Revanth Reddy Fires on CM KCR : రానున్న రోజుల్లో కేసీఆర్ పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి లభిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల ద్వారా తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంతోనే ఆ పార్టీ ఆరు గ్యారెంటీలు(Telangana Congress 6 Guarantees) ప్రకటించిందని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు.. కేసీఆర్ ఎక్కడ ఉన్నారని వెతకావాల్సిన పనిలేదు విమర్శించారు. తెలంగాణ ప్రజలను కల్వకుంట్ల కుటుంబం పట్టి పీడిస్తోందని ధ్వజమెత్తారు. సచివాలయ నిర్మాణంలో ఆ కుటుంబం దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు.
Revanth Reddy Comments on KCR Family :ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక ముందు కేసీఆర్ ఫౌంహౌస్ నుంచి బయటకు రావాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు. డిసెంబర్ నెలలో అద్భుతం ఆవిష్కరించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీరలేదని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ(Telangana Congress Party) నిర్ణయం తీసుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో సంపద పెంచాలని.. అది పేదలకు పంచాలని సూచించారు. సరైన పద్ధతిలో సంపదను పేదలకు పంచడం కాంగ్రెస్ విధానమని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
'కాంగ్రెస్ 6 గ్యారంటీలతో రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయి. తెలంగాణ ప్రజలను కల్వకుంట్ల కుటుంబం పట్టి పీడిస్తోంది. సచివాలయ నిర్మాణంలో కల్వకుంట్ల కుటుంబం దోపిడీకి పాల్పడింది. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ప్రకటించిన తర్వాత కేసీఆర్ ప్రజాక్షేత్రంలో లేరు. డిసెంబర్‌లో రాష్ట్ర ప్రజలకు విముక్తి లభిస్తుంది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంతోనే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. తెలంగాణ ప్రజలు.. కేసీఆర్ ఎక్కడ ఉన్నారని వెతకావాల్సిన పనిలేదు. కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఫౌంహౌస్ నుంచి కేసీఆర్ బయటకు రావాల్సిన పనిలేదు.' -రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు