ETV Bharat / bharat

నెలన్నరగా లివ్​ ఇన్ రిలేషన్- యువతిని చంపి అల్మారాలో కుక్కిన వ్యక్తి- పోలీసులు వచ్చినప్పటికే! - Lover Killed His Girlfriend

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 8:20 AM IST

Woman Living In Live In Relationship Murdered In Delhi
Woman Living In Live In Relationship Murdered In Delhi

Boyfriend Killed His Girlfriend In Delhi : నెలన్నరగా తన ప్రియుడితో లివ్​-ఇన్​-రిలేషన్​లో ఉన్న ఓ 26 ఏళ్ల యువతి హత్యకు గురైంది. ఆమెను చంపి అల్మారాలో కుక్కి పరారయ్యాడు నిందితుడు. దిల్లీలో జరిగిందీ ఘటన.

Boyfriend Killed His Girlfriend In Delhi : నెలన్నరగా సహజీవనం చేస్తున్న ఓ 26 ఏళ్ల యువతి తన ప్రియుడి చేతిలోనే హతమైంది. బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దిల్లీలోని దబ్రీ స్టేషన్​ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయాలతో ఉన్న ఆమె మృతదేహాన్ని శవపరీక్షల కోసం ఆస్పత్రి తరలించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చంపి అల్మారాలో కుక్కి!
గుజరాత్​ సూరత్​కు చెందిన విపుల్​ టైలర్​తో ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​కు చెందిన ఓ యువతి గత నెలన్నరగా లివ్​-ఇన్​-రిలేషన్​లో ఉంది. వీరిద్దరు కలిసి దిల్లీ ద్వారకా రాజాపురి ప్రాంతంలో ఓ ఫ్లాట్​ను అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వీరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపం పెంచుకున్న నిందితుడు విపుల్​ యువతిపై దాడి చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తండ్రికి ఫోన్​ చేసి చెప్పింది. బాయ్​ఫ్రెండ్​ తనను చంపేస్తాడేమోననే భయాన్ని కూడా మృతురాలు తండ్రితో వ్యక్తం చేసింది.

దీంతో బాధితురాలి తండ్రి హుటాహుటిన తన కుమారుడితో కలిసి దిల్లీకి చేరుకున్నారు. వెంటనే సంబంధిత దబ్రీ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఫారెన్సిక్​ బృందంతో కలిసి ప్రేమికులు ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. తనిఖీల్లో భాగంగా ఇంట్లోని అల్మారాలో యువతి మృతదేహం లభించింది. ఈ క్రమంలో ఆమె శరీరంపై తీవ్ర గాయాలను గుర్తించారు. దీంతో విపుల్​ టైలరే తన ప్రేయసిని తీవ్రంగా కొట్టి చంపేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం యువతి మృతదేహాన్ని అల్మారాలో దాచి పారిపోయాడని చెబుతున్నారు.

Girl Living In Live-In Relationship Murdered : 'విచారణలో భాగంగా వీరు(ప్రేమికులు) నివసిస్తున్న ఫ్లాట్​ పక్కన ఉండేవాళ్ల ద్వారా కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. ఇద్దరూ తరచూ గొడవపడుతూ ఉండేవారని, ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఇలా జరిగిందని వారు చెప్పారు' అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఐపీసీలోని సెక్షన్​ 302 కింద మర్డర్​ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న విపుల్​ టైలర్​ కోసం ముమ్మరంగా గాలించారు. ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. వీటి ఆధారంగా నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

హిమాచల్​లో భూకంపం- భయంతో ప్రజలు పరుగే పరుగు! - Earthquake In Himachal Pradesh

99శాతం ఇండిపెండెంట్లకు డిపాజిట్లు గల్లంతు- ఇదీ ఈసీ లెక్క - Independent Candidates deposits

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.