ETV Bharat / bharat

అయోధ్య రామయ్య ఒంటిపై ఉన్న బంగారం ఎంతో తెలుసా? వీటిని ఎవరు చేశారు?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 6:05 PM IST

Updated : Jan 30, 2024, 6:51 PM IST

Ayodhya Ram Jewellery : అయోధ్య బాలరాముడిపై ఉన్న ఆభరణాలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. రామయ్య ఒంటిపై 15కిలోల బంగారం, 18వేల పచ్చలు, వజ్రాలు ఉన్నాయట. మరి ఈ నగలను ఎవరు తయారుచేశారు? ఎన్ని రోజుల్లో రూపొందించారో తెలుసుకుందామా.

Ayodhya Ram Jewellery
Ayodhya Ram Jewellery

Ayodhya Ram Jewellery : అయోధ్యలో ఇటీవలే రామయ్య ప్రాణప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఆ సమయంలో బాలరాముడు దేదీప్యమానంగా వెలిగిపోతూ భక్తులకు అద్భుతంగా దర్శనం ఇచ్చాడు. అయితే, ఈక్రమంలోనే రామయ్య ఒంటిపై ఉన్న నగలు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాయి. మరి రామయ్య ఒంటిపై ఎన్ని కిలోల బంగారం, వజ్రాలు ఉన్నాయో తెలుసుకుందామా.

Ram Lalla Jewellery : రామ్​లల్లా ఒంటిపై 15కిలోల బంగారం, 18వేల పచ్చలు(మరకతమణులు), వజ్రాలు ఉన్నాయట. బాలరాముడికి తిలకం, కిరీటం, నాలుగు హారాలు, నడుము పట్టి, రెండు జతల చీలమండలు, విజయమాల, రెండు ఉంగరాలు సహా మొత్తం 14 ఆభరణాలు ఉన్నాయి. ఈ ఆభరణాల తయారీని ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూకు చెందిన హర్షహైమల్ శ్యామ్​లాల్ జ్యువెల్లరీకి రామ్​లల్లా ప్రాణప్రతిష్ఠకు 15రోజుల ముందు అప్పగించింది రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. అయితే కేవలం 12 రోజుల్లోనే రామయ్య ఆభరణాలు తయారుచేసింది జ్యువెల్లరీ సంస్థ.

  • 🚩जय श्री राम 🚩

    We are very proud to have designed and crafted all of Shri Ram Lalla’s jewellery. Specially curated for the Lord’s Return to his rightful throne in Ayodhya, each of these 14 jewels is a timeless masterpiece.

    🚩जय श्री राम 🚩 https://t.co/jKrfF7gkUU

    — Harsahaimal Shiamlal Jewellers (@hsj_jewellers) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • "Deeply grateful to Shri Ram Janmbhoomi Teerth Kshetra for acknowledging the craftsmanship of Harsahaimal Shiamlal Jewellers in adorning Prabhu Shri Ram Lalla with divine ornaments, reflecting a vision of spirituality and tradition"

    "Jai Shri Ram" https://t.co/YRRUD5WxEb

    — Harsahaimal Shiamlal Jewellers (@hsj_jewellers) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాలరాముడికి ఆహార్యానికి తగ్గట్టుగా కిరీటాన్ని రూపొందించారు తయారీదారులు. అలాగే 16 గ్రాముల బంగారంతో రామయ్య నుదిటిపై తిలకాన్ని తీర్చిదిద్దారు. 65 గ్రాముల బరువున్న మరకతమణి ఉంగరాన్ని అందంగా తయారుచేశారు. ఈ ఆభరణాలు రామయ్య దివ్య సౌందర్యాన్ని మరింత పెంచాయి.

రామయ్యకు విరాళాలు
మరోవైపు రాములోరికి విరాళాలు అందించిన వారిలో సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్‌ లాఖి మొదటిస్థానంలో ఉన్నారు. సుమారు 101 కిలోల బంగారాన్ని అయోధ్య రామమందిరానికి ఆయన కుటుంబం భూరి విరాళం ఇచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం రూ.68 వేల ఉంది. అలా చూసుకుంటే దిలీప్ కుటుంబం రామమందిరానికి రూ.68 కోట్లు కానుకగా ఇచ్చినట్టు అవుతుంది. రామ మందిర ట్రస్టుకు వచ్చిన విరాళాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక మొత్తం అని తెలుస్తోంది.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపూ 11 కోట్ల రూపాయలను రామ మందిరానికి విరాళంగా ఇచ్చారు. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద భాయ్‌ ఢోలాకియా 11 కోట్లు విరాళమిచ్చారు. అమెరికా, కెనడా, బ్రిటన్‌లో నివసిస్తున్న రామ భక్తులు కలిసి 8 కోట్ల రూపాయల విరాళాలను సమకూర్చారు. ఇలా భక్తులు తమ వంతు రామమందిర నిర్మాణానికి విరాళాలు అందించారు.

  • PM Narendra Modi offers prayers to Ram Lalla. The idol was unveiled at the Ram Temple in Ayodhya during the Pran Pratishtha ceremony. pic.twitter.com/5pTVU0aqHN

    — ANI (@ANI) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రామయ్య ప్రాణప్రతిష్ఠ
శ్రీరామజన్మభూమి అయోధ్యలో జనవరి 22న రామయ్య కొలువుదీరాడు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య యాజమాన్‌గా ప్రధాని మోదీ వ్యవహరించారు. ప్రధాని మోదీ సమక్షంలో ఆలయంలో తొలుత ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రాలు, మంగళవాద్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

అయోధ్య రామయ్యను దర్శించుకున్న హనుమంతుడు! గర్భగుడిలో ఆసక్తికర ఘటన

అయోధ్య రాముడికి కొత్త పేరు- ఇకపై ఏమని పిలుస్తారంటే?

Last Updated : Jan 30, 2024, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.