తెలంగాణ

telangana

ఈ ఆహారంతో కండరాలకు ఎంతో బలం

By

Published : Oct 25, 2021, 7:21 AM IST

కండరాలు బలంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. మరి కండరాలు బలోపేతం కావటానికి ఎలాంటి ఆహారాన్ని తినాలి? ఆహారంతో పాటు ఇంకా ఏం చేయాలి?

muscles strong food items
కండరాలకు బలమిచ్చే ఆహారం

కండరాలు బలంగా ఉండాలని కోరుకుంటున్నారా? కింద పడిపోయే ముప్పు తగ్గించుకోవాలని భావిస్తున్నారా? అయితే రోజూ పాలకూర వంటి ఆకుకూరలు తిని చూడండి. ఇవి కండరాలు బలోపేతం కావటానికి, ఫలితంగా వృద్ధాప్యంలో శక్తి కోల్పోయి కింద పడిపోయే ముప్పు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదంతా ఆకుకూరల్లోని నైట్రేట్ల గొప్పతనం. రోజుకు ఒక కప్పు ఆకుకూరలు తిన్నా కండరాల సామర్థ్యం, పనితీరు మెరుగవుతుంది.

ప్రతి రోజూ 12 ఏళ్ల పాటు ఆకుకూరలు తిన్నవారిలో కాళ్ల బలం 11%, నడక వేగం 4% ఎక్కువగా ఉంటున్నట్టు ఆస్ట్రేలియా పరిశోధకుల అధ్యయనం పేర్కొంటోంది. వ్యాయామంతో సంబంధం లేకుండానే ఈ ప్రయోజనాలు కనిపిస్తుండటం విశేషం. అలాగని వ్యాయామం అవసరం లేదనుకోవద్దు. బరువులు ఎత్తటం వంటి కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలకు ఆకుకూరలు తినటమూ తోడైతే మరింత ఎక్కువ ఫలితం కనిపిస్తుంది. వయసు మీద పడుతున్నకొద్దీ ఆహారం మీద శ్రద్ధ ఇంకాస్త ముఖ్యం. కాళ్లు బలంగా ఉంటే కింద పడిపోవటం, ఎముకలు విరగటం వంటి ముప్పులు తగ్గుతాయి. ఆకుకూరలు మొత్తంగానే ఆరోగ్యానికీ.. ప్రధానంగా గుండెకూ ఎంతో మేలు చేస్తాయి.

ABOUT THE AUTHOR

...view details