అన్నదాతలకు గుడ్​న్యూస్ - ఫిబ్రవరి 28న 'పీఎం కిసాన్‌ నిధులు' రిలీజ్​ - ఎలా చెక్​ చేసుకోవాలంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 12:00 PM IST

Updated : Feb 27, 2024, 12:19 PM IST

pm kisan samman nidhi status

PM Kisan 16th Instalment 2024 : పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌. 16వ విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తేదీ ఖరారు చేసింది. ఎప్పుడు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయంటే?

PM Kisan 16th Instalment 2024 : రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం "ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి" పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.6,000 రైతులకు అందజేస్తోంది. ఈ నగదు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. అయితే ఈ సొమ్ము ఒకేసారి కాకుండా మొత్తం 3 దఫాలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అంటే ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి (ఏప్రిల్-జులై, ఆగస్ట్​-నవంబర్, డిసెంబంర్- మార్చి) ఈ నిధులు రైతుల అకౌంట్​లో జమ అవుతాయి.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 15 విడతలుగా పీఎం కిసాన్​ నిధులు విడుదల చేసింది. పీఎం కిసాన్​ 16వ విడత నిధులను ఫిబ్రవరి 28న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్‌ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. అలాగే, ఈ-కేవైసీ చేసి ఉండాలి. అర్హులైన రైతుల ఖాతాల్లో డీబీటీ (డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్​ఫర్) పద్ధతిలో పెట్టుబడి సాయం జమ అవుతుంది.

బెనిషియరీ స్టేటస్ ఇలా చెక్​ చేసుకోండి
PM Kisan Beneficiary Status :

 • పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్, ఇన్​స్టాల్​మెంట్ స్టేటస్​ చెక్​ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్​ను ఓపెన్ చేయాలి.
 • తర్వాత Know Your Status అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి
 • అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్​ను నమోదు చేసి, క్యాప్చా కోడ్​ను ఫిల్ చేయాలి.
 • ఆ తర్వాత Get Data అనే ఆప్షన్​పై క్లిక్ చేస్తే స్క్రీన్​పై మీ బెనిషియరీ స్టేటస్​ కనిపిస్తుంది.

లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో? లేదో? ఇలా చెక్​ చేసుకోవాలి?

 • ముందుగా మీరు www.pmkisan.gov.in వెబ్​సైట్​ ఓపెన్ చేయాలి.
 • వెబ్​సైట్​లోని "Beneficiary List" ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
 • మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను ఎంచుకోవాలి.
 • లబ్ధిదారుల జాబితా కోసం ''Get Report" క్లిక్ చేయాలి. అంతే సింపుల్​!
 • మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు అక్కడ కనిపిస్తాయి. వాటిలో మీ పేరు ఉందో? లేదో? చూసుకోవాలి.

గమనిక​ : మీకు ఏదైనా సందేహం ఉన్నా? లేక సాయం కావాలన్నా 155261 లేదా 011-24300606 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం దరఖాస్తు చేయడం ఎలా?
How To Apply For PM Kisan Scheme : మీరు కనుక అర్హులైన రైతులైతే 'పీఎం కిసాన్​ సమ్మాన్ నిధి' కోసం అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

 • ముందుగా మీరు pmkisan.gov.in వెబ్​సైట్​ ఓపెన్ చేయండి.
 • New Farmer Registration లింక్​పై క్లిక్ చేసి, మీ ఆధార్ నంబర్‌ నమోదు చేయండి.
 • తరువాత క్యాప్చాను ఎంటర్​ చేయండి.
 • అవసరమైన వివరాలను నమోదు చేసి 'Yes'పై క్లిక్ చేయండి.
 • PM కిసాన్ దరఖాస్తు ఫారమ్-2023ని నింపిన తర్వాత Save బటన్​పై క్లిక్​ చేయండి.
 • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్ తీసుకుని భద్రపరుచుకోండి.

రైతులకు శుభవార్త! ఈ స్కీమ్​లో చేరితే నెలకు 3వేల పింఛన్!

కార్​/ బైక్​ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? Add-onలతో అదనపు రక్షణ పొందండిలా!

Last Updated :Feb 27, 2024, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.