రాష్ట్రంలో విద్యాసంస్థలు ఆన్‌లైన్ పాఠాలు బోధించేందుకు తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ ఓక్స్ యాప్‌ను ప్రారంభించింది. ఆన్‌లైన్ అడాప్టివ్ నాలెడ్జ్ సిస్టం పేరుతో తీసుకువచ్చిన ఈ యాప్ ద్వారా లాక్‌డౌన్ సమయంలో విద్యార్థులు చదువుకునే వీలు కల్పించింది.
లాక్‌డౌన్‌లో విద్యార్థులకు వరం.. ఓక్స్ యాప్!
లాక్‌డౌన్ సమయంలో విద్యార్థులు చదువుకుంటూ... పరీక్షలు కూడా రాసుకునేందుకు వీలుగా తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ ఓక్స్ యాప్‌ను ప్రారంభించింది.
లాక్‌డౌన్‌లో విద్యార్థులకు వరం.. ఓక్స్ యాప్!
6 నుంచి 9వ తరగతి విద్యార్థులు ఈ యాప్ ద్వారా కేవలం చదువుకోవటమే కాకుండా పరీక్షలు, అసైన్‌మెంట్లు కూడా చేసుకోవచ్చని గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌లు అందరికీ అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి:తెలంగాణలో 471కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు