ETV Bharat / business

సరికొత్త​ ఫీచర్స్​తో బజాజ్ పల్సర్​​ ఎన్​250 లాంఛ్​ - ధర ఎంతంటే? - Bajaj Pulsar N250 Launch

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 12:52 PM IST

Bajaj Pulsar N250 Launch : బైక్ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్​. బజాజ్ కంపెనీ 2024 మోడల్​ పల్సర్​ ఎన్​250 బైక్​ను బుధవారం ఇండియాలో లాంఛ్ చేసింది. దీనిలో ఎన్నో సరికొత్త ఫీచర్లను కూడా పొందుపరిచింది. మరెందుకు ఆలస్యం దీని ఫీచర్స్​, స్పెక్స్​, మైలేజ్​, ధర వివరాలపై ఓ లుక్కేద్దాం రండి.

Bajaj Pulsar N250 features
Bajaj Pulsar N250 Launch

Bajaj Pulsar N250 Launch : దేశీయ బైక్ తయారీ కంపెనీ బజాజ్ బుధవారం ఇండియాలో 2024 మోడల్​ పల్సర్​ ఎన్​250 బైక్​ను లాంఛ్​ చేసింది. దీనితో అనేక సరికొత్త ఫీచర్లను పొందుపరిచింది.

రూ.851 మాత్రమే!
2024 Bajaj Pulsar N250 Price : బజాజ్ కంపెనీ ఈ నయా పల్సర్​ ఎన్​250 ధరను రూ.1,50,829 (ఎక్స్​-షోరూం-దిల్లీ)గా నిర్ణయించింది. ఈ ధర ప్రీవియస్​-జనరేషన్​ బైక్ కంటే కేవలం రూ.851 మాత్రమే ఎక్కువ కావడం విశేషం.

2024 Bajaj Pulsar N250 Features :

  • బజాజ్ కంపెనీ ఈ 2024 మోడల్ బజాబ్​ పల్సర్ ఎన్​250 బైక్​ను కొత్త కలర్ ఆప్షన్లతో; ఇన్​వర్టెడ్​ ఫోర్క్​, న్యూ డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్​తో​ సహా పలు సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చింది.
  • ఈ నయా బజాజ్​ బైక్​కు 37mm ఇన్​వర్టెడ్ ఫోర్క్​ను జోడించారు. దీని వల్ల బైక్​ను మరింత సులువుగా హ్యాండిల్ చేయడానికి వీలవుతుంది. బజాజ్ కంపెనీ ఇది వరకే 2023 మోడల్​ పల్సర్ ఎన్​ఎస్​200, పల్సర్​ ఎన్​ఎస్​160 బైక్స్​ల్లో ఈ అప్​డేట్​ను తీసుకువచ్చింది.
  • బజాజ్ కంపెనీ పల్సర్ ఎన్​ఎస్​200లో ఉన్న డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్​ను, ఇప్పుడు పల్సర్ ఎన్​250లోనూ పొందుపరిచింది. ఈ ఎల్​సీడీ యూనిట్​ - బైక్ స్పీడ్​, టాకోమీటర్ రీడింగ్స్​, ఫ్యూయెల్ లెవెల్, మైలేజ్, ట్రిప్​ మీటర్​, ఓడోమీటర్​ రీడింగ్​లు సహా, డీటీఈ లాంటి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్​ను కూడా చూపిస్తుంది.
  • కాల్​ ఫెసిలిటీ : ఈ న్యూ-జనరేషన్ పల్సర్ ఎన్​250 బైక్​కు స్మార్ట్​ఫోన్​ను కనెక్ట్ చేసుకుని కాల్స్​, ఎస్​ఎంఎస్​ అలర్ట్స్ పొందవచ్చు. అంతేకాదు కాల్స్​ యాక్సెప్ట్​/ రిజెక్ట్ చేసుకోవచ్చు. టర్న్​-బై-టర్న్ నావిగేషన్ కూడా చేసుకోవచ్చు. 250సీసీ బైక్ సెగ్మెంట్​లో ఇంత మంచి ఫీచర్లు ఉన్న బైక్ ఇదే కావడం గమనార్హం.
  • ఎడమ వైపు ఉన్న స్విచ్​ గేర్​ను కూడా అప్​డేట్ చేసి, కొత్త బటన్​ను పొందుపరిచారు. దీని ద్వారా రైడర్ కన్సోల్​ను నావిగేట్ చేసుకోవచ్చు.
  • అయితే దీనిలో ప్రీవియస్ జనరేషన్​ బైక్​ల్లో ఉన్న ట్యాంక్ మౌంటెడ్​ యూఎస్​బీ ఛార్జింగ్ పోర్ట్​ను కూడా అలాగే కనసాగించారు.
  • ఈ నయా బజాజ్ పల్సర్​ ఎన్​250 బైక్​లో మొదటిసారిగా ట్రాక్షన్​ కంట్రోల్​ సిస్టమ్, 3 ఏబీఎస్​ (ABS) మోడ్​లను​ పొందుపరిచారు. రోడ్, రెయిన్​, ఆన్​/ఆఫ్​ రోడ్​ మోడ్స్ ఇందులో ఉన్నాయి. ఏబీఎస్​ మోడ్​లు ఏబీఎస్ ఇంటర్వెన్షన్ స్థాయిని మాడ్యులేట్ చేస్తాయి. ఇవి బైక్​ రైడర్లకు డ్రైవింగ్ చేసేటప్పుడు మంచి కంఫర్ట్​ను అందిస్తాయి.
  • బజాజ్ కంపెనీ ఈ నయా​ పల్సర్ ఎన్​250లోని టైర్స్​ను కూడా మార్చింది. ఇంతకు ముందున్న 100-ఫ్రంట్​, 130-సెక్షన్​ రియర్ టైర్స్​ స్థానంలో కొత్త 110-ఫ్రంట్​, 140-రియర్​ టైర్లను అమర్చింది. సీట్ హైట్​ను కూడా 800mmకు పెంచింది. బ్రేక్స్ విషయానికి వస్తే ముందు భాగంలో 300mm, వెనుక భాగంలో 230mm రియర్ డిస్క్ బ్రేక్​లను పొందుపరిచింది. ఈ బైక్​ ప్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు. గ్రౌండ్ క్లియరెన్స్​ 165mm.
  • డిజైన్ విషయానికి వస్తే, ఈ నయా బైక్​లో పెద్దగా మార్పులు ఏమీ చేయలేదు. కానీ కొత్తగా ఎరుపు, తెలుగు, నలుపు రంగుల్లో కూడా బైక్​ను అందుబాటులోకి తెచ్చారు.

