ETV Bharat / state

TPCC Chief Revanth Reddy on Modi Statement : "బీఆర్‌ఎస్‌, బీజేపీ అవిభక్త కవలలు.. వారిది ఫెవికాల్ బంధం"

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2023, 4:04 PM IST

Updated : Oct 4, 2023, 4:36 PM IST

TPCC Chief Revanth Reddy on Modi Statement : బీఆర్‌ఎస్‌పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ బీజేపీ పొత్తును కుదుర్చుకున్నాయని ఆరోపించారు. వారి మధ్య ఉన్న రహస్య స్నేహబంధం మోదీ మాటల్లో తెలిసిందంటూ విమర్శించారు.

TPCC Chief Revanth Reddy
TPCC Chief Revanth Reddy on Modi Statement

TPCC Chief Revanth Reddy on Modi Statement : ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ ప్రజా గర్జన (Nizamabad Meeting) సభలో చేసిన వ్యాఖ్యలు కుంపటిలా మారాయి. బీఆర్‌ఎస్‌పై మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై రాష్ట్ర పార్టీ నాయకులు ఎక్స్‌ వేదికగా, మీడియా సమావేశాలు నిర్వహిస్తూ వారి వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.

Modi Secret Relation with KCR Revealed By PM : ప్రధాని వ్యాఖ్యలపై టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తు కుదిరించుకున్నాయని ఆరోపించారు. నిజామాబాద్‌లో మోదీ మాటల్లో తెలిసింది బీఆర్‌ఎస్‌ బీజేపీకి ఉన్న సంబంధం అని వారి వ్యాఖ్యలను గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని కేసీఆర్‌ మోదీని కోరారంటూ ఆరోపించారు. కర్ణాటక కాంగ్రెస్‌కు కేసీఆర్‌ డబ్బు పంపించారని మోదీ ఆరోపించారని.. మరీ ఆ సమాచారం ఉంటే కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై ఈడీ, ఐటీ కేసులు ఎందుకు నమోదు కాలేదంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి కేసీఆర్‌ను గెలిపించేందుకు మోదీ తెలంగాణ పర్యటన చేస్తున్నారని ఆరోపించారు.

Bandi Sanjay on KTR : 'కేటీఆర్ మంత్రిగా ఉంటేనే భరించలేకపోతున్నాం.. సీఎం అయితే ప్రజలు తట్టుకోగలరా..?'

కేసీఆర్‌ తన అక్రమ (BJP BRS Alliance Issues) సంపాదనలో కొంత మోదీకి చెల్లిస్తున్నారనన్నా ఆయన.. బీఆర్‌ఎస్ అవినీతిలో బీజేపీని భాగస్వామిని చేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ రహస్య స్నేహాన్ని మోదీ నిజామాబాద్‌లో బయటపెట్టారని తెలిపారు. మోదీ మాటల తర్వాత కూడా ఎంఐఎం బీఆర్‌ఎస్‌తో దోస్తానా చేస్తుందా.. దానికి వారు సమాధానం చెప్పాలంటూ ధ్వజమెత్తారు. సెక్యులర్ వాదులమని చెప్పే అసదుద్దీన్‌ ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు.

" బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక నాణానికి బొమ్మబొరుసు లాంటివారు. మోదీ కేసీఆర్‌ అవిభక్త కవలలు, వారిది ఫెవికాల్ బంధం. గల్లీలో కుస్తీ చేస్తున్నట్లు చేసి దిల్లీలో దోస్తీ చేస్తున్నారు. కేసీఆర్‌ బాస్‌ మోదీ... వీటితో పాటు ఎంఐఎం పార్టీతో కలిపి అందరికి ఎంపీ సీట్ల పొత్తు కుదిరింది. తెలంగాణ సమాజానికి ఎంఐఎం స్పష్టతనివ్వాలి. కాంగ్రెస్ విధానాలు స్పష్టం. మేము ప్రజాస్వామికవాదులం." - టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి

PM Modi Reveals BRS BJP Secret Friendship : నీళ్లు అంటే కవిత కన్నీళ్లు గుర్తొస్తాయి.. నిధులు అంటే కాళేశ్వరం అవినీతి గుర్తుకు వస్తుందని.. నియామకాలు అంటే కేటీఆర్‌కు సీఎం సీటు గుర్తొస్తుందంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ధరణి దోపిడీ, ఔటర్‌, హైదరాబాద్ భూముల అమ్మకంపై ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలంటా డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌కు-9, బీజేపీకి-7, ఎంఐఎం-1 చొప్పున ఎంపీ సీట్ల ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్‌ను ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నాయన్న రేవంత్ రెడ్డి.. మంగళవారం నిజామాబాద్ సభలో మోదీ చెప్పింది నిజమో కాదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

TPCC Chief Revanth Reddy on Modi Statement బీఆర్‌ఎస్‌ బీజేపీ అవిభక్త కవలలు.. వారిది ఫెవికాల్ బంధం

KTR Reacts to Modi Comments On BRS BJP Alliance : 'డిపాజిట్ రాని బీజేపీతో మాకు పొత్తా.. మేము పోరాడేవాళ్లమే తప్ప మోసంచేసే వాళ్లం కాదు'

BJP MP Laxman Reacts To KTR Tweet : 'కేటీఆర్ చెబుతున్నవి పచ్చి అబద్ధాలు.. బీజేపీకి వస్తున్న ఆదరణ ఓర్వలేక అసత్య ప్రచారం'

Last Updated : Oct 4, 2023, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.