Kollapur MLA Juppally Krishna Rao Profile : జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో 1955, ఆగస్టు 10న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశారు. కృష్ణారావు భార్య సుజన. వీరికి ఇద్దరు కుమారులు (వరుణ్ జూపల్లి, అరుణ్ జూపల్లి) ఉన్నారు. ఆయన ఒక బ్యాంకు ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించారు. క్రమంగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించి విజయం సాధించారు. అనంతరం 1999లో రాజకీయాల్లోకి వచ్చారు.
Kollapur MLA Juppally Krishna Rao Political Entry : జూపల్లి 1999, 2004, 2009, 2012 ఉపఎన్నికలు, 2014లలో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గం(kollapur Constituency) నుంచి వరుసగా ఐదు సార్లు ఎన్నికైన మొదటి ఎమ్మెల్యేగా జూపల్లి కృష్ణారావు ముందు వరుసలో నిలిచారు. ఎమ్మెల్యేగా ఉంటూనే విద్యుత్ సమస్యలపై పోరాడి జైలుకు సైతం వెళ్లారు. నలుగురు ముఖ్యమంత్రుల కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. వై.యస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆహార, పౌర సరఫర, వ్యవహారాల శాఖల మంత్రిగా పనిచేశారు. రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉండేవారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈమెకే తొలి ఉద్యోగం - రేవంత్ రెడ్డి అభయహస్తం
Juppally Krishna Rao Worked BRS Government 2011 : రాజశేఖర్ రెడ్డి మరణానంతరం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఎండోమెంట్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2011 అక్టోబరు 30న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) చేరారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైనా పాత్ర పోషించారు జూపల్లి. కొల్లాపూర్ అంటే జూపల్లి జూపల్లి అంటే కొల్లాపూర్ అనేంతగా పేరు ప్రఖ్యాతలు గడించారు. 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) నుంచి పోటీ చేసి గెలిచి కేసీఆర్ మంత్రివర్గంలో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. జూపల్లి కృష్ణారావు 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్ రెడ్డి (Beeram Harshavardhan Reddy) చేతిలో ఓడిపోయారు.