తెలంగాణ

telangana

Revanth Reddy: 'ప్రభుత్వ పరీక్షలు నిర్వహించలేని స్థితిలో సీఎం కేసీఆర్‌ పాలన'

By

Published : Apr 28, 2023, 11:01 PM IST

Updated : Apr 28, 2023, 11:08 PM IST

Unemployment Initiation In Nalgonda: పదో తరగతి పరీక్షా పత్రాలు వాట్సప్‌లలో వస్తాయి.. ఇంటర్‌ పరీక్షా పత్రాలు సరిగ్గా దిద్దరు.. టీఎస్‌పీఎస్సీ పేపర్లు బజార్లో సరుకుల్లా అమ్ముతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో జరిగిన నిరుద్యోగ నిరసన దీక్షకు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. అక్కడ జరిగిన కార్నర్‌ సమావేశంలో నిరుద్యోగులను ఉద్దేశించి ప్రసంగించిన కాంగ్రెస్ నాయకులు... కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

rr
rr

Unemployment Initiation In Nalgonda: పరీక్షలను సక్రమంగా నిర్వహించలేని వ్యక్తి సీఎంగా ఎందుకని కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్లు బజార్లో సరుకుల్లా అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలోని మొదట మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ముందు చేపట్టిన నిరసన సభలో పాల్గొని.. అక్కడ నుంచి మర్రిగూడ బైపాస్ మీదుగా నల్గొండ పట్టణ కేంద్రంగా క్లాక్​ టవర్ వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. అక్కడ జరిగే కార్నర్‌ సమావేశంలో నిరుద్యోగులను ఉద్దేశించి రేవంత్‌ రెడ్డి ప్రసంగించి.. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఎలక్షన్స్‌, కలెక్షన్స్‌ కోసం రాజీనామా చేసిన నేత కేసీఆర్‌ అని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ కోసం తన మంత్రి పదవినే త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా జరిగిందని వివరించారు. తీరా చూస్తే ఆ నీళ్లు ఏమో ఏపీ పట్టుకుపోయిందని.. నిధులు మెగా కృష్ణారెడ్డి తీసుకుని.. నియామకాలు ఏమో కేసీఆర్‌ కుటుంబం తీసుకుందని ఆరోపించారు. ఈ గడ్డ నిజాం నవాబునే తరిమికొట్టిన చరిత్ర కలదని హర్షం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పరీక్షలు నిర్వహించలేని స్థితిలో ఈ ప్రభుత్వ పాలన ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చాక.. ఈ ప్రభుత్వం రావడంతో నిరుద్యోగం పెరిగిందని వెల్లడించారు. పదో తరగతి పరీక్షా పత్రాలు వాట్సప్‌లలో వస్తాయి.. ఇంటర్‌ పరీక్షా పత్రాలు సరిగ్గా దిద్దరు.. టీఎస్‌పీఎస్సీ పేపర్లు బజార్లో సరుకుల్లా అమ్ముతారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో తాగుబోతుల సమ్మేళనాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.

నల్గొండ జిల్లా అంటే సాయుధ రైతుల పోరాటం అని గుర్తు చేశారు. ఈ నేల నుంచే చాలా మంది ప్రజా నాయకులు.. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు తీసుకున్న శ్రీకాంతాచారి వంటి బిడ్డలు వచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని తానే తెచ్చానని కేసీఆర్‌ చెప్పుకుంటున్నారన్నారు. ఈ ముఖ్యమంత్రినే కదా.. 2009లో తెలంగాణ ఉద్యమం నడపలేనని చెప్పారని గుర్తుచేశారు. జానారెడ్డి సూచన మేరకు 2009లో జేఏసీ ఏర్పాటు చేశారన్నారు. మలి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని వదిలేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణను సాధించిన నాయకుడు జైపాల్‌రెడ్డి అని స్పష్టం చేశారు.

జానారెడ్డి మాటలు: బీఆర్‌ఎస్‌, బీజేపీ ఈ తొమ్మిదేళ్లలో ఏం చేశాయని.. ప్రచారం తప్పా ఆ రెండు పార్టీలకు ఏం చేయడం రాదని జానారెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లాకు నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే అని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని సీఎంకు.. కమిషన్ల ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ తొమ్మిదేళ్లలో కేసీఆర్‌ ఉద్యోగాల భర్తీనే చేయలేదని విమర్శించారు.

ఇవీ చదవండి:

Last Updated :Apr 28, 2023, 11:08 PM IST

ABOUT THE AUTHOR

...view details