ETV Bharat / bharat

'లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లైనా రావు- ప్రతిపక్ష హోదా కూడా గల్లంతు' - lok sabha elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 12:09 PM IST

PM Modi On Congress : ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లైనా రావని ప్రధాని మోదీ విమర్శించారు. లోక్​సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ హోదాను కోల్పోతుందని అన్నారు.

PM Narendra Modi
PM Narendra Modi (ANI)

PM Modi On Congress : 2024 లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 50 సీట్లైనా గెలవదని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత హస్తం పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోతుందని ఎద్దేవా చేశారు. 26ఏళ్ల క్రితం రాజస్థాన్​లో ఇదే రోజున(మే 11) వాజ్ పేయీ ప్రభుత్వం నిర్వహించిన పోఖ్రాన్ అణుపరీక్షలు ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠను మరింత పెంచాయని గుర్తు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించడం ద్వారా దేశ ప్రజల 500 ఏళ్ల నిరీక్షణకు బీజేపీ తెరదించిదని పేర్కొన్నారు. ఒడిశాలో తొలిసారి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఒడియా భాష, సంస్కృతిని అర్థం చేసుకున్న వ్యక్తి ఒడిశాలో ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వంలో సీఎం అవుతారని చెప్పారు. ఒడిశాలోని ఫుల్బానీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్, బీజేడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

'కాంగ్రెస్ వైఖరి ఎప్పుడూ అదే'
"లోక్​సభ ఎన్నికల్లో ఎన్​డీఏ 400 సీట్లు దాటుతుందని దేశ ప్రజల మనసులో ఉంది. జూన్ 4న ఎన్​డీఏ గెలుపును దేశప్రజలు ఇప్పుడే నిర్ణయించారన్న విషయం కాంగ్రెస్ గమనించాలి. కాంగ్రెస్ ఎప్పుడూ భారత ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తోంది. పాకిస్థాన్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయని(మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ) మనం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ ఇదే వైఖరి. హస్తం పార్టీ వైఖరి కారణంగా జమ్ముకశ్మీర్ ప్రజలు 60 ఏళ్లు ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నారు. దేశంలో అనేక ఉగ్రదాడులు జరిగాయి. హస్తం పార్టీ ఉగ్రవాదులతో సమావేశాలు జరిపిన విషయాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదు. 26/11 దాడి తర్వాత నిందితులపై దర్యాప్తు జరిపేందుకు కాంగ్రెస్ సాహసించలేదు. ఎందుకంటే తమ ఓటు బ్యాంకుపై ప్రభావం పడుతుందని హస్తం పార్టీ భయపడింది." అని ప్రధాని మోదీ విమర్శించారు. కంధమాల్​లోని ఫుల్బానీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పద్మశ్రీ అవార్డు గ్రహీత పూర్ణమాసి జానీని సత్కరించారు ప్రధాని మోదీ. అనంతరం ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.

ప్రజ్వల్​ రేవణ్ణ విషయంలో ముందే హెచ్చరించిన బీజేపీ నేత అరెస్ట్- ఆ పని చేశారని! - BJP Leader DevarajeGowda arrested

కన్నౌజ్‌పైనే అందరి ఫోకస్​- భార్య ఓటమికి అఖిలేశ్​ యాదవ్ రివెంజ్ తీర్చుకునేనా? - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.