ETV Bharat / business

మొదటిసారి కారు కొంటున్నారా? ఈ టాప్​-10 సేఫ్టీ ఫీచర్స్​ మస్ట్​! - Top 10 Car Safety Features

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 3:44 PM IST

10 Important Car Safety Features : మీరు కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. మీరు కొత్త కారు కొన్నా లేదా పాత కారు కొనాలని అనుకున్నా, కచ్చితంగా ఈ ఆర్టికల్​లో చెప్పిన టాప్​-10 సేఫ్టీ ఫీచర్లు ఉండేలా చూసుకోవాలి.

top 10 Car Safety Features
10 Important Car Safety Features

10 Important Car Safety Features : దేశంలో నేడు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. రోడ్డు యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అవుతున్నాయి. అందుకే కారు కొనేటప్పుడు సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీరు, మీ కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉంటారు. సాధారణంగా కొత్త కారుల్లో లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. పాత కార్ల విషయంలో సేఫ్టీ ఫీచర్లు ఉండొచ్చు, ఉండకపోనూవచ్చు. అయితే పాత కార్లు కొనేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ ఆర్టికల్​లో కారులో కచ్చితంగా ఉండాల్సిన టాప్​-10 సేఫ్టీ ఫీచర్లు గురించి తెలుసుకుందాం.

  1. ABS : సడెన్​గా బ్రేక్స్ వేసినప్పుడు చక్రాలు లాక్ అవ్వకుండా 'యాంటీ-లాక్​ బ్రేకింగ్ సిస్టమ్​' (ఏబీఎస్​) నిరోధిస్తుంది. దీని వల్ల డ్రైవర్​ స్టీరింగ్​ను ఈజీగా​ కంట్రోల్​ చేయడానికి వీలవుతుంది. బండి స్కిడ్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది.
  2. ESC : ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్​సీ) అనేది వాహనం స్థిరంగా ఉండేటట్లు చేస్తుంది. లాస్​ ఆఫ్​ ట్రాక్షన్​ను గుర్తించి,​ తగ్గిస్తుంది. మలుపులు తిరిగేటప్పుడు, బాగా జారుడుగా ఉన్న రోడ్లపై వెళ్లేటప్పుడు ఈఎస్​సీ బండికి ఎలాంటి ప్రమాదం ఏర్పడకుండా కాపాడుతుంది.
  3. ఎయిర్​బ్యాగ్స్​ : కారుకు అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు ఫ్రంట్ ఎయిర్​బ్యాగ్స్​ డ్రైవర్​​ ముఖానికి గాయాలు కాకుండా కాపాడుతాయి. కొన్ని ప్రీమియం కార్లలో 6 ఎయిర్​ బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఇవి కారులోపల ఉన్న ప్రయాణికులకు కూడా రక్షణనిస్తాయి.
  4. సీట్​ బెల్ట్​ : మీరు కొనే కారులో కచ్చితంగా ప్రిటెన్షనర్స్​తో ఉన్న సీట్​ బెల్ట్స్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే, కారు ప్రమాదానికి గురైనప్పుడు ఈ ప్రీటెన్షనర్స్​ ఉన్న సీట్​ బెల్ట్​లు ఆటోమేటిక్​గా బిగుతుగా మారతాయి. కనుక ప్రయాణికులు కారు ముందు భాగాన్ని గుద్దుకునే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
  5. TCS : జారుడు ఉపరితలంపై యాక్సిలిరేషన్ చేసేటప్పుడు వీల్ స్పిన్​ కాకుండా 'ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్​' (టీసీఎస్​) కాపాడుతుంది. అలాగే ఇది కారు ట్రాక్షన్​ను, కంట్రోల్​ను మెరుగుపరుస్తుంది.
  6. EBD : ఎలక్ట్రానిక్​ బ్రేక్​-ఫోర్స్​ డిస్ట్రిబ్యూషన్​ (ఈబీడీ) అనేది ఇండివిడ్యువల్​ వీల్స్ మధ్య బ్రేకింగ్ ఫోర్స్​ను పంపిణీ చేస్తుంది. దీని వల్ల కార్ బ్రేకింగ్ సిస్టమ్ అద్భుతంగా పనిచేసి, బండి స్థిరంగా ఉండేలా చేస్తుంది.
  7. TPMS : కారు టైర్లలో సరిపోయినంత ప్రెజర్ లేనప్పుడు, ఈ టైర్​ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్​)​ వెంటనే డ్రైవర్​ను హెచ్చరిస్తుంది. దీని వల్ల టైర్లు పేలిపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఫలితంగా వాహనం కూడా భద్రంగా ఉంటుంది.
  8. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్​/ కెమెరా : కాస్త ఇరుకైన ప్రదేశాల్లో కారు పార్కింగ్ చేసేటప్పుడు రివర్స్ పార్కింగ్ కెమెరాలు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పాదచారులను లేదా అడ్డంకులను కారు ఢీకొనే ప్రమాదం బాగా తగ్గుతుంది.
  9. AEB : ఈ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ముందుగానే వాహనం ఢీకొనే ప్రమాదాన్ని గుర్తించి, ఆటోమేటిక్​గా బ్రేక్​లు వేస్తుంది. ఫలితంగా భారీ ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి.
  10. LDW : మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు అనుకోకుండా లేన్ నుంచి బయటకు వెళితే, ఈ లేన్ డిపార్చర్​ వార్నింగ్ సిస్టమ్​ (ఎల్​డీడబ్ల్యూ) డ్రైవర్​ను అలర్ట్ చేస్తుంది. కనుక వాహన ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి.

సరికొత్త​ ఫీచర్స్​తో బజాజ్ పల్సర్​​ ఎన్​250 లాంఛ్​ - ధర ఎంతంటే? - Bajaj Pulsar N250 Launch

మారుతి, టాటా కార్లపై భారీ ఆఫర్స్​ - ఆ మోడల్​పై ఏకంగా రూ.1.50 లక్షలు డిస్కౌంట్​! - Car Discounts In April 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.