ETV Bharat / bharat

టార్గెట్​ 80- యూపీపైనే బీజేపీ మెయిన్​ ఫోకస్​- యోగి కేబినెట్​లో కీలక మార్పులు అందుకేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 7:30 PM IST

Etv Bharat
Etv Bharat

UP Cabinet Expansion : త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో లోక్​సభ స్థానాల క్లీన్​స్వీప్​ లక్ష్యంగా ప్లాన్​ చేస్తోంది బీజేపీ. ఇందుకోసమే ఎన్నికలకు కొద్ది రోజుల ముందే మంత్రివర్గాన్ని పునర్​ వ్యవస్థీకరించింది. ఇటీవలె ఎన్​డీఏలో చేరిన ఆర్ఎల్​డీ, ఎస్​బీఎస్​పీకి చెందిన నేతలను మంత్రివర్గంలోకి తీసుకుంది.

UP Cabinet Expansion : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 370 సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ, అందుకోసం పక్కాగా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, అత్యధిక లోక్​సభ స్థానాలు కలిగిన ఉత్తర్​ప్రదేశ్​పై ప్రత్యేక దృష్టి​ పెట్టింది. అక్కడ ఉన్న 80 స్థానాలను క్లీన్​ స్వీప్​ చేయాలనే లక్ష్యంగా పావులు కదుపుతోంది. టార్గెట్​ 80 లక్ష్యంగానే రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్​ వ్యవస్థీకరించినట్లు కనిపిస్తోంది. అంతకుముందు దూరం పెట్టిన నేతలను సైతం అక్కున చేర్చుకుని కేబినెట్​లోకి తీసుకుంది. రాష్ట్రంలో కీలక పార్టీ అయిన అర్​ఎల్​డీతో ఇటీవలె పొత్తు పెట్టుకున్న బీజేపీ, అంతకుముందు కేబినెట్​ను నుంచి తొలగించిన ఎస్​బీఎస్​పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్​ రాజ్​భర్​ను సైతం తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుంది.

బీజేపీకి చెందిన ఇద్దరు నేతలతో పాటు ఆర్​ఎల్​డీ, ఎస్​బీఎస్​పీకి చెందిన చెరొకరిని మంత్రివర్గంలోకి తీసుకుంది. ఓం ప్రకాశ్​ రాజ్​భర్​తో పాటు ఆర్​ఎల్​డీకి చెందిన అనిల్​ కుమార్​, బీజేపీకి చెందిన దారా సింగ్ చౌహాన్​, సునీల్​ కుమార్​ మిశ్రా ఉన్నారు. గవర్నర్​ ఆనందీబెన్​ పటేల్ మంగళవారం లఖ్​నవూలో​ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్​భవన్​లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ హాజరయ్యారు.

"మా పార్టీ అధ్యక్షుడు జయంత్​ చౌధరీ, సీఎం యోగి ఆదిత్యనాథ్​, ప్రధాని మోదీకి ధన్యవాదాలు. నాకు అప్పగించిన ఈ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తాను. రాష్ట్రంలో 80 లోక్​సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం. ప్రధాని మోదీ పెట్టిన 400 సీట్ల లక్ష్యాన్ని నెరవేరుస్తాం."

--అనిల్​ కుమార్, మంత్రి

"పట్టుదలతో పనిచేసి రాష్ట్రంలో 80 సీట్లు గెలుచుకుంటాం. దేశవ్యాప్తంగా 400కు పైగా సీట్లు గెలిచి మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అవుతారు."

--దారా సింగ్​, మంత్రి

ఆ వర్గాల ఓటర్లే టార్గెట్​
సామాజిక సమీకరణాలను సైతం దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గాన్ని పునర్​ వ్యవస్థీకరించింది బీజేపీ. ఓం ప్రకాశ్ రాజ్​భర్​​, దారా సింగ్ చౌహాన్​ ఓబీసి వర్గానికి చెందిన వారు కాగా, అనిల్​ కుమార్​ ఎస్​సీ, సునీల్​ కుమార్​ శర్మ బ్రహ్మణ వర్గానికి చెందినవారు. వీరిని మంత్రివర్గంలోకి తీసుకున్న బీజేపీ ఆయా వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవచ్చని ఆశిస్తోంది.

ఆ పార్టీల చేరికతో ఎన్​డీఏకు మరింత బలం
జయంత్​ చౌధరీ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్​దళ్​ (ఆర్​ఎల్​డీ) ఇటీవలె ఎన్​డీఏలో చేరింది. చౌధరీ పార్టీ ప్రధాన ఓటు బ్యాంకు జాట్ వర్గమే. ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్‌నగర్, కైరానా, బిజ్నౌర్, మథుర, బాగ్‌పత్, అమ్రోహా, మేరఠ్‌లో ఈ వర్గం ప్రాబల్యం ఎక్కువ. ఆర్​ఎల్​డీ పార్టీ చేరికతో ఈ వర్గం ఓట్లు సైతం ఎన్​డీఏకు మళ్లే అవకాశం ఉంది. ఇటీవలె మాజీ ప్రధాని చౌధరీ చరణ్ సింగ్‌కు భారత రత్న ప్రకటించి ఆయన అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఓం ప్రకాశ్​ రాజ్​భర్​ నేతృత్వంలోని సుహెల్​దేవ్​ భారతీయ సమాజ్​ పార్టీ గతేడాది జులైలో ఎన్​డీఏలో చేరింది. ప్రస్తుతం ఈ పార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిద్దరి చేరికతో ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్​డీఏకు మరింత బలం చేకూరినట్లైంది.

195మందితో తొలి జాబితా
ఇటీవలె 195 మందితో కూడిన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది బీజేపీ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి బరిలోకి దిగనున్నారు. అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, స్మృతీ ఇరానీ సహా 34 మంది కేంద్రమంత్రుల పేర్లను తొలి జాబితాలోనే ప్రకటించారు. ఇందులో ఇద్దరు మాజీ మంత్రులు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు స్థానం కల్పించారు.

'టార్గెట్ 400'- గెలుపు గుర్రాలపై బీజేపీ ఫోకస్- ఫస్ట్ లిస్ట్​లోనే మోదీ, షా పేర్లు!

బీజేపీ మిషన్​ 'జ్ఞాన్​'తో '400'కు తగ్గేదేలే! మోదీ, షాతో పాటు ఆ ఇద్దరు కూడా రంగంలోకి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.