ETV Bharat / bharat

ఇన్సూరెన్స్​లో నామినీగా చేర్చలేదని SDM హత్య- కట్టుకథతో బయటపడేందుకు భర్త యత్నం

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 9:49 AM IST

SDM Murder In Madhya Pradesh
SDM Murder In Madhya Pradesh

SDM Murder In Madhya Pradesh : ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డుల్లో నామినీగా చేర్చలేదని ఓ ప్రభుత్వ అధికారిణిని తన భర్త హత్య చేశాడు. ఆపై తన భార్యకు అనారోగ్యంగా ఉందని ఆసుప్రతి తీసుకెళ్లాడు. అక్కడ ఒక కట్టుకథను కూడా అల్లాడు. కానీ చివరికి పోలీసులకు దొరికిపోయాడు. అసలేం జరిగిందంటే?

SDM Murder In Madhya Pradesh : ఎస్​డీఎమ్​గా పనిచేస్తున్న భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. తనను ఇన్సురెన్స్, బ్యాంక్ ఖాతాల్లో నామినీగా చేర్చలేదని అంతమొందించాడు. అంతేకాకుండా ఆమె అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించడానికి ప్రయత్నించాడు. కానీ చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని డిండోరీ జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది!
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, నిషా నాపిత్(51) అనే మహిళ శాహపుర ప్రాంతంలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌గా విధులు నిర్వహిస్తోంది. ఓ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచమైన మనీశ్ శర్మని(45) 2020లో పెళ్లి చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం నిషా నాపిత్​కు ఛాతీలో నొప్పి వచ్చిందని ప్రభుత్వ ఆసుప్రతికి తీసుకెళ్లాడు మనీశ్ శర్మ. కానీ తన భార్య మార్గమధ్యలో మరణించిందని వైద్యులకు తెలిపాడు. శర్మపై వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులను అలర్ట్​ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిషా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవ పరీక్షల నిమిత్తం తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకురావడానికి 5 గంటల ముందే ఊపిరాడక నిషా మృతిచెందిందని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. దీంతో మనీశ్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశారు. తానే డబ్బుల కోసం హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు శర్మ.

శర్మ అల్లిన కట్టుకథ
అయితే వైద్యులు సమాచారం అందించిన తర్వాత పోలీసులు మనీశ్​ శర్మను విచారించారు. అప్పుడు పోలీసులకు శర్మ ఓ కట్టుకథ చెప్పాడు. ఆదివారం మనీశ్ శర్మ, నిషాను ఆసుప్రతికి తీసుకొచ్చినప్పుడు తన భార్యకు కిడ్నీలలో ఒకటి పనిచేయటం లేదని చెప్పాడు. 'నా భార్య జలుబు, దగ్గుతో బాధపడింది. ఆమె ఉపవాసం కూడా ఉంది. ఈ సమయంలో కొన్ని పండ్లు తిన్న తర్వాత ఆమెకు వాంతులు అయ్యాయి. దీంతో ముక్కు నుంచి రక్తం కారింది. ఇంతలో మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి నేను ఇంటి నుంచి బయటకు వెళ్లాను. కొద్ది సేపటి తర్వాత నేను తిరిగొచ్చేసరికి నా భార్య లేవడం లేదని పనిమనిషి చెప్పింది. అప్పుడు నేను వచ్చి నిషాను నిద్ర లేపడానికి ప్రయత్నించాను. కానీ ఆమె లేవలేదు. సీపీఆర్​ కూడా ఇచ్చాను. ఆ తర్వాత ఆసుప్రతికి తీసుకొళ్లాను. రక్తం అంటిన దుస్తులను వాషింగ్​ మెషీన్​లో ఉతికాను' అని శర్మ పోలీసులకు చెప్పాడు. అయితే పోలీసులకు శర్మ చెప్పిందేదీ నమ్మశక్యంగా అనిపించలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మళ్లీ తమదైన శైలిలో శర్మను పోలీసులు విచారించారు. చివరకు శర్మ నిజం కక్కేశాడు.

'సర్వీస్, ఇన్సూరెన్స్, బ్యాంకు రికార్డుల్లో తనను నామినీగా చేయాలని మనీశ్​ శర్మ, నిషా నాపత్​ను డిమాండ్​ చేశాడు. దీనికి నిషా ఒప్పుకోలేదు. ​దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో కోపోద్రిక్తుడైన శర్మ, ఆదివారం (జనవరి 28) నిషాను తలదిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. మృతదేహం వద్దే దాదాపు 6 గంటల దాగా కూర్చున్నాడు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులను అలెర్ట్ చేశారు' అని ఎస్పీ అఖిల్ పటేల్​ వివరాలు వెల్లడించారు.

రూ.500 కోసం గొడవ- ఫ్రెండ్​ కన్ను పీకేసి గొంతు కోసి హత్య

ప్రేమ పెళ్లి చేసుకుందని దారుణం- కూతురు, అల్లుడు, మనవరాలి దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.