తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నకూతురిని కాటేసిన తండ్రికి యావజ్జీవ శిక్ష

కన్న కూతురిపై అత్యాచారం చేసిన ఓ తండ్రికి ఉమ్మడి మెదక్ జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధించింది.

father
కన్నకూతురిని కాటేసిన తండ్రికి యావజ్జీవ శిక్ష

By

Published : Dec 13, 2019, 5:07 PM IST

మద్యానికి బానిసై... వావివరుసలు మరచిన తండ్రికి ఉమ్మడి మెదక్ జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సిద్దిపేట జిల్లా వర్గల్​కి చెందిన ఓ తండ్రి... తన కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారించి కోర్టులో ప్రవేశపెట్టగా... మెదక్ జిల్లా ఫస్ట్ అడిషనల్ జడ్జి పాపిరెడ్డి నేరస్థుడికి యావజ్జీవ కారాగార శిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ కేసులో ఆధారాలు సేకరించడం, నిందితుడికి త్వరితగతిన శిక్షపడేలా చేసిన పోలీసులను సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ అభినందించారు.

కన్నకూతురిని కాటేసిన తండ్రికి యావజ్జీవ శిక్ష

ABOUT THE AUTHOR

...view details