Bajaj Pulsar N250 Engine​ : ఈ కొత్త బజాజ్​ పల్సర్​ ఎన్​250 బైక్​లో కూడా 249.07సీసీ ఎయిర్/ఆయిల్​-కూల్డ్ సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​నే కొనసాగించారు. ఇది 24.5పీఎస్​ పవర్​, 21.5 ఎన్​ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్ బాక్స్​, స్లిప్పర్ క్లచ్ అనుసంధానంతో పనిచేస్తుంది.

Bajaj Pulsar N250 Rivals : మార్కెట్లో ఈ బజాజ్ పల్సర్ ఎన్250 బైక్​కు సుజుకి గిక్సర్​ 250, కేటీఎం 250 డ్యూక్​, టీవీఎస్ అపాచీ ఆర్​టీఆర్​ 4వీ, బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​200లు గట్టి పోటీగా నిలువనున్నాయి. అన్నింటి కంటే బెస్ట్ విషయం ఏమిటంటే, ఈ అప్​డేటెడ్ పల్సర్ ఎన్​250 బైక్ ధర, దాని మునుపటి తరం బైక్ కంటే కేవలం రూ.851 మాత్రమే ఎక్కువ. కనుక కొత్తగా పల్సర్ బైక్​ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

Bajaj Upcoming Bikes : బజాజ్ కంపెనీ త్వరలో పల్సర్​ ఎఫ్​250ను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. బజాజ్​ పల్సర్ ఎన్ఎస్​400 బైక్​ను ఈ 2024 మే 3న విడుదల చేయనుంది.

మారుతి, టాటా కార్లపై భారీ ఆఫర్స్​ - ఆ మోడల్​పై ఏకంగా రూ.1.50 లక్షలు డిస్కౌంట్​! - Car Discounts In April 2024

ఏథర్‌ నుంచి ఫ్యామిలీ స్కూటర్‌ - సింగిల్‌ ఛార్జ్‌తో 160 కి.మీ రేంజ్​ - ధర ఎంతంటే? - Ather Rizta Electric Scooter Launch

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.