిత థ్రెషోల్డ్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ, మీ ఆదాయ, వ్యయాల మధ్య అంతరం ఉంటే, ఐటీ శాఖ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది. ఒక వేళ మీరు మీ రాబడి గురించి, మీ ఆదాయ వనరుల గురించి సరైన కారణాలు చెప్పలేకపోతే జరిమానాలు విధించవచ్చు. పన్ను మదింపులు చేయవచ్చు. చివరికి మీపై ఐటీ శాఖ ఇన్వెస్టిగేషన్ చేసి తగు చర్యలు కూడా తీసుకోవచ్చు. అందువల్ల మీ ఆదాయానికి, వ్యయాలకు సంబంధించిన రికార్డులను సరిగ్గా నిర్వహించడం (మెయింటైన్) చేయడం చాలా మంచిది. మీకు ఈ విషయంపై ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే​ ఆర్థిక నిపుణుల (సర్టిఫైడ్​ ఫైనాన్సియల్ ఎక్స్​పర్ట్స్​) నుంచి సలహాలు తీసుకోవడం మంచిది.

అన్నదాతలకు గుడ్​న్యూస్ - రేపే 'పీఎం కిసాన్‌ నిధులు' రిలీజ్​ - ఎలా చెక్​ చేసుకోవాలంటే?

ఉద్యోగుల కోసం అదిరిపోయే స్కీమ్ - ఎఫ్​డీ కంటే అధిక వడ్డీ + ట్యాక్స్ బెనిఫిట్స్​ కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.