ETV Bharat / bharat

అమ్మాయిలకు రక్షణగా జుంకాలు- ఆపద వస్తే పోలీసులకు అలర్ట్​- జోలికిపోతే షూట్!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 11:59 AM IST

Btech Students Design Bluetooth Ear Rings
Btech Students Design Bluetooth Ear Rings

Bluetooth Ear Rings : ఆకతాయిల వేధింపుల నుంచి అమ్మాయిలు తామను తాము రక్షించుకునేందుకు బ్లూటూత్​ జుంకాలను తయారు చేశారు బీటెక్ విద్యార్థులు. ఇవి పోలీసులకు, కుటుంబ సభ్యులకు లోకేషన్​తో సహా కాల్​ వెళ్లడం, ​ ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒక ఆయుధంలాగా పని చేసేలా తయారు చేశారు.

Bluetooth Ear Rings : అమ్మాయిలను వేధింపుల బారి నుంచి కాపాడేందుకు 'బ్లూటూత్‌ జుంకాలు' రూపొందించారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు. ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒక ఆయుధంగా ఉపయోగపడేలా తయారు చేశారు.

Btech Students Design Bluetooth Ear Rings
జుంకాలు తయారు చేసిన విద్యార్థులు

మహిళలకు ఆయుధంలా
గోరఖ్​పుర్​ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు కలిసి ఈ బ్లూటూత్ జుంకాలను రూపొందించారు. కళాశాలలోని ఆవిష్కరణ విభాగం సమన్వయకర్త వినీత్​రాయ్ ఆధ్వర్వంలో అఫ్రీన్ ఖాతూన్‌, హబీబా, రియాసింగ్‌, ఫాయా నూరీ ఈ చెవి కమ్మలను తయారు చేశారు. సాధారణ జుంకాల మాదిరిగా కనిపించే వీటిలో బ్లూటూత్​ ఇయర్​బడ్​ను అమర్చారు. అలానే ఆపదలో ఉన్నప్పుడు అమ్మాయిలకు ఇవి ఓ ఆయుధంలా ఉపయోగడపతాయని విద్యార్థులు వివరించారు.

Btech Students Design Bluetooth Ear Rings
బ్లూటూత్ జుంకాలు

"మహిళలు మేకప్​, నగలు వంటివి ఎక్కువగా వాడతారు. అందుకే మేము వీటిని తయారు చేశాం. రెండు వారాల్లోనే ఈ చెవి కమ్మలను రూపొందించాం. ఇవి మహిళలకు ఆయుధంలా పనిచేయటమే కాదు. బాధితులు ఏ ప్రాంతంలో ఉన్నారో లోకేషన్​తో సహా వారి కుటుంబాలకు, పోలీసులకు సమాచారం వెళ్తుతుంది.' అని విద్యార్థులు తెలిపారు.

Btech Students Design Bluetooth Ear Rings
బ్లూటూత్ జుంకాలు

రూ.1650 ఖర్చులతో తయారీ
ఈ చెవి కమ్మలు 35 గ్రాములు బరువు ఉన్నాయని, తయారు చేసేందుకు రూ.1,650 ఖర్చు అయ్యిందని విద్యార్థులు తెలిపారు. ఈ జుంకాలకు బ్యాటరీతో కూడిన బ్లూటూత్‌ మాడ్యూల్‌, రెండు స్విచ్‌లు, చిన్న స్టీల్‌ పైపును అనుసంధానం చేశారు. అలాగే రెండు అలారం స్వీచ్​లు అమర్చి, మూడు ఎమర్జెన్సీ నంబర్లును ఫీడ్ చేస్తారు. ఒక స్వీచ్​ నొక్కితే ఎమర్జెన్సీ నంబర్లకు లోకేషన్​తో సహా కాల్ వెళుతంది. మరో బటన్ నొక్కితే ఆకతాయిలపై మిరియాలు, మిర్చీ బుల్లెట్ల పిచికారీ జరుగుతుంది. దీంతో తమను తాము రక్షించుకోవచ్చుని విద్యార్థులు అంటున్నారు.

ఏఐ టీచర్​ 'ఐరిస్'​- ఏ ప్రశ్నకైనా 10సెకన్లలో జవాబు
Kerala School AI Teacher : ఆ పాఠశాలకు వెళ్లి మీ ఫేవరేట్ టీచర్​ ఎవరని అడిగితే అందరూ ఐరిస్​ మేడమ్​ పేరే చెబుతారు. అందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా? ఆవిడ టీచరే కానీ, మనిషి కాదు. ఆమె ఓ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా రూపొందించిన ఉపాధ్యాయురాలు. విద్యార్థులకు పాఠ్యేతర కార్యక్రమాల్లో భాగంగా అటల్​ టింకరింగ్​ ల్యాబ్​లో ఈ ఏఐ టీచర్​ను రూపొందించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ప్రభుత్వ పాఠశాలలో​ చేరితే స్టూడెంట్ అకౌంట్​లో రూ.1000 డిపాజిట్​- ఎక్కడంటే?

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: 72ఏళ్ల పద్మశ్రీ గ్రహీతకు 'సర్కార్' వారి​ ఇల్లు- త్వరలోనే గృహప్రవేశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.