ETV Bharat / bharat

ఫోర్బ్స్​ శక్తిమంతమైన మహిళల జాబితాలో గిరిజన జర్నలిస్ట్ - బాలికల విద్య, ఆరోగ్యంపై అవగాహన

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 2:00 PM IST

Jayanthi Buruda in Forbes India 2024
Jayanthi Buruda in Forbes India 2024

Jayanthi Buruda in Forbes India 2024 : ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఈ ఏడాది ఒడిశాకు చెందిన ఓ గిరిజన మహిళ స్థానం సంపాదించారు. జర్నలిస్ట్​గా ఉంటూ గ్రామీణ ప్రాంతంలో గిరిజన బాలికలకు విద్య, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు.

Jayanthi Buruda in Forbes India 2024 : ఫోర్బ్స్ ప్రచురించిన అత్యంత శక్తిమంతమైన మహిళలల్లో ఈ ఏడాది ఒడిశాకు చెందిన గిరిజన మహిళా జర్నలిస్ట్ స్థానం సంపాదించారు. ఈమె గిరిజన బాలికలకు విద్య, ఆరోగ్యంపై చైత్యనం కల్పిస్తున్నారు. అలాగే మహిళల రుతుక్రమ సమయంలో పరిశుభ్రత, శానిటరీ ప్యాడ్​లను ఉపయోగించేలా అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఇండియాలోనే అత్యంత శక్తిమంతమైన 23 మంది మహిళల్లో స్థానం దక్కించుకున్నారు. ఆమె మల్కన్​గిరి జిల్లాకు చెందిన జయంతి బురుడా.

Jayanthi Buruda in Forbes India 2024
బాలికల కోసం ఏర్పాటు చేసిన లైబ్రరీ

స్నేహితుల ఆర్థిక సాయంతో
గిరిజన అమ్మాయిల్లో చదువుకుని జర్నలిస్ట్​గా మారిన మొదటి మహిళ జయంతి బురుడా. జర్నలిస్ట్​గా మారి గిరిజన మహిళలకు సాయం చేయాలని జయంతి నిర్ణయించుకున్నారు ఆమె. కానీ తన తల్లిదండ్రులు అందుకు అంగీకరించకోపోవడం వల్ల ఇంటిని సైతం విడిచి పెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత స్నేహితుల ఆర్థిక సహాయంతో ఒడిశాలోని కోరాపుట్ సెంట్రల్ యూనివర్సిటీ డిగ్రీని పూర్తి చేశారు. ఆ సమయంలోనే మావోయిస్టుల కార్యకలాపాలతో పాటు గిరిజన మహిళలకు పడుతున్న కష్టాలను ఇలా పలు అంశాలను వెలుగులో తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం 2015లో ఒక టెలివిజన్ ఛానెల్​లో జిల్లా కరస్పాండెంట్​గా చేరారు.

Jayanthi Buruda in Forbes India 2024
వాలంటీర్లతో జ.య

గిరిజనుల కోసం సంస్థ ఏర్పాటు
మల్కన్​గిరి జిల్లాలోని గిరిజన బాలికల విద్య, ఆరోగ్యంపై ఇలా పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు 2018లో 'జంగిల్ రాణి బడా దీదీ' అనే సంస్థను స్థాపించారు జయంతి. 'ఆశ్రమ పాఠశాల్లో ఎక్కువ టీనేజ్​ బాలికలు గర్భం ధరించడం నేను చూశాను. ఆదివాసీ మహిళలు ఇలాంటి సమస్యల గురించి మాట్లాడలేకపోతున్నారు. అందుకే నేను వారి కష్టాలను వెలుగులోకి తీసుకురావాలి అనుకున్నా. అలాగే ఆరోగ్యం, విద్య, పరిశుభ్రత వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు ఈ సంస్థను ప్రారంభించాను' అని జయంతి తెలిపారు.

గిరిజన మహిళల న్యూస్ ప్లాట్​ఫారమ్
ఈ సంస్థలో ప్రస్తుతం 100 మంది వాలంటీర్లు ఉన్నారు. వీరంతా గిరిజన బాలికల్లో ఉన్నత విద్య, బాల్య వివాహాలు రుతుక్రమ సమయంలో శానిటరీ ప్యాడ్​ల వినియోగం, టీనేజ్ బాలికలకు గుడ్, బ్యాడ్​ టచ్​లపై అవగాహన కల్పిస్తున్నారు జయంతి బృందం. అలాగే గిరిజన మహిళలకు మొబైల్స్ వినియోగం, వీడియోల రికార్డ్ చేయటం, కథలను రాయటం నేర్పిస్తున్నారు. జిల్లాలోని 50మంది మహిళలతో కలిసి 'హమా కహానీ, హమా ద్వారా, హమా పెయిన్' పేరుతో న్యూస్​ ప్లాట్​ఫారమ్​ను ప్రారంభించారు. అందులో గిరిజన మహిళలు పడుతున్న కష్టాలను గురించి చెబుతున్నారు. ఇలా గిరిజనలకు ఉన్న హక్కుల గురించి తెలియజేస్తున్నారు.

ఫోర్బ్స్ జాబితాలో పేరు ఉన్నందుకు సంతోషంగా ఉందని జయంతి అంటున్నారు. 'చేసిన పనికి గుర్తింపు లభించినందుకు ఆనందంగా ఉంది. ఈ ఘనతను నాకు మద్దుతుగా నిలిచిన వాలంటీర్లకు ఇస్తున్నా. గిరిజన మహిళలు గౌరవంగా జీవించే వరకు నేను ప్రయత్నిస్తూ ఉంటా'అని జయంతి పేర్కొన్నారు. ఇక ఈ జాబితాలో జయంతితో పాటు ప్రపంచ బ్యాంక్ ఎండీ అనూషల కాంత్, క్రికెటర్ ప్రతిభా శర్మ, బాలీవుడ్ యాక్టర్ కృతిసనన్​ ఉన్నారు.

దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్​కు బెయిల్​

సార్వత్రిక ఎన్నికల బడ్జెట్​ ఎంతో తెలుసా? ఎలక్షన్లకు అయ్యే ఖర్చు తెలిస్తే షాక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.